ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో మళ్ళీ ఆమెరికా సైనికులు కాల్పులు ప్రారంభించారు. సరిహద్దు వెంట జరిపిన కాల్పుల్లో ఆఫ్ఘాన్ సరిహద్దులోని కుర్రమ్ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ముగ్గురు తీవ్రవాదులు హతమైనట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. కాల్పులు... పాకిస్తాన్ వైపు నుంచి జరిగాయా, ఆఫ్ఘన్ వైపు నుంచా అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ దాడి ఘటనలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం అమెరికా జరిపిన కాల్పులు ఒకవేళ పాకిస్తాన్ వైపునుంచి జరిగినట్లు అయితే ఈ సంవత్సరంలో ఇది రెండోసారిగా చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అమెరికా డ్రోన్ దాడులు సంఖ్య భారీగా తగ్గినట్లే చెప్పచ్చు. అయితే ఇప్పటికే పాకిస్తాన్ భూభాగంలో ఆమెరికా నిబంధనలు అతిక్రమించి డ్రోన్ దాడులు జరుపుతోందంటూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.
పాక్ సరిహద్దుల్లో మళ్ళీ కాల్పులు
Published Mon, Feb 22 2016 2:44 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM
Advertisement