ఛండీగర్ : దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు పెరుగుతున్న రాష్ర్టాల్లో ఢిల్లీ ఒకటి. అంతేకాకుండా డిల్లీ సరిహద్దులకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోనూ కరోనా విజృంభిస్తుంది. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి ఆనుకొని ఉన్న సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి గురువారం రాష్ర్ట హోం మంత్రి అనిల్ విజ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ నమోదైంది. ప్రజలు ఒక్కసారిగా గుమిగూడటంతో వాహనాల రద్దీ పెరిగింది. హర్యానాలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం ఢిల్లీకి లింక్ ఉన్నవేనని అనిల్ విజ్ పేర్కొన్నారు. అందువల్లే దేశ రాజధానితో సరిహద్దు ప్రాంతాన్ని మూసివేస్తున్నామని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు
. (బయటికొచ్చినా దొంగ పనులు మానలేదు )
హర్యానాలోని గుర్గావ్, ఫరీదాబాద్, సోనిపట్ , జ్జార్ జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఫరీదాబాద్ జిల్లాలో గరిష్టంగా ఏడుగురు కోవిడ్ బారినపడి చనిపోయారని, గుర్గావ్, సోనిపట్‌లో ఒక్కో మరణం సంబవించినట్లు రాష్ర్ట ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటివ రకు గురుగ్రామ్‌లో గత 24 గంట్లోనే 68 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇక దేశ వ్యాప్తంగా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతూ ప్రపంచంలోనే కరోనా ప్రభావిత దేశాల్లో 9వ స్థానానికి ఎగబాకింది. ఒక్కరోజులోనే 7,466 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు భారత్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,65,799 కి చేరుకున్నట్లు పేర్కొంది. (కరోనా: మరణాల్లో చైనాను దాటిన భారత్ )
Comments
Please login to add a commentAdd a comment