న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దులో నిర్మించబోతున్న వ్యూహాత్మకంగా కీలకమైన బిలాస్‌పూర్–మనాలి–లేహ్ రైల్వే మార్గంలో దేశంలోనే తొలిసారిగా సొరంగంలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటుచేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కీలాగ్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. దేశంలో సొరంగంలో ‘మెట్రో’ స్టేషన్లు ఉన్నా.. సొరంగంలో తొలి ‘రైల్వే స్టేషన్’ మాత్రం ఇదేకానుంది. ‘బిలాస్‌పూర్–మనాలి–లేహ్ మార్గంలో జరిపిన తొలి సర్వే ప్రకారం..కీలాగ్ స్టేషన్‌ను సొరంగంలో నిర్మిస్తాం’ అని ఉత్తర రైల్వే చీఫ్ ఇంజినీర్ డీఆర్ గుప్తా తెలిపారు. 27 కి.మీ పొడవైన సొరంగంలో ఏర్పాటయ్యే కీలాగ్ స్టేషన్ సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. 465 కి.మీ పొడవైన ఈ లైను నిర్మాణానికి రూ.83,360 కోట్లువ్యయం అవుతుందని అంచనా. ఈ లైను భద్రతా బలగాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment