ఫస్ట్ డే పల్లె‘టూర్’ సక్సెస్
♦ మంచాల మండలం నుంచి కార్యక్రమం ప్రారంభం
♦ అభివృద్ధి పనులపై క్షేత్రస్థారుులో ఆకస్మిక తనిఖీలు
♦ మారుమూల గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
♦ జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి
యాచారం: ‘కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా.. గ్రామాల్లో సమస్యలు అలాగే ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నారుు.. ప్రజాప్రతినిధులు కూడా మళ్లీ, మళ్లీ అవే పనులకు నిధులు అడుగుతున్నారు.. ఇక నుంచి అలా చేసేది లేదు.. అభివృద్ధి పనులపై నేనే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తా’ అని జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాచారం మండల పర్యటనకు శుక్రవారం వచ్చిన ఆమె ఎంపీపీ రమావత్ జ్యోతినాయక్, జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్‌గౌడ్, యాచారం సర్పంచ్ మారోజ్ కళమ్మతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
క్షేత్రస్థారుులో ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి ‘పల్లెటూర్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నానన్నారు. ఉదయం 4 గంటలకే ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన సమస్యలను గుర్తించి వాటి తీవ్రతను బట్టి అవసరమైన నిధులు అక్కడే మంజూరు చేస్తానన్నారు. ‘పల్లెటూర్’లో ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల ను, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులను సైతం భాగస్వామ్యులను చేసి మారుమూల గ్రామా లను అన్ని విధాలుగా సమగ్రాభివృద్ధి చేస్తానన్నారు. ‘పల్లెటూర్’ కార్యక్రమాన్ని మంచాల మండలం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపా రు. పల్లెటూర్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన, జెడ్పీ నిధులతో చేపడుతున్న పనుల పర్యవేక్షణ, తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలపై దృష్టి పెట్టనున్నట్లు తెలి పారు. రానున్న మూడేళ్లల్లో గ్రామాల్లో ఎలాం టి సమస్యలు లేకుండా కృషిచేసి, ప్రధాన సమస్యలను గుర్తించి కోట్ల రూపాయల నిధు లు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు.
హరితమే ప్రాణకోటికి జీవనాధారం..
చెట్లతోనే వర్షాలు కురుస్తారుు, లేకపోతే వాతావరణ కాలుష్యంతోపాటు వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశమే లేదని జెడ్పీ చైర్‌పర్సన్ అన్నారు. హరితహారం పథకం కింద యా చారంలోని ఐకేపీ కార్యాలయం, ఉన్నత పాఠశాల, జాన్ పీటర్ ఉన్నత పాఠశాలల్లో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గొప్ప లక్ష్యంతో చేపట్టిన హరితహారం పథకాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని సూచించారు. వచ్చే మూడేళ్లలో 33 శాతం హరితహారంలో మొక్కలు పెంచడం కోసం ప్రతి వ్యక్తి ఏడాదికి 33 మొక్కలు చొప్పున మూడేళ్లల్లో 100 మొక్కలు నాటేలా లక్ష్యం నిర్దేంశించానన్నారు. మొక్కలు విరివిగా నాటే పంచాయతీలకు ప్రోత్సహకాలు అందజేస్తామన్నారు. వర్షాలు కురవకపో వడం భయానకంగా కనిపిస్తోందన్నారు.
ఇలాగే కొనసాగితే ప్రాణకోటికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మొక్కలను నాటిన తర్వాత సంరక్షించుకోవాలని సూచిం చారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రెండు కోట్ల 50 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఏస్ చైర్మన్ నారుుని సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్ పద్మనాభరావు, ఎంపీడీఓ ఉష, ఈఓపీఆర్‌డీ శంకర్‌నాయక్, ఎంఈఓ వినోద్‌కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు మారోజ్ కళమ్మ, అచ్చెన మల్లికార్జున్, భవాని, సత్యపాల్, ఎంపీటీసీ సభ్యులు గడల మాధవి, కృష్ణమూర్తి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డెరైక్టర్ యాదయ్యగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు రమావత్ శ్రీనివాస్ నాయక్, మారోజ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.