audits
-
బడి బస్సులపై రవాణాశాఖ తనిఖీలు
ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం రవాణాశాఖ ఉప కమిషనర్ సీహెచ్‌వీకే సుబ్బారావు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు జరిగాయి. ఉదయం 7 గంటలు 9.30 వరకు అన్ని ప్రధాన రహదారులపైన 11 మంది మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు వారి బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు పరిధిలో చర్చిసెంటర్, కర్నూల్‌రోడ్డు ఫ్లై ఓవర్, కొత్తపట్నం బస్టాండు సెంటర్, దక్షిణ బైపాస్, వెంగముక్కలపాలెం రోడ్డు, టంగుటూరు టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలు జరిగాయి. అదే వి«ధంగా చీరాల, కందుకూరు, దర్శి, మార్కాపురం ప్రాంతాలలో కూడా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందకుండా నడుపుతున్న పది విద్యాసంస్థల బస్సులను సీజ్ చేసినట్లు రవాణాశాఖ ఉప కమిషనర్ సీహెచ్‌వీకే సుబ్బారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 1630 పాఠశాల బస్సులు ఉన్నాయని, వాటిలో 1180 బస్సులకు 2018–19 విద్యా సంవత్సరానికి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇచ్చామన్నారు. సర్టిఫికేట్ లేకుండా రోడ్డుపైకి వచ్చిన బస్సులను ఒంగోలులో–7, చీరాల–2, దర్శి–1 సీజ్ చేశామన్నారు. మరో 450 బస్సులు ఇంకా రోడ్డుపైకి రాలేదని, వాటికిపై కూడా ప్రత్యేక దృష్టిసారించామన్నారు. వాటిలో కొన్ని బస్సులు 15 ఏళ్ల కాలపరిమితి దాటాయని గుర్తించామన్నారు. అటువంటి బస్సులు ఫిట్నెస్ ఉన్నా వాటికి రాయితీతో కూడిన పన్ను చెల్లింపు కుదరదని, వారు తప్పనిసరిగా సీటుకు రూ.397 చొప్పున చెల్లించి నడుపుకోవాల్సి ఉంటుందని చెప్పారు. -
చిన్నారుల మోములో చిరునవ్వు
నారాయణఖేడ్: బాలలు పనిలో కాదు బడిలో ఉండాలంటూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లా బాలల సంరక్షణ శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. గతంలో మాదిరిగా ప్రచారానికే పరిమితం కాకుండా ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరిట తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాలకార్మికులకు విముక్తి కల్పించడంతోపాటు పనుల్లో పెట్టుకున్న వ్యాపారులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దీంతో వ్యాపార వర్గాల్లో వణుకు ప్రారంభమైంది. అదే క్రమంలో సదరు పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రచార రథాల ద్వారా పల్లెపల్లెన బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలను పనిలో పెట్టుకుంటే తీసుకునే చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్ఆపరేషన్ స్మైల్ జిల్లాలో విజయవంతమైందని అధికారులు చెబుతున్నారు. జనవరిలో ఆపరేషన్ స్మైల్ ద్వారా 107 మంది బాలకార్మికులకు, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 105మందికి విముక్తి కల్పించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను పనుల్లో పెట్టుకోమని లిఖితపూర్వకంగా రాయించుకొని అప్పగించారు. అదే క్రమంలో చిన్నారులను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని వ్యాపారులకు హెచ్చరికలు జారీచేశారు. వారితో లిఖితపూర్వకంగా ధ్రువీకరణ తీసుకున్నారు. అధికారుల చర్యలు వ్యాపారులను హడలెత్తిస్తుండగా తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల్లో పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో నాలుగు సంరక్షణ కేంద్రాలు.. బాలకార్మికులకు విముక్తి కల్పిస్తున్న అధికారులు వారికోసం సంబంధీకులు రాని పక్షంలో వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో దివ్యదిశ హోం, ఖేడ్ మండలం నిజాంపేట్‌లో ఆర్నాల్డ్ హోం, ఇస్నాపూర్‌లో విజనరీ వెంచర్స్‌లో బాలురను ఉంచుతున్నారు. అమీన్‌పూర్‌లోని మహిమ మినిస్ట్రీస్ హోంలో బాలికలు, బాలురను ఉంచుతున్నారు. బాలకార్మికులకు విముక్తి కల్పించిన తర్వాత మొదటగా జిల్లా కేంద్రంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరుస్తారు. ఇందులో చైర్ పర్సన్‌గా శివకుమారి, సభ్యులుగా న్యాయవాది అశోక్, మహారాజ్, కైలాష్, ఆత్మారాం ఉన్నారు. వీరు పిల్లలతో మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే పాఠశాలకు పంపడం, హోంలకు రెఫర్ చేయడం చేస్తారు. బాలల చట్టాలపై అవగాహన.. బాలల చట్టాలపై అధికారులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చిలో 100 గ్రామాలు, నవంబర్‌లో 100 గ్రామా ల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ఏడాది మార్చిలో వంద పల్లెల్లో ప్రచారం చేశారు. ప్రత్యేకంగా ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి బాలల హక్కులు, బాలకార్మిక చట్టాల, అక్రమ రవాణా నిరోధం, లైంగిక వేధింపులు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో మరో వంద గ్రామాల్లో ప్రచారం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బాలల హక్కులు.. ♦ 14ఏళ్లలోపు బాలలతో పనిచేయించడం బాలకార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టం 1986 ప్రకారం నేరం. పనిచేయించిన యజమానులకు సెక్షన్ 14 ప్రకారం ఏడాది జైలు, రూ.20వేల జరిమానా విధిస్తారు. రెండోసారి ఇదే నేరం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష. ♦ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లా కార్మికశాఖ అధికారులు, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, చైల్డ్టోల్ఫ్రీ నం: 1098, 100కు ఫిర్యాదు చేయొచ్చు. ♦ బాలల న్యాయచట్టం (సంరక్షణ) బాలలను రెండు వర్గాలుగా పరిగణిస్తోంది. సెక్షన్ 2(1) ప్రకారం 18ఏళ్లు నిండకుండా నేరం చేసిన బాలలను న్యాయమండలి పర్యవేక్షిస్తుంది. సెక్షన్ 2(డి) ప్రకారం వీధి బాలలు, భిక్షాటన చేస్తున్న బాలలు, జీవనాధారం లేని బాలలు, అనాథ బాలలు, బాలకార్మికులు, పారిపోయిన బాలలు, దీర్ఘకాలిక జబ్బులకు గురైన బాలలు, బాల్య వివాహ బాధిత బాలలు, వేధింపులకు గురైన బాలలకు బాలల సంక్షేమ సమితి పునరావాసం కల్పిస్తుంది. ♦ చట్టవిరుద్ధంగా పిల్లలను పెంచుకోవడం, అమ్ముకోవడం నేరం. పిల్లలను ఇచ్చినా, తీసుకున్నా మూడేళ్ల కారాగార శిక్ష తప్పదు. ప్రభుత్వమే కోర్టు ద్వారా చట్టబద్ధంగా దత్తత ఇస్తుంది. ♦ బాలలకు భారత రాజ్యాంగం ద్వారా 54 (అధికరణలు) హక్కులు వర్తిస్తాయి. వీటిలో ప్రధానంగా జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కు ఉన్నాయి. ♦ బాలలను రక్షించడం, హక్కులను కాపాడేందుకు కొన్ని చట్టాలను తెచ్చారు. 18ఏళ్లలోపు ఆడపిల్ల, 21 ఏళ్లలోపు మగ పిల్లలకు వివాహాలు చేయడం 2006 బాల్యవివాహ నిషేధ చట్టం ప్రకారం నేరం. ఇలాంటి వివాహాలు చెల్లవు. బాల్య వివాహాలు నిర్వహించినా, ప్రొత్సహించినా, సహకరించినా రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. ♦ బాలికలను రవాణా చేయడం అక్రమ రవాణా నిరోధక చట్టం 1956 ప్రకారం నేరం. అక్రమ రవాణా నిరోధానికి ఐసీడీఎస్ అధికారులు, తహసీల్దార్, 1098, 100లకు ఫిర్యాదు చేయొచ్చు. చర్యలు తప్పవు బాలలను పనుల్లో పెట్టుకుంటే సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తాం. పిల్లలను రక్షించి పునరావాసం కల్పిస్తాం. బాల కార్మిక చట్టాలపై ఇప్పటికే గ్రామాల్లో ప్రచార రథం ద్వారా ప్రచారం నిర్వహించాం. మరోసారి అవగాహన కల్పిస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి కాకుండా బడికి పంపించాలి.– రత్నం, జిల్లా బాలలసంరక్షణ అధికారి (డీసీపీఓ) -
ఇదీ విషయం!
బీటీ–3 హెచ్‌టీ పత్తి విత్తనాలు పర్యావరణానికి.. జీవవైవిధ్యానికి హానికరమని, వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. దీంతో ఈ విత్తనాల తయారీకి, విక్రయానికి కేంద్రప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అయినా, కార్పొరేట్ విత్తన సంస్థలు, బహుళ జాతి కంపెనీలు గుట్టుచప్పుడు కాకుండా బీటీ–3 పత్తి విత్తనాల దందా సాగిస్తున్నాయి. ఇందుకు కర్నూలు జిల్లాను కేంద్ర బిందువుగా చేసుకున్నాయి. గతేడాదిలాగే ఈ సారి కూడా వ్యవసాయాధికారుల కళ్లుగప్పి బీటీ–3 పత్తి విత్తనాలను రైతులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయని సమాచారం. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో బీటీ–3 పత్తి విత్తనాల దందా జోరందుకుంది. ఇటీవల వ్యవసాయశాఖాధికారులు ఆదోనిలోని వివిధ విత్తన దుకాణాల్లో తనిఖీలు జరిపి బీటీ–2 ముసుగులో బీటీ–3 పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారని గుర్తించారు. బీటీ–2 పేరుతో బీటీ–3 విత్తనాలు ఉన్న ప్రో సీడ్, సాయి భవ్య( నూజివీడు), మై సీడ్ కంపెనీలకు చెందిన 384 ప్యాకెట్లను సీజ్ చేశారు. ఈ విత్తన విక్రయం ఆదోనిలో ఒక్కటే కాదు జిల్లా వ్యాప్తంగా ఉంది. బీటీ– 3ని ట్రయల్ రన్‌గా నిర్వహించేందుకు విత్తన కంపెనీలు అక్రమ మార్గాల్లో వాటిని మార్కెట్లోకి తెస్తోన్నాయి. అయితే వ్యాపారులు మాత్రం కమర్షియల్ పత్తి సాగుకు బీటీ–2 పేరుతో ఉన్న బీటీ–3 విత్తనాలనే ఇస్తున్నట్లు తెలుస్తోంది. జీవవైవిధ్యానికి, పర్యావరణానికి హానికరమని కేంద్రప్రభుత్వం హెచ్చరిస్తున్నా కార్పొరేట్ కంపెనీలు పట్టించుకోకుండా కర్నూలు జిల్లాను బీటీ–3 విత్తన ప్రయోగశాలగా మార్చి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. గత ఏడాది జిల్లాలో భారీగా సాగు గతేడాది జిల్లా వ్యాప్తంగా 10వేల హెక్టార్లలో బీటీ– 3 పత్తి విత్తనాలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. బీటీ–2 పేరుతోనే ఆ విత్తనాలను రైతులకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఆ విత్తనాలను గుర్తించలేక చాలా మంది రైతులు వాటిని సాగు చేసి ఇబ్బందులు పడ్డారు. బీటీ– 1లో పచ్చపురుగును తట్టుకునే జన్యువు ఉంటే బీటీ–2లో పొగాకు లద్దెపురు, గులాబీరంగు పురుగును తట్టుకునే జన్యువు ఉంటుంది. అదే బీటీ–3లో ప్రమాదకరమైన గ్లైపోసేట్ కలుపు మందు జన్యువు ఎక్కిస్తారు. ఈ విత్తనం సాగు తర్వాత రైతులు పంటలో కలుపు నివారణకు గ్లెసెల్ కెమికల్ మందును విచ్చలవిడిగా వాడటంతో విష ప్రభావానికి గురయ్యారు. కార్పొరేట్ సంస్థలపై చర్యలు ఏవీ? కల్లూరు మండలంలో బీటీ–2 విత్తనోత్పత్తి చేసే ఓ రైతు ఇటీవల ఆకాశ్–8888 బీటీ–2 విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేశారు. అనుమానం వచ్చి వాటిని పరీక్ష చేస్తే బీటీ–3 విత్తనాలున్నాయి. ఈ విత్తనాల సాగు ప్రమాదమని వాటిని పక్కన పడేశారు. ఇలా గుట్టుగా బీటీ–3 విత్తనాలు రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలిసినా వ్యవసాయశాఖాధికారులు ఎందుకో కఠినంగా వ్యవహరించడం లేదు. చిన్న కంపెనీలు, కింది స్థాయి అధికారులపై ప్రతాపం చూపుతూ కారణమైన బహుళజాతి కంపెనీలను మాత్రం చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఉక్కిరిబిక్కిరి..!
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్న చందంగా తయారైంది రిజిస్ట్రేషన్శాఖలోని అధికారులు, సిబ్బంది పరిస్థితి. ఎక్కడో గుంటూరు జిల్లా రేపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవకతవకలు జరిగితే, అదే విధంగా ఎక్కడైనా జరిగి ఉంటుందేమోనన్న అనుమానంతో అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యా ్చయాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రేపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ)పై 33 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్టు రుజువు కావడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు డీడీల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లను తనిఖీ చేయిస్తున్నారు. ఆ మేరకు మన జిల్లాలోని కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని 14 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని 18 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆయా కార్యాలయాల సిబ్బంది డీడీల సమగ్ర సమాచారం యుద్ధప్రాతిపదికన ఓ నివేదిక రూపంలో తయారు చేస్తున్నారు. జిల్లాలో 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. 2017 ఏప్రిల్ నుంచి 2018 జనవరి వరకు రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని 18 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 67,271 డాక్యుమెంట్లు, గత ఏడాది ఏప్రిల్ నుంచి 2018 ఫిబ్రవరి వరకు కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 76,995 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో దాదాపు 25 శాతం డాక్యుమెంట్లకు డీడీల రూపంలో నగదు చెల్లింపులు జరిగాయి. మిగతా డాక్యుమెంట్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చలానా తీయడం ద్వారా జరిగాయి. పెద్దనోట్ల చెలామణి రద్దు చేసిన సమయంలో బ్యాంకులకు చలానా తీయబోమని కరాఖండిగా చెప్పి డీడీలు కట్టించుకున్నారు. ఈ సమయంలో ఎక్కువగా డీడీల ద్వారా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. డీడీల ద్వారా రిజిస్ట్రేషన్లు ఇలా.. రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ప్రభుత్వానికి చలానా లేదా డీడీ రూపంలో పన్నును చెల్లిస్తారు. డీడీల ద్వారా జరిగే రిజిస్ట్రేషన్‌లో మొదట తాత్కాలిక నంబర్‌పై రిజిస్ట్రేషన్ చేసి, ఆ డీడీ బ్యాంకు వెళ్లి ప్రభుత్వ ఖజానాకు నగదు జమైనట్టు రసీదు వచ్చాక ఆ డాక్యుమెంటుకు ఒరిజనల్ రిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డీడీ, దాని తాలుకూ డాక్యుమెంట్, నగదు జమ ఎప్పుడైంది, దాని రసీదు నంబర్ తదితర సమాచారంతో స్థానిక సిబ్బందే నివేదిక తయారు చేస్తున్నారు. అనారోగ్యంతోనే విధుల నిర్వహణ ఈ నెల 2వ తేదీ నుంచి ఉన్నతాధికారుల నుంచి సబ్రిజిస్ట్రార్లు, సిబ్బంది అంతా డీడీలపై నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సాధారణ పనులతోపాటు డీడీల నివేదిక చేస్తుండడంతో అధికారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. రాజమహేంద్రవరంలోని పిడింగొయ్యి సబ్‌రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు తీవ్ర అనారోగ్యానికి గురై ఇంటి వద్ద సృహ తప్పారు. అందరికీ సెలవులు రద్దు చేయడంతో చికిత్స తీసుకుని వెంటనే విధులకు హాజరయ్యారు. సబ్ రిజిస్ట్రార్లపైనే డీడీల తనిఖీ బాధ్యత పెట్టడంతో అనారోగ్యంగా ఉన్నా విధులు నిర్వర్తిస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లా, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ కొంత మంది అధికారుల పరిస్థితి ఇలాగే ఉంది. జిల్లా డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్లు కూడా వ్యక్తిగత కార్యక్రమాలు, శుభకార్యాలకు కూడా గౌర్హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. -
సీఫుడ్ నాణ్యత పరీక్ష.. విశాఖలో
⇒ జర్మన్ దిగ్గజం ‘టువ్ సుడ్’ కార్యకలాపాలు షురూ ⇒ యూరప్‌లో గడిచిన ఏడాదిగా పెరిగిన తనిఖీలు ⇒ ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్‌కతాలకు సేవలు... సాక్షి, బిజినెస్ బ్యూరో: చేపలు, రొయ్యల వంటి సముద్ర ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరు. ఉభయగోదావరి జిల్లాల్లో రొయ్యల సాగైతే చెప్పనక్కర్లేదు. కాకపోతే వీటిలో చాలావరకూ అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేసేవే!!. అయితే ఏడాది కిందటి వరకూ యూరప్‌కు వెళ్లిన కంటెయినర్లను అక్కడి సముద్ర సరిహద్దు భద్రత సిబ్బంది పదింట్లో ఒకటి చొప్పున తనిఖీ చేసేవారు. అంటే 10 శాతమన్న మాట. వీటిలో తిరస్కరణకు గురయ్యేవి ఎక్కువవుతుండటంతో... అప్పటి నుంచి ప్రతి రెండింట్లో ఒక కంటెయినర్‌ను తనిఖీ చేయటం మొదలెట్టారు. దీన్నే వ్యాపారావకాశంగా భావించి, అటు పరిశ్రమకు కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో జర్మన్ టెస్టింగ్ దిగ్గజం ‘టువ్ సుడ్’ రంగ ప్రవేశం చేసింది. తూర్పు భారతం మొత్తానికి సేవలందించేందుకు విశాఖ కేంద్రంగా అత్యాధునిక ల్యాబ్‌ను ఆరంభించింది. కేంద్రానికి చెందిన ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అనుమతివ్వటంతో లాంఛనంగా వాణిజ్య కార్యకలాపాల్ని మొదలెట్టింది. ఏటా 220 బిలియన్ యూరోల టర్నోవర్‌ను నమోదు చేస్తున్న ఈ జర్మన్ దిగ్గజానికి ప్రపంచ వ్యాప్తంగా 1860 ల్యాబొరేటరీలుండగా ఒక్క భారత్‌లోనే 34 వరకూ ఉన్నాయి. నిర్మాణ ప్రాజెక్టులతో పాటు సాఫ్ట్వేర్, గృహోపకరణాలు, ఆహారోత్పత్తులు... ఇలా అన్నిటినీ పరీక్షించే ఈ సంస్థకు... ఆహారోత్పత్తుల్ని పరీక్షించే ల్యాబ్‌లు దేశంలో మూడే ఉన్నాయి. ఒకటి విశాఖ కాగా... మిగిలిన రెండూ గుర్గావ్, బెంగళూరులో ఉన్నాయి. ‘‘దేశంలో ఒకో క్లస్టర్ ఒకో దానికి ప్రసిద్ధి. బెంగళూరు తీసుకుంటే అక్కడ పళ్లు, కూరగాయల సాగు ఎక్కువ. ఏపీ, ఒడిశా, బెంగాల్, తెలంగాణను తీసుకుంటే సీ–ఫుడ్‌తో పాటు çపసుపు, మిర్చి ఇతర సుగంధ ద్రవ్యాల సాగు అధికం. అందుకని వీటిని పరీక్షించే సదుపాయం ఇక్కడే ఉంటే ఎగుమతి దార్లకు డబ్బు, సమయం కలిసొస్తాయనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాం’’ అని సంస్థ దక్షిణాసియా వ్యవహారాల అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ జైమిని తెలియజేశారు. మంగళవారమిక్కడ సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ దేశాల్లోని దిగుమతిదారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడి ఉత్పత్తులున్నాయో లేదో తాము పరీక్షిస్తామని చెప్పారాయన. ఏంటీ పరీక్షలు? వ్యవసాయ, డైయిరీ ఉత్పత్తులతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, సీ–ఫుడ్, మాంసం, కాస్మెటిక్స్ వంటి ఉత్పత్తుల్లో విషపూరిత పదార్థాలేమైనా ఉన్నాయా? వాటిలో పోషక విలువలెంత? వాటితో అలర్జీలేమైనా వస్తాయా? వంటి అంశాలన్నిటినీ పరీక్షల్లో తెలుసుకోవచ్చు. ‘‘వాల్‌మార్ట్, మెట్రో వంటి దిగ్గజాలన్నీ మా క్లయింట్లే. వాళ్లు ఇక్కడి సీఫుడ్‌ను దిగుమతి చేసుకుని అక్కడ విక్రయిస్తారు. అందుకని తనిఖీలు మాకు అప్పగిస్తారు. మేం ఎగుమతిదారు తాలూకు ప్లాంటుకు వెళ్లి, తనిఖీలు చేసి, దగ్గరుండి కంటెయినర్లలోకి లోడ్ చేయించటం వంటివి కూడా చేస్తాం’’ అని జైమిని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవల సామాన్య జనం కూడా తాము తాగే నీరు ఎంత సురక్షితమైనదో తెలుసుకోవటానికి పరీక్షలు చేయిస్తున్నట్లు తెలియజేశారాయన. పరీక్షలకు సంబంధించి భారత్‌లో, విదేశాల్లో రకరకాల ప్రమాణాలు పాటిస్తున్నారని... హెచ్ఏసీసీపీ, ఐఎస్ఓ 22000, ఐఎస్ఓ 9001, జీఎంపీ ప్లస్ వంటి పలు ప్రమాణాలకు అనుగుణంగా తాము పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారాయన. దేశవ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి పొందిన ల్యాబొరేటరీలు 120 వరకూ ఉండగా... అనుమతి లే నివి చాలా ఉన్నాయని, ల్యాబ్‌లలో పరికరాల్ని బట్టి పరీక్షలకు ఎంత సమయం పడుతుంది? దాని ఖచితత్వమెంత? అనేవి తెలుస్తాయని చెప్పారాయన. దేశవ్యాప్తంగా తమ ల్యాబ్‌లలో నెలకు 12,000 శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు. ‘‘దేశంలో సీ–ఫుడ్ ప్రధానంగా ఎగుమతయ్యేది విశాఖ పోర్టు నుంచే. దీన్లో 26 శాతం అమెరికాకు, 22 శాతం యూరప్‌కు వెళుతోంది. అందుకని నాణ్యత ప్రమాణాలు పాటించటం తప్పనిసరి. నాణ్యత పాటిస్తేనే ఉత్పత్తి విలువ పెరుగుతుంది’’ అని ఆయన వివరించారు. -
సరిహద్దుల్లో అప్రమత్తం
• 16 చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులు గిరిజన గ్రామాల్లో ఆరా • ముమ్మరంగా తనిఖీలు అయ్యప్ప భక్తులకు తంటాలు కేరళ నుంచి తప్పించుకున్న మావోరుుస్టులు రాష్ట్రంలోకి చొరబడే అవకాశాలు ఉండడంతో సరిహద్దుల్లో అప్రమత్తంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం వ్యవహరించే పనిలో పడింది. పదహారు చోట్ల ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. గిరిజన గ్రామాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తూ, అనుమానితులు ఎవరైనా సంచరిస్తుంటే సమాచారం ఇవ్వాలని సూచించే పనిలో పడ్డారుు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకుని ఒకప్పుడు మావోరుుస్టులు తమ కార్యకలాపాల్ని సాగించిన విషయం తెలిసిందే. కొడెకైనాల్లో గతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రంలో మావోరుుస్టులు అన్న పేరుకు ఆస్కారం లేకుండా పోరుుంది. ఈ పరిస్థితుల్లో ఇటీవల కాలంగా చత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోరుుస్టుల్ని ఉక్కుపాదంతో అణచి వేస్తుండడంతో, అక్కడి నుంచి తప్పించుకున్న వాళ్లు మళ్లీ పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకునే పనిలో పడ్డట్టుగా సంకేతాలు వెలువడుతూ వచ్చారుు. దీంతో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆపరేషన్‌కు చర్యలు చేపట్టడంతో పశ్చిమ పర్వత శ్రేణుల్లో మళ్లీ కూంబింగ్ సాగుతూ వస్తున్నది. ఈ తనిఖీల్లో అజ్ఞాతంలో ఉన్న మావోరుుస్టు నాయకుడు రూబేష్, సైనాలతో పాటు ఐదుగురు పట్టుబడడం, తదుపరి అజ్ఞాత మావోరుుస్టులు ఒక్కొక్కరుగా పట్టుబడుతుండడంతో సరిహద్దుల్లో అప్రమత్తం వేట ముమ్మరం అరుుంది. పశ్చిమ పర్వత శ్రేణుల వెంబడి ఉన్న కోయంబత్తూరు, నీలగిరి, ఈరోడ్, తేని, తిరునల్వేలి జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల్లో , సరిహద్దు చెక్ పోస్టుల్లో అప్రమత్తంగా వ్యవహరించే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో గురువారం కేరళలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోరుుస్టులు మరణించారు. మరో పది మంది వరకు పశ్చిమ పర్వత శ్రేణుల్లోకి దూసుకెళ్లిన సమాచారంతో సరిహద్దుల్లో మరింత అలర్ట్ చేస్తూ రాష్ట్ర పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. కేరళలో తప్పించుకున్న మావోరుుస్టులు రాష్ట్రంలోకి చొరబడే అవకాశం ఉండడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. పశ్చిమ పర్వత శ్రేణులపై అధికార వర్గాలు నిఘా పెంచారు. క్యూబ్రాంచ్, ప్రత్యేక బలగాలు శనివారం ఉదయం నుంచి జల్లెడ పట్టే రీతిలో గాలింపు తీవ్రతరం చేశారు. గిరిజన గ్రామాల ప్రజల వద్ద అనుమానితుల కోసం ఆరా తీస్తున్నారు.ఎవరైనా సంచరిస్తుంటే, తమకు సమాచారం ఇవ్వాలని సూచించి, అందుకు తగ్గ ఫోన్ నంబర్లను వారికి ఇస్తున్నారు. ఇక, అటవీ గ్రామాల్లో అనేక చోట్ల ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి, అటు వైపుగా వచ్చే వాహనాలను, అందులోని ఉన్న వాళ్లను తనిఖీల అనంతరం అనుమతించే పనిలో పడ్డారు. నీలగిరి జిల్లాల్లో అరుుతే, కోరంకుత్తు, హ్యారింగ్ టన్, వెల్లింగ్టన్, అప్పర్, లోయర్ భవానీ, కీన్న కొలవై, ఇలియ సిగై, ముత్తులి కేరళ సరిహాద్దుచెక్ పోస్టుల్లో భద్రతను మరింతగా కట్టు దిట్టం చేశారు. అలాగే, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల పరిధిలో అటవీ గ్రామాలను అనుసంధానించే విధంగా అనైకట్టు, మంగలై, పాలమలై, ముర్చి తదితర పదహారు ప్రాంతాల్లో కొత్తగా శనివారం చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సెంగోటై్ట చెక్ పోస్టులనూ భద్రతను మరింతగా పెంచారు. ఆయా గ్రామాల మీదుగా వెళ్లే చిన్నచిన్న రోడ్లలోనూ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని సిబ్బంది ద్వారా వాహనాల తనిఖీలు సాగిస్తున్నారు. ఇక, డిఐజీ దీపక్ , ఎస్పీ రమ్యభారతి, ఏడీఎస్పీ మోహన్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఆయా చెక్ పోస్టుల్ని పరిశీలించారు. వాహనాల తనిఖీ ముమ్మరం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కేరళ నుంచి వచ్చే, ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి వాహనం తనిఖీల అనంతరం అనుమతిస్తున్నారు. అయ్యప్ప భక్తుల సీజన్ కావడంతో ఈ తనిఖీలతో వారికి ఇబ్బందులు తప్పలేదు. కేరళ సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు భద్రతా పరంగా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో అక్కడ కూడా భక్తులకు తనిఖీల కష్టాలు తప్పడం లేదు. -
ఫస్ట్ డే పల్లె‘టూర్’ సక్సెస్
♦ మంచాల మండలం నుంచి కార్యక్రమం ప్రారంభం ♦ అభివృద్ధి పనులపై క్షేత్రస్థారుులో ఆకస్మిక తనిఖీలు ♦ మారుమూల గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం ♦ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి యాచారం: ‘కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా.. గ్రామాల్లో సమస్యలు అలాగే ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నారుు.. ప్రజాప్రతినిధులు కూడా మళ్లీ, మళ్లీ అవే పనులకు నిధులు అడుగుతున్నారు.. ఇక నుంచి అలా చేసేది లేదు.. అభివృద్ధి పనులపై నేనే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తా’ అని జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాచారం మండల పర్యటనకు శుక్రవారం వచ్చిన ఆమె ఎంపీపీ రమావత్ జ్యోతినాయక్, జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్‌గౌడ్, యాచారం సర్పంచ్ మారోజ్ కళమ్మతో కలిసి విలేకరులతో మాట్లాడారు. క్షేత్రస్థారుులో ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి ‘పల్లెటూర్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నానన్నారు. ఉదయం 4 గంటలకే ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన సమస్యలను గుర్తించి వాటి తీవ్రతను బట్టి అవసరమైన నిధులు అక్కడే మంజూరు చేస్తానన్నారు. ‘పల్లెటూర్’లో ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల ను, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులను సైతం భాగస్వామ్యులను చేసి మారుమూల గ్రామా లను అన్ని విధాలుగా సమగ్రాభివృద్ధి చేస్తానన్నారు. ‘పల్లెటూర్’ కార్యక్రమాన్ని మంచాల మండలం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపా రు. పల్లెటూర్లో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన, జెడ్పీ నిధులతో చేపడుతున్న పనుల పర్యవేక్షణ, తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలపై దృష్టి పెట్టనున్నట్లు తెలి పారు. రానున్న మూడేళ్లల్లో గ్రామాల్లో ఎలాం టి సమస్యలు లేకుండా కృషిచేసి, ప్రధాన సమస్యలను గుర్తించి కోట్ల రూపాయల నిధు లు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు. హరితమే ప్రాణకోటికి జీవనాధారం.. చెట్లతోనే వర్షాలు కురుస్తారుు, లేకపోతే వాతావరణ కాలుష్యంతోపాటు వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశమే లేదని జెడ్పీ చైర్పర్సన్ అన్నారు. హరితహారం పథకం కింద యా చారంలోని ఐకేపీ కార్యాలయం, ఉన్నత పాఠశాల, జాన్ పీటర్ ఉన్నత పాఠశాలల్లో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గొప్ప లక్ష్యంతో చేపట్టిన హరితహారం పథకాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని సూచించారు. వచ్చే మూడేళ్లలో 33 శాతం హరితహారంలో మొక్కలు పెంచడం కోసం ప్రతి వ్యక్తి ఏడాదికి 33 మొక్కలు చొప్పున మూడేళ్లల్లో 100 మొక్కలు నాటేలా లక్ష్యం నిర్దేంశించానన్నారు. మొక్కలు విరివిగా నాటే పంచాయతీలకు ప్రోత్సహకాలు అందజేస్తామన్నారు. వర్షాలు కురవకపో వడం భయానకంగా కనిపిస్తోందన్నారు. ఇలాగే కొనసాగితే ప్రాణకోటికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మొక్కలను నాటిన తర్వాత సంరక్షించుకోవాలని సూచిం చారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రెండు కోట్ల 50 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఏస్ చైర్మన్ నారుుని సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్ పద్మనాభరావు, ఎంపీడీఓ ఉష, ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్, ఎంఈఓ వినోద్‌కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు మారోజ్ కళమ్మ, అచ్చెన మల్లికార్జున్, భవాని, సత్యపాల్, ఎంపీటీసీ సభ్యులు గడల మాధవి, కృష్ణమూర్తి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డెరైక్టర్ యాదయ్యగౌడ్, టీఆర్ఎస్ నాయకులు రమావత్ శ్రీనివాస్ నాయక్, మారోజ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
తనిఖీల్లేవ్!
♦ ఆసరా పెన్షన్లలో సామాజిక తనిఖీలు బంద్ ♦ ఏడాది కాలంగా నిలిచిపోయిన ప్రక్రియ ♦ పరిశీలన లేక పెరుగుతున్న అవకతవకలు ♦ 42 మంది పింఛన్లు కాజేసిన కార్యదర్శులు ♦ చర్యలకు సిఫారసు చేసిన డీఆర్డీఏ పీడీ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆసరా (సామాజిక భద్రత పింఛన్ల పథకం)లో అవకతవకల గుర్తింపునకు తలపెట్టిన సామాజిక తనిఖీల ప్రక్రియకు సర్కారు మంగళం పాడింది. పథకం ప్రారంభంలో ఒకట్రెండు చోట్ల తనిఖీలు చేసిన అధికారులు.. ఆ తర్వాత జాడలేకుండా పోయారు. దీంతో ఏడాది కాలంగా ఈ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీలు జరగలేదు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సామాజిక తనిఖీలను తప్పనిసరి. ఇందులో భాగంగా ఎన్ఆర్ఈజీఏ, ఐడబ్ల్యూఎంఏ కార్యక్రమాలపై క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయి. కానీ సామాజిక భద్రత కింద ఇచ్చే పింఛన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ తనిఖీలకు సంబంధించి ఆదేశాల జారీని అటకెక్కించింది. దీంతో ఆసరా పథకంలో అక్రమాలు పెరుగుతున్నాయి. జిల్లాలో ఆసరా పథకం ద్వారా 2,99,278 మంది లబ్ధి పొందుతున్నారు. వీరికి నెలకు రూ. 37.5 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే పింఛన్ల పంపిణీలో అక్రమాలపై క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదుల ఆధారంగా పరిశీలన చేపట్టి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆ మేరకు నిగ్గుతేల్చుతోంది. అయితే సామాజిక తనిఖీల ప్రక్రియలో గ్రామస్థాయిలో పరిశీలన చేపడతారు. లబ్ధిదారుల ముందే పరిశీలన చేపట్టి.. పూర్తివిషయాలను వెల్లడిస్తారు. అవకతవకలు జరిగినట్లు తేలితే వెంటనే వారిపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఏడాది కాలంగా సామాజిక తనిఖీలు తెరపైకి రాకపోవడంతో పథకం అమలులో పర్యవేక్షణ గాడితప్పింది. నాలుగు మండలాల్లో వెయ్యికిపైగా.. ఆసరా పింఛన్ల పథకం కింద 2014 సెప్టెంబర్ నుంచి లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో 2014-15 వార్షికం చివరల్లో ఆసరాపై సామాజిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో నాలుగు మండలాల్లోని అన్నిగ్రామాల్లో ఈ తనిఖీలు నిర్వహించగా.. సుమారు వెయ్యికిపైగా అవకతవకల్ని గుర్తించారు. ఈమేరకు సొమ్ము రికవరీ చేయాల్సిందిగా డీఆర్‌డీఏను ఆడిట్ అధికారులు సూచించారు. అయితే అన్ని మండలాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా.. అనుకోకుండా ఈ తనిఖీల ప్రక్రియను నిలిచిపోయింది. ఆసరాలో అక్రమాలపై ఇటీవల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో స్పందించిన అధికారులు కొన్ని గ్రామాల్లో క్రమ పద్ధతిలో సర్వే నిర్వహించారు. ఇందులో 42 మంది లబ్ధిదారులు మరణించినప్పటికీ.. వారి పింఛన్ డబ్బులు స్థానిక పంచాయతీ కార్యదర్శులు డ్రా చేస్తున్నట్లు డీఆర్డీఏ అధికారులు గుర్తించారు. దీంతో వారిపై చర్యలకు సిఫార్సు చేస్తూ డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి కలెక్టర్‌కు లేఖ రాశారు. -
అక్రమ మద్యం నిల్వల పట్టివేత
మంచిర్యాల: మండలంలోని కర్ణమామిడి గ్రామంలో ఆదివారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉంచి మద్యంను పట్టుకున్నారు. ఈ సందర్భంగా హాజీపూన్ ఎస్సై తహసీనుద్దీన్ మాట్లాడుతూ, జనమైత్రి పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో జనమైత్రిపై ప్రజలకు అవగాహన కలిపిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా చైతన్యంతో గ్రామాల్లో జరిగే అక్రమాలు, అన్యాయాలపై సమాచారం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. తనకు వచ్చిన సమాచారం మేరకు కర్ణమామిడిలోని లగిశెట్టి తిరుపతి దుకాణంలో తనిఖీలు నిర్వహించగా 37 బీర్లు, 3 విస్కీ బాటిళ్లు లభించగా వాటిని స్వాధీనం చేసుకుని అతని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. తనిఖీల్లో కర్ణమామిడి జనమైత్రి పోలీస్ అధికారి సంపత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
డబ్బే..డబ్బు
రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు రూ. 2.5 కోట్లు స్వాధీనం సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల కమిషన్ నిబంధనలను తుంగలో తొక్కినట్లుగా వ్యవహరిస్తున్న పార్టీల నేతలు నగదు బట్వాడాలో ఏమాత్రం తగ్గేది లేదని మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం నిర్వహించిన దాడుల్లో రూ.2.50 కోట్లు స్వాధీనం అయింది. అలాగే పెద్ద ఎత్తున బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఉడుమలైపేటలో నిర్వహించిన వాహనతనిఖీలో రూ.39.20 లక్షలు పట్టుబడింది. తిరుచందూరు సమీపంలో శనివారం ఉదయం నిర్వహించిన వాహనతనీఖీల్లో అదే నియోజకవర్గం నుండి పోటీచేస్తున్న నటుడు శరత్‌కుమార్ ప్రయాణిస్తున్న కారు నుండి రూ.9లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తంజావూరు జిల్లా తిరువాయూరు సమీపం విలాంగుడి వద్ద తనిఖీల్లో ఒక మినీ వ్యాన్ నుండి రూ.59 లక్షల విలువైన నగలు పట్టుబడ్డాయి. కాంచీపురం జిల్లా తిరుంపెరుంబుత్తూరులోని టోల్గేట్ వద్ద ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహిస్తుండగా చెన్నై నుండి వస్తున్న కారు నుండి రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వేలూరు జిల్లా అన్నాడీఎంకే కౌన్సిలర్ ఏఎస్ బిచ్చై ఇంటిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రూ.2.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గోపీ జిల్లాలో ఒక బస్సును తనిఖీ చేయగా 1.5 కిలోల 23 కాలి వెండి గొలుసులు, 12.5 కిలోల వెండి కడ్డీలు, రూ.50వేల నగదు పట్టుబడింది. పేరావూరణి సమీపం పిన్నవాసల్ గృహసముదాయం వద్ద ఒక కారును తనిఖీ చేసి 225 చీరలు, 15 శాలువాలు, 20 పట్టుచీరలు 295 వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.50వేలని అధికారులు తెలిపారు. ముగప్పేరులోని అన్నాడీఎంకే నేత సుధాకర్ ఇంటిలో రూ.7 కోట్లు నగదు దాచి ఉంచినట్లు సమాచారం అందడంతో డీఎంకే, కాంగ్రెస్ నేతలు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ తరువాత ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు శుక్రవారం అర్దరాత్రి తనికీలు చేసారు. సుమారు గంటపాటూ జరిపిన తనిఖీల్లో నగదు బైటపడలేదు. రూ.20వేలకే పరిమితం@ ఈసీ ప్రచారానికి వెళ్లే అభ్యర్థులు, నేతలు తమ వద్ద రూ.20వేలకు మించి తమ వద్ద ఉంచుకోరాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ శనివారం ప్రకటించారు. అంతకు మించి నగదు ఉన్నట్లయితే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకుంటారని ఆయన హెచ్చరించారు. -
తనిఖీల పేరుతో వేధింపులు తగవు
ఉస్మానియా యూనివర్సిటీ: విద్యావ్యాప్తికి ప్రభుత్వ విద్య సంస్థలతో పాటు ప్రైవేటు విద్య సంస్థలు పోటీపడి పని చేస్తున్నాయనిచ తమపై తనిఖీల పేరుతో వేధింపులు తగవని పలువురు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు అన్నారు. బుధవారం తెలంగాణ నవ నిర్మాణ్ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఓయూ క్యాంపస్ ఆర్ట్స్ కళాశాల న్యూసెమినార్ హాల్లో ప్రైవేటు విద్యా సంస్థలు-ప్రభుత్వ తనిఖీలు’ అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు శివప్రసాద్ అధ్యక్షతన జరగిన కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రతినిథులు మాట్లాడుతూ స్వయం ఉపాధితో పాటు నలుగురికి ఉద్యోగం కల్పిస్తూ సేవ భావంతో విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్న విద్యాసంస్థలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కత్తిగట్టడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా అనేక ఆందోళనల్లో పాల్గొన్నామని, పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రభుత్వం అండగా నిలవకపోగా తనిఖీల పేరుతో వేధిస్తున్నదన్నారు. కళాశాలలు సరిగా లేకుంటే విద్యార్థులు ఎవరూ చేరరని, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ విద్య సంస్థలను పట్టించుకోకుండా తమపై పడటం తగదన్నారు. విద్యా సంస్థల్లో పోలీసులతో తనిఖీలు ఆపాలని, ఫీజు రీఅంబర్స్‌మెంట్ విడుదల చేయాలని, కార్పోరేట్ విద్య సంస్థల దోపిడిని నియంత్రించాలని, బోగస్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ప్రైవేటు విద్య సంస్థల జేఏసీ కన్వీనర్ రమణరెడ్డి, కోకన్వీనర్ సిద్దేశ్వర్, జూనియర్ కళాశాలల జేఏసీ కన్వీనర్ సతీష్, ప్రవేటు కళాశాలల యజమానుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు విజయ్‌భాస్కర్‌రెడ్డి, కన్వీనర్లు లక్ష్మారెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, తిప్పారెడ్డి, రామారావు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజియాదవ్, కల్వకుర్తి ఆంజనేయులు, అంసా అధ్యక్షులు మాందాల భాస్కర్ తదితరులు ప్రసంగించారు. -
రిజర్వు బ్యాంక్‌కు షాక్
సాక్షి, చెన్నై : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ర్టంలో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ప్రత్యేక స్క్వాడ్లు ఓ వైపు, ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లను అను సంధానిస్తూ ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో తనిఖీలు జోరుగా సాగుతున్నాయి. చేతికి నగదు చిక్కితే చాలు, సీజ్ చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్న తనిఖీల బృందాలపై విమర్శలు బయలు దేరుతున్నాయి. లెక్కలోకి రాని నగదు అంటూ ముందుగా పట్టుకుని సీజ్ చేయడం, వాటికి లెక్కలు చూపించిన తరువాయి అప్పగించడం సాగుతూ వస్తోంది. విధి నిర్వహణలో తాము ఏ మేరకు నిక్కచ్చితనంగా వ్యవహరిస్తున్నామో అని చాటుకునేందుకు ఏకంగా రిజర్వు బ్యాంక్‌కే ప్రత్యేక బృందాలు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ నుంచి అధికారుల్ని పరుగులు తీయించాయి. రిజర్వు బ్యాంక్‌కు షాక్: నామక్కల్‌జిల్లా పరమత్తి సమీపంలో ప్రత్యేక బృందాలు తనిఖీల్లో నిమగ్నమయ్యాయి. ప్రత్యేక అధికారి బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ఈ తనిఖీలు సాగుతుండగా, టోల్గేట్ వైపుగా నాలుగు కంటైనర్లు ఒకదాని తర్వాత మరొకటి రావడంతో అనుమానం నెలకొంది. ఆ కంటైనర్లను నిలిపి తనిఖీ చేశారు. అందులో చిల్లర నాణేలు ఉండడం, అందుకు తగ్గ లెక్కలు లేని దృష్ట్యా, ఆ నాలుగు లారీలను తహశీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశారు. ఆ కంటైనర్లలో ఉన్న చిల్లర నాణేలు రిజర్వు బ్యాంక్‌కు చెందినట్టు డ్రైవర్లు చెప్పుకున్నా, అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. వాటిని లెక్కించగా కోటి రూపాయల వరకు రూ. పది నాణేలు, 75 లక్షల వరకు రూ. ఐదు నాణేలు, 37 లక్షల వరకు రూ. రెండు నాణేలు, 23 లక్షల వరకు రూ. 1 నాణెం ఉన్నట్టు గుర్తించారు. ఆ నాణెలు హైదరాబాద్ నుంచి కేరళకు వెళ్తున్నట్టు తేలింది. అయితే, ఆ నాణేలు రిజర్వు బ్యాంక్ నుంచి వెళ్తున్నట్టుగా ఎలాంటి ఆధారాలు లేని దృష్ట్యా, సీజ్ చేసినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ఆ కంటైనర్ల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. వాటిలో నాణేలు ఉన్న సమాచారంతో ఆ పరిసర వాసులు కంటైనర్లు చూడడానికి ఎగబడ్డారు. డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో షాక్‌కు గురైన హైద రాబాద్లోని రిజర్వు బ్యాంక్ అధికారులు హుటా హుటిన ఆధారాలకు తగ్గ సమాచారాలు, ఆ నగదు బట్వాడాకు చెందిన వివరాల్ని నామక్కల్ పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫ్యాక్స్ రూపంలో పంపాల్సి వచ్చింది. వాటిని పరిశీలించినానంతరం మూడు గంటల సమయంలో కంటైనర్లను వదలి పెట్టారు. ఇక, గుడియాత్తం సమీపంలో వాహన తనిఖీల్లో ఉన్న పోలీసులు మోటార్ సైకిల్‌పై వచ్చిన శరవణన్ అనే వ్యక్తి వద్ద రూ. నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సొంత పని మీద ఇంటి నుంచి నగదు తీసుకుని వెళ్తున్నట్టు వివరణ ఇచ్చుకున్నా ఫలితం శూన్యం. ఇక, కళ్లకురిచ్చి సమీపంలో ఓ కారులో రూ. 60 వేలు తీసుకొస్తున్న మణి అనే వ్యక్తిని తనిఖీ చేసి, ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అయితే, తన కుమారుడికి ఫీజులు చెల్లించడం కోసం బంధువుల వద్ద నుంచి రూ. 60 వేలు అప్పు తీసుకుని, వస్తుంటే, దానిని కూడా స్వాధీనం చేసుకోవడం ఏమిటో అంటూ మణి గగ్గోలు పెడుతున్నాడు. కొన్ని చోట్ల తనిఖీల పేరిట పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో ఎన్నికల యంత్రాంగంపై విమర్శలు బయలుదేరాయి. -
నెలాఖరు వరకు ‘స్మైల్-2’
* మెదక్ డివిజన్లో ఇప్పటివరకు 23 మంది బాలకార్మికుల గుర్తింపు * జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న 8 బృందాలు * తాజాగా అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, తూప్రాన్‌లో దాడులు : 17 మంది గుర్తింపు * స్మైల్-2 ప్రత్యేక అధికారి హన్మంత్ నాయక్ వెల్లడి అల్లాదుర్గం: జిల్లాలో ఈనెల ఒకటో తేదీన ప్రారంభించిన ‘ఆపరేషన్ స్మైల్-2’ కార్యక్రమాన్ని ఈనెల 31వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆపరేషన్ స్మైల్-2 ప్రత్యేక అధికారి హన్మంత్ నాయక్ తెలిపారు. మంగళవారం పెద్దశంకరంపేట, అల్లాదుర్గంలో తనిఖీలు నిర్వహించి ఎనిమిది మంది బాల కార్మికులను గుర్తించినట్టు చెప్పారు. సీఐడీ, సీడబ్ల్యూసీ, బాలల సంరక్షణ అధికారుల భాగస్వామ్యంతో స్మైల్-2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఎనిమిది బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఇప్పటివరకు మెదక్ డివిజన్ పరిధిలో 23 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని దొంతి, సంగారెడ్డి, నిజాంపేట, మెదక్‌లోని బాలల సంరక్షణ కేంద్రాల్లో చేర్పిస్తున్నట్టు చెప్పారు. బాలలను అదుపులోకి తీసుకునే సమయంలో ఎదిరించిన తల్లిదండ్రులు, యజమానులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఒక్క రోజులోనే 17 మంది గుర్తింపు అల్లాదుర్గం/తూప్రాన్: ‘ఆపరేషన్ స్మైల్-2’లో భాగంగా మంగళవారం పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, తూప్రాన్‌లో తనిఖీలు నిర్వహించారు. పెద్దశంకరంపేట, అల్లాదుర్గంలో నలుగురు చొప్పున అదుపులోకి తీసుకున్నట్టు బాలల సంరక్షణ అధికారి రామకృష్ణ తెలిపారు. కాగా తూప్రాన్‌లోని వివిధ దుకాణాల్లో దాడులు చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఆ ప్రాంత బాలల సంరక్షణ అధికారి భాస్కర్‌గౌడ్ తెలిపారు. -
మరింత గడువు ఇవ్వండి
* కాలేజీల అఫిలియేషన్‌పై హైకోర్టును కోరిన ఏఐసీఈటీ, జేఎన్టీయూ * నాలుగు వారాల్లో పూర్తిచేయాలని ధర్మాసనం ఆదేశం సాక్షి, హైదరాబాద్: 99 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి వాటి అప్రూవల్, అఫిలియేషన్ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలంటూ ఇటీవల ఇచ్చిన ఆదేశాల అమలుకు గడువు కావాలన్న ఏఐసీటీఈ, జేఎన్టీయూ అభ్యర్థనలకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. 4 వారాల్లో తమ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఏఐసీటీఈ అనుమతి ఉండి అఫిలియేషన్ పొందలేకపోయిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ జేఎన్టీయూ అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం.. హైకోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో ప్రమాణాలపై తనిఖీ చేయాలంటూ ఏఐసీటీఈ, జేఎన్టీయూ ప్రతినిధులతో 25 బృందాలను ఏర్పాటు చేస్తూ గతనెల 15న ఉత్తర్వులు జారీచేసింది. కాగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు 6 వారాల గడువు కావాలని ఏఐసీటీఈ తరఫు న్యాయవాది రమాకాంత్‌రెడ్డి కోర్టును అభ్యర్థించారు. ఆరు వారాలు చాలా ఎక్కువ సమయని చెప్పడంతో, 4 వారాల గడువునివ్వాలని జేఎన్టీయూ తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. -
మార్కెట్ యార్డుల్లో సీబీఐ తనిఖీలు
క్రోసూరు : క్రోసూరు మార్కెట్ యార్డులో బుధవారం సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో సీసీఐ ద్వారా జరిగిన పత్తి కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ జరుగుతున్న విషయం విదితమే. ఈ ఏడాది మార్కెట్ యార్డులో సీసీఐ రూ.3.25 లక్షల మేర పత్తి కొనుగోళ్లు చేసింది. వీటికి సంబంధించి రికార్డులు స్వాధీన పరుచుకున్నారు. పత్తి ఎంతమేర యార్డుకు చేరుకుందో వాటికి సంబంధించి రికార్డులు, వేబిల్లులు, రైతు పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్సు కాపీలు, సేల్స్ రికార్డులు, వేబ్రిడ్జి తూకాల బిల్లులు స్వాధీన పరుచుకున్నట్లు తెలిసింది. ప్రతి ఏటా మార్కెట్‌యార్డులో రైతుల పేరుతో పత్తి కొనుగోళ్లు చేసేది తక్కువని, అంతా బ్రోకర్ల ద్వారా యార్డుకు చేరుకున్నవేనని కొందరు రైతులు సీబీఐ అధికారులకు తెలిపారు. పాస్ పుస్తకాల జిరాక్సు కాపీలు లేకుండా రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు చూపిస్తూ బ్రోకర్ల నుంచి సీసీఐ కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. పిడుగురాళ్ల యార్డులో తనిఖీలు పిడుగురాళ్ల రూరల్ : స్థానిక వూర్కెట్ యూర్డులో సీబీఐ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. గత ఏడాది సీసీఐ పత్తి కొనుగోలు జరిగిన వూర్కెట్ యూర్డులు అన్నింట్లోనూ తనిఖీలు నిర్వహించారు. వాటికి సంబంధించి చెక్ బుక్‌లు, బిల్ పుస్తకాలు, రైతులకు ఇచ్చిన బిల్లులను, యూర్డుకు సంబంధించిన రిజిష్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు 6 గంటలపాటు రెండు బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాగా, దీనిపై వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన విలేకరులపై సీబీఐ అధికారులు విరుచుకుపడ్డారు. -
నిఘా వలయం..
సాక్షి, సిటీబ్యూరో: గణతంత్ర దినోత్సవం.. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి మూడంచెల భద్రత కల్పించారు. వేడుకలు జరిగే ఈ మైదానాన్ని బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేపట్టాయి. నగరంలోనూ అణువణువూ గాలింపు చర్యలు చేపట్టారు. స్పెషల్ బ్రాంచ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు సున్నిత ప్రాంతాలపై దృష్టి సారించారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. లాడ్జీలు, హోటళ్లు, సినిమా థియేటర్ల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్లు, అనుమానిత ఉగ్రవాదులపై నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర శివార్లలోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్తీలు, కాలనీల్లో పెట్రోలింగ్‌ను మరింత పెంచారు. నిఘా నీడలో పరేడ్ మైదానం.. గణతంత్ర వేడుకలు జరిగే పరేడ్ మైదానం చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, స్వాతిలక్రా, జాయింట్ పోలీసు కమిషనర్ నాగిరెడ్డి తదితరులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. వేడుకలకు హాజరయ్యేవారిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసిన తర్వాతే మైదానంలోకి అనుమతిస్తారు. గ్రౌండ్లోకి బ్యాగ్‌లు, కెమెరాలు, టిఫిన్ బాక్స్‌లు తీసుకురావద్దని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. మైదానం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలు పార్కింగ్ చేసే ప్రదేశాల్లో సైతం నిఘాను పెంచారు. గ్రౌండ్ చుట్టూ మొబైల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనుమానిత వస్తువులు, కొత్త వ్యక్తులపై నిఘా పెట్టారు. * టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో లాడ్జీలు, హోటళ్లు, సినిమా థియేటర్ల వద్ద మూడు రోజులుగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయా కూడళ్ల వద్ద మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. * సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ యాజమాన్యాలను అప్రమత్తం చేశారు. అన్ని ఠాణాల పరిధిలో మైత్రి, శాంతి కమిటీలతో ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు సమావేశాలు నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులకు ఎప్పటికప్పుడు విలువైన సమాచారం వస్తుండడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. * ఐటీ కారిడార్‌లో మాదాపూర్ డీసీపీ కార్తికేయ అక్కడి షాపింగ్ మాల్స్, ఐటీ కంపెనీలు, సినిమా థియేటర్ల సెక్యూరిటీ గార్డులతో కూకట్‌పల్లిలో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. * నగర డీసీపీలు డాక్టర్ రవీందర్, వెంకటేశ్వరావు, కమలాసన్‌రెడ్డి, సుధీర్‌బాబు, సత్యనారాయణ తమ జోన్ల పరిధిలో రోడ్లపై మార్చ్‌పాస్ట్ చేయించారు. ఫుట్ పెట్రోలింగ్‌ను సైతం చేపట్టారు. రద్దీ మార్కెట్ సెంటర్లలో తనిఖీలు చేశారు. కార్డన్ సర్చ్, డెకాయి ఆపరేషన్లు నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
బ్లాక్‌డే అలర్ట్
* నిఘా కట్టుదిట్టం * రైల్వే స్టేషన్లలో భద్రత పెంపు * అటు బాబ్రీ కోసం.. ఇటు రామాలయం కోసం.. * పోటాపోటీనిరసనలకు పిలుపు సాక్షి, చెన్నై: బాబ్రీ మసీదు కూల్చి వేత దినం బ్లాక్ డేని పురస్కరించుకుని రాష్ట్రంలో భద్రతను పటిష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుది ట్టం చేశారు. రైల్వే స్టేషన్లలో నిఘాను మూడింతలు పెంచారు. కాగా బాబ్రీ మసీదు పునర్నిర్మాణం కోసం మైనారిటీ సంఘాలు, రామాలయం నిర్మాణం కోసం హిందూ సంఘాలు పోటాపోటీగా నిరసనలకు పిలుపునిచ్చారుు. బాబ్రీ మసీదు కూల్చి వేసిన రోజు డిసెంబర్ ఆరవ తేదీని బ్లాక్ డేగా అనుసరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా ఈ రోజు వస్తున్నదంటే చాలు టెన్షన్ తప్పదు. భద్రతను కట్టుదిట్టం చేస్తారు. తనిఖీలు ముమ్మరం చేస్తారు. ఆ రోజు గడిస్తే చాలు పోలీసులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. అయితే, ఈ ఏడాది మునుపెన్నడూలేని రీతిలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు కారణంగా రాష్ట్రంలో ఇటీవల కాలంగా వెలుగు చూస్తున్న సంఘ విద్రోహ శక్తుల కదలికలే. కేంద్రం నుంచి వస్తున్న హెచ్చరికలు, తాజా పరిణామాలు వెరసి రాష్ట్రంలో ఏవైనా విధ్వంసాలకు వ్యూహ రచన జరిగిందా..? అన్న అనుమానాలు బయలు దేరాయి. తనిఖీలు ముమ్మరం శనివారం బాబ్రీ డే కావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, విమానాశ్రయ పరిసరాల్లో భద్రతను పెంచారు. ప్రతి ప్రయాణికుడ్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు, ప్రత్యేకంగా తమిళనాడు స్పెషల్ పోలీసు, సాయుధ రిజర్వు పోలీసుల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచారు. అలాగే, జాతీయ, రాష్ట్ర రహదారుల్లో, అన్ని నగరాల్లోని రోడ్లలో పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. లాడ్జీలు, హోటళ్లలో అనుమానితులెవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో, వినోద కేంద్రాల్లో, మాల్స్‌లలో, సెంట్రల్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లలో, కోయంబేడు బస్టాండులో పోలీసులు అను నిత్యం నిఘాతో వ్యవహరిస్తున్నారు. రైళ్లల్లో, బస్సులలో పార్శిళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నిరసనలు : ప్రతి ఏటా బ్లాక్ డే రోజున మైనారిటీ సంఘాలు నిరసనలు చేపట్టడం పరిపాటే. బాబ్రీ మసీదు పునర్నిర్మాణం నినాదంతో, శాంతి స్థాపన పిలుపుతో ఆయా సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాయి. అయితే, ఈ నిరసనలకు అడ్డుకట్ట వేయాలంటూ కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఇందుకు కోర్టు నిరాకరించింది. దీంతో తమ దైన శైలిలో నిరసనలకు మైనారిటీ సంఘాలు సిద్ధమయ్యాయి. ఇక, తాము సైతం అంటూ రామాలయం నిర్మాణం పిలుపుతో నిరసనలకు హిందూ సంఘాలు పిలుపు నిచ్చాయి. తాంబరం, పల్లావరం తదితర ప్రాంతాల్లో పోటాపోటీగా నిరసనలకు పిలుపునిచ్చారుు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
అటవీశాఖలో ఇంటి దొంగలు..?
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం అటవీ రేంజ్ పరి ధి పర్ణశాల సెక్షనలోని ఒక బీట్ అధికారి ఇంట్లో అక్రమంగా 40టేకు దిమ్మలు ఉన్నట్లు సమాచా రం అందుకున్న అటవీ శాఖ ప్రత్యే సిబ్బంది దాడిచేసి పట్టుకున్నారు.ఆపై ఇంటి దొంగలను కాపాడేందుకు పైఅధికారుల ఒత్తిడి మేరకు యూడీఆర్ కేసును మాత్రమే నమోదు చేసి సిబ్బందిని కాపాడారు . వివరాలు ...చినబండిరేవులో బీట్ అధికారి ఇంటి వెనుక 40టేకు దిమ్మలు అక్రమంగా ని ల్వ ఉంచారని భద్రాచలం నార్త్ ఇన్చార్జ్ డీఎఫ్ఓ రాథోడ్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన ఆప్రాంతానికి ప్రత్యేక సిబ్బందిని పంపి తనిఖీలు చేయించగా టేకు దిమ్మలతో పాటు ఇంట్లోనే ఫర్నీచర్ చేయించడం వారి కంట పడింది. ఈ కలపను మూడు నెలల క్రితం గ్రామాలలో దాడులు చేసి పట్టుకొచ్చి నిల్వ ఉంచారు. నిల్వచేసిన వారిలో ముగ్గురు సిబ్బంది హస్తం ఉన్నట్లు సమాచారం. కలపను పట్టుకున్న వెంటనే యూడీఆర్ కేసు నమోదు చేసి దానిపై నంబర్లు నమోదు చేయాలి. కానీ మూడు నెలలు దాటినా కేసు నమోదు చేయకపోగా నంబర్లు సైతం వేయలేదు. దీనికి తోడు ఆ కలపను స్మగ్లర్లకు విక్రయించడానికి మరో సిబ్బంది సుమారు 45 వేలు వరకు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కలప నిల్వపై ప్రత్యేక సిబ్బంది దాడిచేసి పట్టుకోవడంతో అధికారులు కూడా తమకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కేసును తారుమారు చేసినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ వ్యవహారం గోప్యంగా ఉంచిన అటవీ సిబ్బంది, అదేరోజు దాడి చేసి దిమ్మలను పట్టుకున్నట్లు, యూడీఆర్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ముగ్గురు సిబ్బందితో యూడిఆర్ కేసు నమోదు చేయించిన అధికారులు, కలపను రాత్రికి రాత్రే భద్రాచలం డిపోకు తరలించారు.ఈ విషయంపై భద్రాచలం నార్త్ ఇన్చార్జ్ డీఎఫ్ఓ రాథోడ్‌ను వివరణ కోరగా.. కలప కోసం ప్రత్యేక సిబ్బందిని పంపినమాట వాస్తవమేనన్నారు. కలప ఉన్నమా ట వాస్తవమేనని, కేసు ఎప్పుడు నమోదు చేశారు అనే విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. -
విచారణ ఎందాకా?
‘ఇందిరమ్మ’ ఇండ్ల నిర్మాణంలో అవినీతికి అంతు లేకుండాపోయింది. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రటించారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్నారు. సీబీసీఐడీని రంగంలోకి దించారు.వారు ఊరూరా తిరిగి విచారణ జరిపారు. నివేదికలు మాత్రం వెలుగు చూడడం లేదు. ⇒ అక్రమాల నిగ్గు తేలేనా! ⇒సీబీసీఐడీ దర్యాప్తు పూర్తయ్యేనా? ⇒నాలుగు నెలలు గడిచినా జాడలేని నివేదిక ⇒ఎంపీడీఓలు, తహశీల్దారుల పాత్రపై మౌనం ⇒గృహ నిర్మాణ సంస్థ అధికారులపై అదే సస్పెన్స్ ⇒ఆరంభంలో ఉన్న జోరు ఇప్పుడు లేదెందుకో! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో జరిగిన భారీ అవినీతిపై సీబీసీఐడీ విచారణ ఇంకా కొలిక్కిరాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 2,11,290 ఇండ్లను శాంపిల్‌గా తీసుకుని చేపట్టిన విచారణ కాగితాలకే పరిమితమైంది. జిల్లాలోనే రూ. 42.50 కోట్లు స్వాహా అయ్యాయని తేలింది. ఇళ్ల మంజూరు, నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై మొదట థర్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపించిన ప్రభుత్వం అనంతరం సీబీసీఐడీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. తెలంగాణలోని 593 గ్రామాలలో మొదటి విడత థర్డ్ పార్టీ తనిఖీలు నిర్వహించింది. రెండో విడతలో మరో 90 గ్రామాలలోనూ తనిఖీలు నిర్వహించి నివేదికలు రూపొందించింది. వీటి ఆధారంగా ఆగస్టు 12 నుంచి సీబీ సీఐడీ రంగంలోకి దిగింది. అధికారులు బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో లబ్ధిదారుల జాబితా ఆధారంగా విచారణ జరిపారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా విచారణలో ఏం తేలిందో బట్టబయలు కాలేదు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర వహించిన కొందరు ఎంపీడీఓలు, తహసీల్ దారుల పాత్రపై ప్రభుత్వం ఇంకా మౌనం వహిస్తోంది. గృహ నిర్మాణ సంస్థ అధికారులపై సస్పెన్స్ వీడటం లేదు. ఈ నేపథ్యంలో విచారణ ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియడం లేదు. కట్టకుండానే బిల్లులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అక్రమాలపై నాలుగు నెలల క్రితం రంగంలోకి దిగిన సీబీసీఐడీ దోషుల గురించి ఇంకా ఏమి తేల్చకపోవడం చర్చనీయాం శంగా మారింది. తెలంగాణ జిల్లాలలోని 245 మండలాలు, 625 గ్రామాలలోని 2,11,290 ఇండ్లపై ప్రభుత్వం థర్డ్‌పార్టీ సర్వే నిర్వహిస్తే, 26,122 ఇండ్లలో అక్రమాలు జరిగినట్లు తేలింది. ఇందులో 1,623 ఇండ్లకు రెండుసార్లు, 1,566 పాత ఇండ్లకు బిల్లులు ఇచ్చినట్లు తేలింది. 4,375 కేసులలో ఇండ్లు కట్టకుండానే బిల్లులు కాజేసినట్లు బయటపడింది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 29 గ్రామాలలో 2,705 ఇండ్ల పేరిట రూ. 42.50 కోట్లు స్వాహా కావడం దారుణం. గతంలో ఇక్కడ డీఎంగా పనిచేసిన జ్ఞానేశ్వర్రావు నిజామాబా ద్ శివారు గ్రామాలలో ఇండ్లు నిర్మించినట్లు తప్పుడు రికార్డులు సష్టించి రూ.53.77 లక్షలు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి లబ్ధిదారుల పేరిట ఓ బ్యాంకు జమచేసిన సొమ్మును కొందరు కాజేయడం తో, డీఎం బాధ్యత వహించాల్సి వచ్చింది. ఈ క్ర మంలో ఆయనను 2005లోనే ఉద్యోగం నుంచి తొల గించినా, స్వాహా చేసిన డబ్బు ఇంతవరకు రికవరీ కాలేదు. దీని మీదా సీబీసీఐడీ అధికారులు ఆరా తీశారు. ఊరూరా అక్రమాలే సీబీసీఐడీ అధికారులు ఇంటింటికి తిరిగి విచారణ జరిపారు. కోటగిరి మండలం కొత్తపల్లిలో రూ.44.65 లక్షల అవినీతి జరిగినట్లు తేలినా అందుకు బాధ్యులైనవారిపై అధికారులు చర్యలు తీసుకోలేదు. దీనిని సీబీసీఐడీ గమనించింది. కమ్మరపల్లి మండలం మానాలలో ముగ్గురు అధికారులు రూ.6.84 లక్షల అవినీతికి పాల్పడిన వైనం వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లాలోని 11 మండలాలలో 73 గ్రామాలకు మంజూరైన 2,121 ఇండ్ల పేరిట భారీగా నిధులు స్వాహా అయ్యాయి. సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీసీఐ డీ నివేదికలు సిద్దమైనట్లు కూడ ప్రకటించింది. కరీంనగర్ జిల్లాలోని 54 గ్రామాలలోని 791 ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు తేలింది. వరంగల్ జిల్లాలో 14,003 ఇండ్ల మంజూరు, నిర్మాణాలపై థర్డ్‌పార్టీ సమర్పించిన నివేదిక ప్రకారం నిఘా అధికారు లు ఆరా తీశారు. నాలుగు జిల్లాల్లో జరిగిన ఇండ్ల అక్రమాలపై విచారణ జరిపిన అధికారులు త్వరలోనే నివేదిక సమర్పించనున్నారన్న ప్రచారం కూడ జరిగింది. అయితే ఇప్పటికీ ఇందిరమ్మ స్కామ్‌లో అసలు దోషుల గుట్టురట్టు చేయడంలో ఎందుకు తాత్సారం జరుగుతుందన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. కొత్తపల్లిలో సీఐ విచారణ కోటగిరి : మండలంలోని కొత్తపల్లి గ్రామ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం బోధన్ రూరల్ సీఐ దామోదర్‌రెడ్డి విచారణ జరిపారు. గతంలో ‘పేదల సొమ్ము పెద్దల పాలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడం తో స్పందించిన అధికారులు గ్రామానికి చెందిన ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణను సీఐ దామోదర్‌రెడ్డికి అప్పగిం చారు. ఇందులో భాగంగా ఆయన కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్ల జాబితాతో ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. అధికశాతం బోగస్ రేషన్ కార్డులతో బిల్లులు స్వాహా చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. గ్రామంలో సుమారు 244 ఇళ్లకు సంబంధించిన బిల్లులు అక్రమంగా తీసుకున్నట్టు తెలుస్తోందన్నా రు. పూర్తిస్థాయి విచారణ జరిపి ఉన్నతాధికారుల కు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. ఆయన వెంట కోటగిరి ఎస్ఐ బషీర్ ఆహ్మద్, సర్పంచ్ కళ్యాణి తదితరులు ఉన్నారు. -
‘పోలీస్’ వనం
నందనవనం జల్లెడ అర్ధరాత్రి సోదాలు పోలీసుల అదుపులో 110 మంది అనుమానితులు 48 ఆటోలు, 56 బైక్‌లు స్వాధీనం 20 క్వింటాళ్ల రేషన్ గోధుమల పట్టివేత సరూర్‌నగర్ : నాలుగు వందల మంది పోలీసులు.. పది బృందాలుగా ఏర్పడి ఆదివారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందనవనం, పరిసర కాలనీల్లో ‘కార్డన్ అండ్ సెర్చ్’ పేరిట విస్తృత తనిఖీలు నిర్వహించారు. క్రైమ్ అడిషనల్ డీసీపీ జానకీషర్మిల, ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో ఒక్కమారుగా పోలీసు బృందాలు బస్తీలోని ఇళ్ల మీదకి రావటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై సోదాలు ఉదయం 7 గంటల వరకు కొనసాగాయి. ఈ సోదాల్లో పలువురు అనుమానితులను, కొత్త,పాతనేరస్తులను తమ అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పది అవుట్ పాయింట్లు, పది ఇన్నర్ పాయింట్లతో కూంబింగ్ నిర్వహించారు. జెఎన్ఎన్యూఆర్ఎం, వాంబే కాలనీ, దేవినగర్, నందనవనంలోని 1044 బ్లాక్‌లను అంగుళం కూడా వదలకుండా తనిఖీలు చేశారు. 110 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బస్‌లలో పిక్‌పాకెటింగ్ చేసే రమాదేవి, 16 మంది పాతనేరస్తులు, రౌడీషీటర్ బంగారు శ్రీను, కరుడు గట్టిన హౌస్‌బ్రేకర్ కరీంనగర్‌కు చెందిన ఉస్మాన్, హబీబ్‌లు చిక్కారు. వీరందరిపై పలు జిల్లాల్లో నాన్‌బెయిలబుల్ కేసులున్నాయి. 20 క్వింటాళ్ల రేషన్ గోధుమల స్టాక్‌తో కూడిన, టాటా ఏస్ వాహనం పట్టుబడింది. 9 ఎల్పీజీ సిలిండర్లు, 48 ఆటోలు, 56 బైక్‌లతోపాటు 2 బెల్ట్ షాప్‌లపై దాడి చేసి బీర్లు, వైన్ బాటిళ్లు, గుట్కాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ పద్మవ్యూహం ముగిసిన తర్వాత డీసీపీలు విశ్వప్రసాద్, జానకీషర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కార్డన్ అండ్ సెర్చ్ ఇప్పటి వరకు ఐదుసార్లు నిర్వహించామని, అందులో నందనవనంలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. ఇక నుంచి జోన్ల వారీగా ఈ సోదాలు చేస్తామన్నారు.. ఈ ఆపరేషన్‌లో నలుగురు ఏసీపీలు, 60 మంది ఇన్స్పెక్టర్లు, 80 మంది ఎస్ఐలు, 300 మంది కానిస్టేబుళ్లు, 2 స్పెషల్ టీమ్‌లు, జోనల్టాస్క్ఫోర్స్ బృందాలుగా పాల్గొన్నాయి. -
నిఘా.. నిద్ర
పౌరసరఫరాల శాఖలోని 24 మంది సిబ్బంది ప్రతినెలా రేషన్ దుకాణాలు, పెట్రోల్ బంకులు, కి రోసిన్ డీలర్లపై తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వీరు నెలలో ఒక్కొక్కరు కనీసం పది తనిఖీలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ లెక్కన మొత్తం 24 మంది సిబ్బంది నెలకు కనీసం 240 తనిఖీలు చేయాలి. ఆ మేరకు కేసులు నమోదు చేయాలి. కానీ ఈ ఏడాది ఇప్పటికే 8 మాసాలు గడిచిపోయాయి. ఈ ఎనిమిది మాసాల్లో 1920 తనిఖీలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 150 కేసులు మాత్రమే 6 ‘ఏ’ కింద నమోదు చేశారు. నీలగిరి :మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. సన్న బియ్యం ధరలు ఎగబాకి సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయినా జిల్లా పౌరసరఫరాలశాఖ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మొద్దునిద్ర పోతోందన్న విమర్శలు వినవస్తున్నాయి. గతేడాది జిల్లాలో పంటలసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా మార్కెట్లో బియ్యం, ఇతర వ స్తువుల ధరలు అదుపులో లేవు. కొందరు వ్యాపారులు, రైస్‌మిల్లర్లు నిత్యావసర వస్తువులు, బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి మార్కెట్‌ను శాసిస్తున్నారు. ధరల పెరుగుదలపై నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు, మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అక్రమ నిల్వలు, రేషన్ బియ్యం విషయంలో పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వ్యాపారులకు కొమ్ముకాస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ధరలు పెరిగినప్పుడు తనిఖీలు ఎక్కువ చేయాల్సి ఉండగా అధికారులు వాటివైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. గతేడాది తనిఖీలతో పోల్చితే ఈ ఏడాది అధికారుల దూకుడు తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో గత ఐదారుమాసాల నుంచి నిత్యావసర వస్తువుల ధరలు, సన్న బియ్యం ధరలు మార్కెట్లో అమాంతంగా పెరిగాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ గాడితప్పకుండా చూడడం...ఆహార సలహా సంఘం కమిటీ (ఎఫ్ఏసీ) సమావేశం నిర్వహించి నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా...దీనిపై జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఎఫ్ఏసీ సమావేశం జరగాల్సి ఉంది. గతేడాది ఆగస్టులో ఎఫ్ఏసీ సమావేశం జరిగింది. సమావేశం జరిగి 13 నెలలు దాటినా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు.