సరిహద్దుల్లో అప్రమత్తం
• 16 చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులు గిరిజన గ్రామాల్లో ఆరా
• ముమ్మరంగా తనిఖీలు అయ్యప్ప భక్తులకు తంటాలు
కేరళ నుంచి తప్పించుకున్న మావోరుుస్టులు రాష్ట్రంలోకి చొరబడే అవకాశాలు ఉండడంతో సరిహద్దుల్లో అప్రమత్తంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం వ్యవహరించే పనిలో పడింది. పదహారు చోట్ల ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. గిరిజన గ్రామాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తూ, అనుమానితులు ఎవరైనా సంచరిస్తుంటే సమాచారం ఇవ్వాలని సూచించే పనిలో పడ్డారుు.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకుని ఒకప్పుడు మావోరుుస్టులు తమ కార్యకలాపాల్ని సాగించిన విషయం తెలిసిందే. కొడెకైనాల్‌లో గతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రంలో మావోరుుస్టులు అన్న పేరుకు ఆస్కారం లేకుండా పోరుుంది. ఈ పరిస్థితుల్లో ఇటీవల కాలంగా చత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోరుుస్టుల్ని ఉక్కుపాదంతో అణచి వేస్తుండడంతో, అక్కడి నుంచి తప్పించుకున్న వాళ్లు మళ్లీ పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకునే పనిలో పడ్డట్టుగా సంకేతాలు వెలువడుతూ వచ్చారుు. దీంతో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆపరేషన్‌కు చర్యలు చేపట్టడంతో పశ్చిమ పర్వత శ్రేణుల్లో మళ్లీ కూంబింగ్ సాగుతూ వస్తున్నది. ఈ తనిఖీల్లో అజ్ఞాతంలో ఉన్న మావోరుుస్టు నాయకుడు రూబేష్, సైనాలతో పాటు ఐదుగురు పట్టుబడడం, తదుపరి అజ్ఞాత మావోరుుస్టులు ఒక్కొక్కరుగా పట్టుబడుతుండడంతో సరిహద్దుల్లో అప్రమత్తం వేట ముమ్మరం అరుుంది.
పశ్చిమ పర్వత శ్రేణుల వెంబడి ఉన్న కోయంబత్తూరు, నీలగిరి, ఈరోడ్, తేని, తిరునల్వేలి జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల్లో , సరిహద్దు చెక్ పోస్టుల్లో అప్రమత్తంగా వ్యవహరించే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో గురువారం కేరళలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోరుుస్టులు మరణించారు. మరో పది మంది వరకు పశ్చిమ పర్వత శ్రేణుల్లోకి దూసుకెళ్లిన సమాచారంతో సరిహద్దుల్లో మరింత అలర్ట్ చేస్తూ రాష్ట్ర పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. కేరళలో తప్పించుకున్న మావోరుుస్టులు రాష్ట్రంలోకి చొరబడే అవకాశం ఉండడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. పశ్చిమ పర్వత శ్రేణులపై అధికార వర్గాలు నిఘా పెంచారు. క్యూబ్రాంచ్, ప్రత్యేక బలగాలు శనివారం ఉదయం నుంచి జల్లెడ పట్టే రీతిలో గాలింపు తీవ్రతరం చేశారు.
గిరిజన గ్రామాల ప్రజల వద్ద అనుమానితుల కోసం ఆరా తీస్తున్నారు.ఎవరైనా సంచరిస్తుంటే, తమకు సమాచారం ఇవ్వాలని సూచించి, అందుకు తగ్గ ఫోన్ నంబర్లను వారికి ఇస్తున్నారు. ఇక, అటవీ గ్రామాల్లో అనేక చోట్ల ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి, అటు వైపుగా వచ్చే వాహనాలను, అందులోని ఉన్న వాళ్లను తనిఖీల అనంతరం అనుమతించే పనిలో పడ్డారు. నీలగిరి జిల్లాల్లో అరుుతే, కోరంకుత్తు, హ్యారింగ్ టన్, వెల్లింగ్‌టన్, అప్పర్, లోయర్ భవానీ, కీన్న కొలవై, ఇలియ సిగై, ముత్తులి కేరళ సరిహాద్దుచెక్ పోస్టుల్లో భద్రతను మరింతగా కట్టు దిట్టం చేశారు. అలాగే, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల పరిధిలో అటవీ గ్రామాలను అనుసంధానించే విధంగా అనైకట్టు, మంగలై, పాలమలై, ముర్చి తదితర పదహారు ప్రాంతాల్లో కొత్తగా శనివారం చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
సెంగోటై్ట చెక్ పోస్టులనూ భద్రతను మరింతగా పెంచారు. ఆయా గ్రామాల మీదుగా వెళ్లే చిన్నచిన్న రోడ్లలోనూ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని సిబ్బంది ద్వారా వాహనాల తనిఖీలు సాగిస్తున్నారు. ఇక, డిఐజీ దీపక్ , ఎస్పీ రమ్యభారతి, ఏడీఎస్‌పీ మోహన్‌ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఆయా చెక్ పోస్టుల్ని పరిశీలించారు. వాహనాల తనిఖీ ముమ్మరం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కేరళ నుంచి వచ్చే, ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి వాహనం తనిఖీల అనంతరం అనుమతిస్తున్నారు. అయ్యప్ప భక్తుల సీజన్ కావడంతో ఈ తనిఖీలతో వారికి ఇబ్బందులు తప్పలేదు. కేరళ సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు భద్రతా పరంగా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో అక్కడ కూడా భక్తులకు తనిఖీల కష్టాలు తప్పడం లేదు.