మొబైల్‌ గ్యాంబ్లింగ్‌ గుట్టురట్టు | police handour to mobile gyambling team | Sakshi
Sakshi News home page

మొబైల్‌ గ్యాంబ్లింగ్‌ గుట్టురట్టు

Published Thu, Sep 22 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

పోలీసులు స్వాధీనం చేసుకొన్న డబ్బు, సెల్‌ఫోన్లు

పోలీసులు స్వాధీనం చేసుకొన్న డబ్బు, సెల్‌ఫోన్లు

– 16 మంది అరెస్టు
–రూ.7.5 లక్షలు స్వాధీనం
–నాలుగు కార్లు, 17 సెల్‌ఫోన్లు స్వాధీనం
–ఆర్గనైజర్లు తిరుపతి వాసులు
సత్యవేడు: తమిళనాడు– ఆంధ్రా సరిహద్దులోని దాసుకుప్పం పంచాయతీ చెరువు సమీపంలో మంగతాయి (లోపల, బయట) ఆడుతున్న 16 మందిని అరెస్టు చేసి రూ.7.5 లక్షలు, 17 సెల్‌ఫోన్లు, 4 కార్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ నరశింహులు తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ దాసుకుప్పం సమీపంలోని చెరువు కట్ట సమీపంలో మొబైల్‌ గ్యాంబ్లింగ్‌ సభ్యులు మంగతాయి ఆడుతున్నట్లు బుధవారం మధ్యాహ్నం సమాచారం అందిందన్నారు. వెంటనే సర్కిల్‌ పరిధిలోని నలుగురు ఎస్‌ఐలతో కలిసి దాడి చేశామన్నారు. దాడిలో వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటికి చెందిన డి.రామిరెడ్డి(42), పి.శ్రీనివాసులు(46), వేరబల్లికి చెందిన వై.ధర్మారెడ్డి(29), సి.బాలకష్ణమరాజు(27), సాంపపల్లికి చెందిన ఎం.సురేంద్రరాజు(43), ఏఐవీ.ప్రసాద్‌(32), షేక్‌ హుసేన్‌(42), పి.ఈశ్వరయ్య(46), బి.ఈశ్వరయ్య(29), తిరుపతికి చెందిన సి.రామచంద్రారెడ్డి(60), కే.జయచంద్ర(21), కేపీ సునీల్‌(40), ఏ.విజయభాస్కర్‌రెడ్డి(60), ఎస్‌.జయచంద్ర(27), చిత్తూరు ఆర్సీపురానికి చెందిన కె.బాలప్రసాద్‌(37), వెదురుకుప్పానికి చెందిన ఈ.సుబ్రమణ్యం(29)ను అరెస్టు చేశామని పేర్కొన్నారు. గ్యాంబ్లింగ్‌ నిర్వహిస్తున్న తిరుపతి వాసులు తప్పించుకున్నారని తెలిపారు. తిరుపతి కేంద్రంగా మొబైల్‌ గ్యాంబ్లింగ్‌ జరుగుతోందని సీఐ తెలిపారు. దాడిలో ఎస్‌ఐలు మల్లేష్‌యాదవ్, షెక్షావలి, ఎన్‌పి. మునస్వామి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నిందితులను గురువారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు.
22ఎస్‌టివిడి07–

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement