Tunnel Rail Route
-
సముద్ర గర్భం గుండా ‘బుల్లెట్ ట్రైన్’.. దేశంలోనే తొలిసారి!
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి సముద్ర గర్భ సొరంగం మార్గం అందుబాటులోకి రానుంది. ఈ టన్నెల్ నిర్మాణం ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లో భాగంగా నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సముద్ర గర్భంలో సొరంగం పనులకు నేషనల్ హైస్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) బిడ్లను ఆహ్వానిస్తోంది. హైస్పీడ్ రైల్ కారిడార్లో భాగంగా మొత్తం 21 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించనుండగా.. 7 కిలోమీటర్లు సముద్రగర్భంలో తవ్వాల్సి ఉంది. మహారాష్ట్రలోని బంద్రా-కుర్లా కాంప్లెక్స్ మధ్య సాధారణ సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా.. థానే జిల్లాలోని శిల్ఫాటా ప్రాంతంలో సముద్రంలో నిర్మించాల్సి ఉంది. గతంలో అండర్వాటర్ టన్నెల్ నిర్మాణం కోసం ఢిల్లీ-ముంబై మధ్య యమునా నది కింద తవ్వాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, అది సాధ్యపడలేదు. మరోవైపు.. బ్రహ్మపుత్ర నది కింద అన్ని వాహనాలు వెళ్లేందుకు వీలుగా సొరంగ మార్గం ఏర్పాటు కోసం రోడ్డు, రైల్వే మంత్రిత్వ శాఖలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. 2019లోనే హైస్పీడ్ ట్రైన్ టన్నెల్ నిర్మాణానికి ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ టెండర్లు ఆహ్వానించింది. ఆ తర్వాత గత నవంబర్లోనూ మరోసారి బిడ్లను ఆహ్వానించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో కదలిక వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 29 నాటికి బిడ్లు దాఖలు చేయాలని గడువు విధించారు అధికారులు. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య చేపడుతోన్నఈ రైలు కారిడార్ మొత్తం 508.17 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. అహ్మదాబాద్ నుంచి ముంబై కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. ప్రాజెక్టును పూర్తిచేసి 2026లో తొలిదశ ట్రయల్స్ను నిర్వహించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆశాభావంతో ఉంది. ఇదీ చదవండి: Viral Video: మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం! -
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గం
సాక్షి, కడప : కృష్ణపట్టణం–ఓబులవారిపల్లె రైలు మార్గంలో రైలుకూత వినిపిస్తుందని దశాబ్దకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు పూర్తిస్థాయిలో కృష్ణపట్టణం నుంచి ఓబులవారిపల్లె మీదుగా సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లను అధికారులు నడుపనున్నారు. కృష్ణపట్టణం పోర్టు నుంచి ఓబులవారిపల్లెకు దాదాపు 113 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలో విద్యుత్ రైల్ ఇంజిన్ల ద్వారా గూడ్సులను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు రూ.2వేల కోట్లు వ్యయంతో పనులు పూర్తి చేశారు. రైలు మార్గం 2005–06లో మంజూరైంది. ఈనెల 15న రైల్వే అధికారులు ఆర్వీఎన్ఎల్ అధికారులు కలిసి పూర్తిస్థాయి గూడ్స్ ఇంజిన్తో ట్రైయల్రన్గా రైలును నడిపించారు. ఈ మార్గంలో కిలోమీటర్ రెండవ టన్నెల్ ఇదివరకే పూర్తయింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గం ఈ దారిలో ఉంది. పూర్తిస్థాయి ఆస్ట్రేలియన్ టెక్నాలజీతో సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు. ఈ మార్గం కృష్ణపట్టణం పోర్టు నుంచి సరుకు రవాణా చేసేందుకు నిర్మించామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో పూర్తిస్థాయిలో రైల్వేస్టేషన్ల నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఇప్పట్లో ఈ మార్గంలో ప్యాసింజర్ రైలు నడిపేందుకు వీలుపడదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా దశాబ్దాలుగా కడప జిల్లా నుంచి కోస్తాకు, రాష్ట్ర రాజధాని విజయవాడకు నేరుగా రైలుమార్గం ఏర్పాటు చేసి ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 20నుంచి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ ఇంజిన్లతో గూడ్సు రైలును ప్రారంభిస్తామని రైల్వే అధికారులు ప్రకటించినా, అనివార్య కారణాలతో నడపలేదు. ట్రక్ టన్నెల్ వద్ద చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించి గూడ్సు రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. నేడు దక్షిణ మధ్య రైల్వే జీఎం పరిశీలన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన మాల్య, డివిజినల్ రైల్వే మేనేజర్ విజయప్రతాప్సింగ్ శుక్రవారం ఓబులవారిపల్లె–కృష్ణపట్టణం రైలు మార్గాన్ని పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలులో నందలూరుకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక రైలులో మార్గంలోని ట్రాక్ నాణ్యత, టన్నెల్ పనులను పరిశీలించనున్నారు. -
దేశంలోనే తొలి ‘సొరంగ’ రైల్వే స్టేషన్ !
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దులో నిర్మించబోతున్న వ్యూహాత్మకంగా కీలకమైన బిలాస్పూర్–మనాలి–లేహ్ రైల్వే మార్గంలో దేశంలోనే తొలిసారిగా సొరంగంలో రైల్వే స్టేషన్ను ఏర్పాటుచేయనున్నారు. హిమాచల్ప్రదేశ్లోని కీలాగ్లో ఈ స్టేషన్ను నిర్మించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. దేశంలో సొరంగంలో ‘మెట్రో’ స్టేషన్లు ఉన్నా.. సొరంగంలో తొలి ‘రైల్వే స్టేషన్’ మాత్రం ఇదేకానుంది. ‘బిలాస్పూర్–మనాలి–లేహ్ మార్గంలో జరిపిన తొలి సర్వే ప్రకారం..కీలాగ్ స్టేషన్ను సొరంగంలో నిర్మిస్తాం’ అని ఉత్తర రైల్వే చీఫ్ ఇంజినీర్ డీఆర్ గుప్తా తెలిపారు. 27 కి.మీ పొడవైన సొరంగంలో ఏర్పాటయ్యే కీలాగ్ స్టేషన్ సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. 465 కి.మీ పొడవైన ఈ లైను నిర్మాణానికి రూ.83,360 కోట్లువ్యయం అవుతుందని అంచనా. ఈ లైను భద్రతా బలగాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.