
యశవంతపుర: కర్ణాటక–మహారాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలను పెంచారు. పూణె నుంచి హుబ్లీకి బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చే ప్రయాణికుల వద్ద కరోనా ఆర్‌టీ పీసీఆర్ నెగిటివ్ ధ్రువపత్రం, టీకా వేసుకున్నారా లేదా అని పోలీసులు, వైద్య సిబ్బంది తనిఖీలు చేపట్టారు. బెళగావి అదనపు ఎస్పీ అమరనాథరెడ్డి పర్యవేక్షించారు. పత్రాలు లేని ప్రయాణికులను వాపస్ పంపుతున్నారు. కరోనా డెల్టా రకం, మూడో దాడి భయాల నేపథ్యంలో సరిహద్దుల్లో హై అలర్ట్‌ను ప్రకటించారు. ఒక బస్సులో ఎవరికీ పత్రాలు లేకపోవడంతో బస్సును వెనక్కి పంపించారు.
మూడో వేవ్‌పై భయం వద్దు
రాష్ట్రంలో నెలలో 60 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వత్థ నారాయణ తెలిపారు. కరోనా మూడో వేవ్‌పై ఆందోళనగా ఉన్నమాట నిజమే. అయితే ఎవరూ భయపడవలసిన పని లేదన్నారు.