న్యూఢిల్లీ: పాకిస్థాన్ 24 గంటల్లో రెండుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైనికులు జమ్మూకశ్మీర్లోని సాంబ జిల్లాలో భారత బలగాలపై కాల్పులు జరిపారు. పాక్ దాడిని భారత్ దీటుగా తిప్పికొట్టింది. భారత్ బలగాలు జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్కు చెందిన నలుగురు సైనికులు మరణించారు. అంతకుముందు పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు మరణించారు. పాక్ దాడిని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. పాక్ దాడులను సహించబోమని, దీటుగా బదులిస్తామని అన్నారు.