వాషింగ్టన్:కెనడా సరిహద్దు ద్వారా అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించి పట్టుబడుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2023-24లో కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి చొరబడేందుకు యత్నించిన వారిలో 23 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం.
అక్రమ చొరబాట్ల సమస్య అమెరికా,కెనడాల మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన సమస్యగా మారిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(యూఎస్‌సీబీపీ) లెక్కల ప్రకారం 2022లో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు 1లక్షా9వేల535 మంది యత్నించగా ఇందులో 16 శాతం మంది భారతీయులే.
2023-24లో మాత్రం ఈ సంఖ్య గణనీయంగా పెరిగి కెనడా నుంచి అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య ఏకంగా 47వేలకు చేరింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ చొరబాట్లపై ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment