Development work
-
కడప నగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
-
రూ.8.70 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం
ఎస్కేయూలో పాలకమండలి సమావేశం ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం సోమవారం వీసీ కె.రాజగోపాల్ అధ్యక్షతన వర్సిటీలో నిర్వహించారు. సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. పరీక్షల విభాగం అదనపు నూతన భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు, మెకానికల్ విభాగంలో షెడ్ నిర్మాణానికి రూ.50 లక్షలు , పాలిమర్ సైన్సెస్ విభాగంలో తరగతి గది నిర్మాణానికి రూ. 26.50 లక్షలు, మహిళా వసతి గృహం నూతన భవన నిర్మాణాకి రూ.2.81 కోట్లతో చేపడుతున్న పనులకు పాలకమండలి ఆమోదం తెలిపింది. హాస్టల్స్‌లో ఎలక్ట్రికల్ వైరింగ్‌కు రూ. 10.70 లక్షలు ఖర్చుపెట్టాలని ప్రతిపాదించగా పాలకమండలి సమ్మతించింది. 21 మంది ఆఫీస్ అసిస్టెంట్లకు సంబంధించి నోషన్ ఇంక్రిమెంట్స్, 2010 రీవైజ్డ్ పే స్కేలు అందివ్వడానికి అభ్యంతరాలు ఏమీలేవని పాలకమండలి సభ్యులు అభిప్రాయపడ్డారు. వీరితో పాటుగా నలుగురు సూపరింటెండెంట్లకు నోషన్ ఇంక్రిమెంట్స్ జారీ చేయనున్నారు. ఇదిలాఉండగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పర్యటించి సేవ చేయడానికి మార్కులు కేటాయించాలని రెక్టార్ హెచ్.లజిపతిరాయ్ పాలకమండలి సభ్యలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆయా సబ్జెక్టుకు సంబంధించిన అంశాలను ఎంచుకొని విద్యార్థులను– సమాజానికి అనుసంధానం చేస్తే వర్సిటీ లక్ష్యం నెరవేరుతుందన్నారు. రిజిస్ట్రార్ సుధాకర్ బాబు పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ ఏ.మల్లిఖార్జునరెడ్డి, ఎండ్లూరి ప్రభాకర్, ప్రొఫెసర్ బి.ఫణీశ్వర రాజు, ముచ్చుకోట బాబు, ఎం. రామయ్య, బి.నాగజ్మోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. -
ఫస్ట్ డే పల్లె‘టూర్’ సక్సెస్
♦ మంచాల మండలం నుంచి కార్యక్రమం ప్రారంభం ♦ అభివృద్ధి పనులపై క్షేత్రస్థారుులో ఆకస్మిక తనిఖీలు ♦ మారుమూల గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం ♦ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి యాచారం: ‘కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా.. గ్రామాల్లో సమస్యలు అలాగే ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నారుు.. ప్రజాప్రతినిధులు కూడా మళ్లీ, మళ్లీ అవే పనులకు నిధులు అడుగుతున్నారు.. ఇక నుంచి అలా చేసేది లేదు.. అభివృద్ధి పనులపై నేనే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తా’ అని జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాచారం మండల పర్యటనకు శుక్రవారం వచ్చిన ఆమె ఎంపీపీ రమావత్ జ్యోతినాయక్, జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్‌గౌడ్, యాచారం సర్పంచ్ మారోజ్ కళమ్మతో కలిసి విలేకరులతో మాట్లాడారు. క్షేత్రస్థారుులో ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి ‘పల్లెటూర్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నానన్నారు. ఉదయం 4 గంటలకే ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన సమస్యలను గుర్తించి వాటి తీవ్రతను బట్టి అవసరమైన నిధులు అక్కడే మంజూరు చేస్తానన్నారు. ‘పల్లెటూర్’లో ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల ను, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులను సైతం భాగస్వామ్యులను చేసి మారుమూల గ్రామా లను అన్ని విధాలుగా సమగ్రాభివృద్ధి చేస్తానన్నారు. ‘పల్లెటూర్’ కార్యక్రమాన్ని మంచాల మండలం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపా రు. పల్లెటూర్లో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన, జెడ్పీ నిధులతో చేపడుతున్న పనుల పర్యవేక్షణ, తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలపై దృష్టి పెట్టనున్నట్లు తెలి పారు. రానున్న మూడేళ్లల్లో గ్రామాల్లో ఎలాం టి సమస్యలు లేకుండా కృషిచేసి, ప్రధాన సమస్యలను గుర్తించి కోట్ల రూపాయల నిధు లు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు. హరితమే ప్రాణకోటికి జీవనాధారం.. చెట్లతోనే వర్షాలు కురుస్తారుు, లేకపోతే వాతావరణ కాలుష్యంతోపాటు వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశమే లేదని జెడ్పీ చైర్పర్సన్ అన్నారు. హరితహారం పథకం కింద యా చారంలోని ఐకేపీ కార్యాలయం, ఉన్నత పాఠశాల, జాన్ పీటర్ ఉన్నత పాఠశాలల్లో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గొప్ప లక్ష్యంతో చేపట్టిన హరితహారం పథకాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని సూచించారు. వచ్చే మూడేళ్లలో 33 శాతం హరితహారంలో మొక్కలు పెంచడం కోసం ప్రతి వ్యక్తి ఏడాదికి 33 మొక్కలు చొప్పున మూడేళ్లల్లో 100 మొక్కలు నాటేలా లక్ష్యం నిర్దేంశించానన్నారు. మొక్కలు విరివిగా నాటే పంచాయతీలకు ప్రోత్సహకాలు అందజేస్తామన్నారు. వర్షాలు కురవకపో వడం భయానకంగా కనిపిస్తోందన్నారు. ఇలాగే కొనసాగితే ప్రాణకోటికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మొక్కలను నాటిన తర్వాత సంరక్షించుకోవాలని సూచిం చారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రెండు కోట్ల 50 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఏస్ చైర్మన్ నారుుని సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్ పద్మనాభరావు, ఎంపీడీఓ ఉష, ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్, ఎంఈఓ వినోద్‌కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు మారోజ్ కళమ్మ, అచ్చెన మల్లికార్జున్, భవాని, సత్యపాల్, ఎంపీటీసీ సభ్యులు గడల మాధవి, కృష్ణమూర్తి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డెరైక్టర్ యాదయ్యగౌడ్, టీఆర్ఎస్ నాయకులు రమావత్ శ్రీనివాస్ నాయక్, మారోజ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అభివృద్ధే టార్గెట్
సాక్షి, విజయవాడ : కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. విజయవాడలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆయన దృష్టి సారించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రూ.152 కోట్లతో నిర్మిస్తున్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా) భవన సముదాయాలను ఆయన పరిశీలించారు. వేగవంతంతో, నైపుణ్యంతో, నిర్ధిష్ట సమయంలో నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నారు. నాణ్యత విషయం ఏ మాత్రం రాజీ పడవద్దని అధికారులను హెచ్చరించారు. జమ్మి చెట్టు సెంటర్లో హడ్కో ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తూ దేశంలోని అందరికి 2022 నాటికి సొంత ఇల్లు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. హోటల్పార్చున్ మురళీపార్కులో జాతీయ జలరవాణా అభివృద్ధిపై 13 జిల్లాల ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఉపరితల శాఖ మంత్రి పొన్ను రాధాకృష్ణ పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు జలరవాణాకు సర్వేలు జరుగుతున్నాయని, పార్లమెంట్లోఆమోదం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా సంఘటితంగా కృషి చేయాలన్నారు. ఆకాశవాణి కేంద్రంలో జాతీయపతాకం రూపశిల్పి, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశసేవకు అంకితమైన మహానీయుల స్ఫూర్తితో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సాయంత్రం బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన పుస్తకప్రియుల పాదయాత్ర ముగింపు సభలో పాల్గొని తెలుగులో మంచి రచయితలు ఉన్నారని, వాటి రచనలు ఇతర భాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదిశగా తాను కృషి చేస్తానని అన్నారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వాహకులు ఎన్.శ్రీధరన్ మాట్లాడారు. -
అయ్యో దేవా.. ఇవేం పనులు
ఐనవోలు(వర్ధన్నపేట) : బ్రహోత్సవాలకు ముస్తాబవుతున్న ఐనవోలు మల్లన్న ఆల యంలో అభివృద్ధి పనుల మాటున శాస్త్ర విరుద్ధ పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. శాఖల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. క్రీ.శ. 1077-1129 మధ్య కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ పురాతన ఆలయం కాకతీయ శిల్పకళకు అద్దం పడుతోంది. ఈ ఆలయంలో ఏటా జరిగే మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కలెక్టర్ కిషన్ నేతృత్వంలో ఈ నెల 5న ఆయా శాఖల జిల్లా అధికారులతో గ్రామంలో సమీక్ష సమావేశం నిర్వహించి జాతర ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనుల్లో డొల్లతనం భక్తులకు మెరుగైన సేవలందించాలనే తలంపుతో రూ.లక్షలు ఖర్చు చేసి అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. ఆల యం ఎదురుగా ప్రాంగణంలో కుడి, ఎడ మ వైపు షాబాద్ బండ పరుస్తున్నారు. ఈ పనులు భక్తుల మనోభావాలకు విరుద్ధంగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకతీయ అర్బన్ డెవలప్మెం ట్(కుడా) ఆధ్వర్యంలో రూ. 16 లక్షలతో ఆలయం కుడివైపున షాబాద్ బండతో ఫ్లోరింగ్ పూర్తి కాగా, రెండో విడతలో రూ. 20 లక్షలతో ఎడమవైపు ఫ్లోరింగ్ పనులు ప్రారంభించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ గర్భగుడి కంటే తక్కువ ఎత్తులో ఈ ఫ్లోరింగ్ పనులు చేపట్టాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా రెండు అడుగుల (ఫీట్లు) ఎత్తుగా ఈ పనులు చేస్తున్నార ని పూజారులు విమర్శిస్తున్నారు. పురావస్తు, దేవాదాయశాఖ సమక్షంలో జరగాల్సిన అభివృద్ధి పనుల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. వైభవాన్ని కోల్పోతున్న కాకతీయ కట్టడాలు ఆలయ అభివృద్ధి కోసం 2010లో పురావస్తుశాఖ రూ.కోటి విడుదల చేయగా ఆర్‌ఆండ్‌బీ శాఖ పనులు చేపట్టింది. ఈ నిధులతో ఆలయంలో ఫ్లోరింగ్ పనులు చేశారు. రెండేళ్లు కొనసాగిన ఈ పనులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆలయం ఎదురుగా ఉన్న నృత్యమండపం అభివృద్ధి చేయాల్సి ఉండగా పనులు చేయకుండానే సంబంధిత కాంట్రాక్టర్ నిధులు విడుదల చేసుకున్నాడ నే విమర్శలున్నాయి. పూర్తిగా శిథిలావస్థలో ఉన్న నృత్యమండపాన్నిఅభివృద్ధి చేశాక ఫ్లోరింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా ముందే ఫ్లోరింగ్ పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారు. నృత్యమండపంను అభివృద్ధి చేసే సమయంలో ఫ్లోరిం గ్ కోసం వేసిన బండలు(షాబాద్) పగిలి పోయే ఆస్కారం కూడా ఉంది. ఇదే జరిగి తే ప్రస్తుతం చేపట్టిన పనులు వృథాగా మా రుతాయి. ముందుచూపు లోపించడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయ, పురావస్తుశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఆలయ అభివృద్ధి పనుల్లో మార్పు చేసి కాకతీయ శిల్పకళను, భక్తు ల మనోభావాలను కాపాడుతూ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
‘పన్ను’ వసూళ్లపై ప్రత్యేక దృష్టి
సంగారెడ్డి రూరల్: అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగాలంటే పన్ను వసూళ్ల కూడా అదేస్థాయిలో చేయాలని మంత్రి హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు పన్ను వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. వందశాతం పన్ను వసూళ్లు చేసిన గ్రామ పంచాయతీకి రూ.2 లక్షల ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం మంత్రి హరీష్‌రావు సంగారెడ్డి మండ లం ఫసల్వాది శివారులో రూ.2.20 కోట్లతో నిర్మించనున్న జిల్లా పంచాయతీ రాజ్ శిక్ష ణ కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు పంచాయతీ రాజ్ చట్టాలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు సర్కార్ కృషిచేస్తోందన్నారు. త్వరలో నిర్మించనున్న జిల్లా పంచాయతీ రాజ్ శిక్ష ణ కేంద్రం ఈ అవగాహన కార్యక్రమాల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ భవనంలో జిల్లాలోని 1,066 గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు పూర్తి స్థాయి శిక్ష ణ కల్పిస్తామన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ భవనాలకు అవసరమైన చోట మరమ్మత్తులు చేయించడంతో పాటు శిథిలావస్థకు చేరుకున్న వాటి స్థానంలో కొత్తగా నిర్మాణాలు చేపడతామన్నారు. ఇటీవల జిల్లాలో 25 గ్రామ పంచాయతీలకు నిర్మల్ పురస్కార్ అవార్డులు లభించడం గర్వకారణమన్నారు. మిగితా గ్రామ పంచాయతీలో కూడా ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి 100 శాతం పారిశుద్ధ్యం సాధించి నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డులు పొందేందుకు కృషిచేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 24 మంచినీటి పథకాలు ఉన్నప్పటికీ, నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదన్నారు. అందువల్లే ఇంటింటికి నల్ల అందించేందుకు వాటర్‌గ్రిడ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్రాజమణి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులకు సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పంచాయతీ శిక్షణ కేంద్ర భవనం ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా, మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, జిల్లా పంచాయతీ రాజ్ శిక్షణ కేంద్ర భవన నిర్మాణం కోసం మంత్రి హరీష్‌రావు ఎంతో కృషి చేశారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి సహకారం కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి, జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, తహశీల్దార్ గోవర్దన్, ఎంపీడీఓ సరళ, గ్రామ సర్పంచ్ సాయమ్మ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు నరహరిరెడ్డి, అశోక్, కొండల్‌రెడ్డితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.