అహ్మదాబాద్: పాకిస్థాన్కు చెందిన నాలుగేళ్ల బాలుడు దారితప్పి భారత్ సరిహద్దుల్లోపలికి వచ్చాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆ బాలుడు బీఎస్ఎఫ్ సిబ్బందికి కంటపడ్డాడు. భద్రత సిబ్బంది ఆ బాలుణ్ని చేరదీసి భోజనం, దుస్తులు సమకూర్చారు. ఆడుకోవడానికి బొమ్మలు కూడా ఇచ్చారు.
భారత అధికారులు బాలుడు దారితప్పిన విషయాన్ని పాక్ సైన్యానికి తెలియజేశారు. పాక్ సైన్యం బాలుడు కుటుంబ సభ్యుల వివరాలు కనుగొని వారికి విషయాన్ని తెలియజేశారు. భారత సైన్యం ఆ బాలుడ్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. భారత అధికారులు చూపిన మానవతా దృక్పథానికి పాక్ బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
బోర్డర్ దాటిన నాలుగేళ్ల బాలుడు
Published Sun, Dec 21 2014 8:31 PM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM
Advertisement
Advertisement