
ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి. తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా, ఉత్తరాఖండ్- నేపాల్ సరిహద్దులను నేటి(మంగళవారం) సాయంత్రం 5 గంటల నుండి 72 గంటల పాటు మూసివేయనున్నారు. అలాగే సరిహద్దు భద్రత కోసం ఎస్‌ఎస్‌బీ సిబ్బందిని నియమించారు.
ఏప్రిల్ 16 సాయంత్రం 5 గంటల నుండి ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటల వరకు భారత్- నేపాల్ సరిహద్దులను మూసివేయనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఓటింగ్ ప్రకియ ముగిసిన తర్వాత భారత్-నేపాల్ సరిహద్దులు తెరవనున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా నేపాల్ నుంచి భారత్ వచ్చేందుకు లేదా నేపాల్ వెళ్లడానికి ఆర్మీ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. నేపాల్.. ఉత్తరాఖండ్‌తో పలు సరిహద్దులను పంచుకుంటుంది. ఈ సరిహద్దులన్నింటిలో ఆర్మీ సిబ్బందిని మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment