భారత స్థావరాలపై పాక్ దాడులు | Pakistan Targets Indian Posts Hours After 5 Die in Cross-border Firing | Sakshi
Sakshi News home page

భారత స్థావరాలపై పాక్ దాడులు

Published Thu, Jan 1 2015 9:43 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

భారత స్థావరాలపై పాక్ దాడులు - Sakshi

భారత స్థావరాలపై పాక్ దాడులు

జమ్మూ: భారత స్థావరాలపై మరోసారి పాకిస్థాన్ దాడులు తెగబడింది. గత రాత్రి పాక్ బలగాలు 12 భారత స్థావరాలపై దాడులకు పాల్పడి ఉద్రిక్త పరిస్థితులకు తెరలేపింది. జమ్మూ కశ్మీర్ లోని సాంబా జిల్లాలోని మోర్తార్ షెల్లింగ్ లో పాకిస్థాన్ బలగాలు కాల్పులకు పాల్పడటంతో ఒక భారత జవాన్ తో సహా ఐదుగురు మృతి చెందారు.ఈ ఘటనలో నలుగురు పాక్ జవాన్లు అసువులు బాసారు.

 

జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్ భూభాగంలోకి ప్రవేశించిన పాక్ బలగాలు  దాడులకు దిగడంతో స్థానిక పౌరుడొకరు తీవ్రంగా గాయపడ్డాడు. గత రెండు రోజుల్లో పాకిస్థాన్ మూడోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతకుముందు పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement