విచారణ ఎందాకా? | Heavy corruption in Indiramma housing scheme | Sakshi
Sakshi News home page

విచారణ ఎందాకా?

Published Thu, Dec 4 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

విచారణ ఎందాకా?

విచారణ ఎందాకా?

‘ఇందిరమ్మ’ ఇండ్ల నిర్మాణంలో అవినీతికి అంతు లేకుండాపోయింది. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రటించారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్నారు. సీబీసీఐడీని రంగంలోకి దించారు.వారు ఊరూరా తిరిగి విచారణ జరిపారు. నివేదికలు మాత్రం వెలుగు చూడడం లేదు.

అక్రమాల నిగ్గు తేలేనా!
సీబీసీఐడీ దర్యాప్తు పూర్తయ్యేనా?
నాలుగు నెలలు గడిచినా జాడలేని నివేదిక
ఎంపీడీఓలు, తహశీల్దారుల పాత్రపై మౌనం
గృహ నిర్మాణ సంస్థ అధికారులపై అదే సస్పెన్స్
ఆరంభంలో ఉన్న జోరు ఇప్పుడు లేదెందుకో!

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో జరిగిన భారీ అవినీతిపై సీబీసీఐడీ విచారణ ఇంకా కొలిక్కిరాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 2,11,290 ఇండ్లను శాంపిల్‌గా తీసుకుని చేపట్టిన విచారణ కాగితాలకే పరిమితమైంది. జిల్లాలోనే రూ. 42.50 కోట్లు స్వాహా అయ్యాయని తేలింది. ఇళ్ల మంజూరు, నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై మొదట థర్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపించిన ప్రభుత్వం అనంతరం సీబీసీఐడీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. తెలంగాణలోని 593 గ్రామాలలో మొదటి విడత థర్డ్ పార్టీ తనిఖీలు నిర్వహించింది. రెండో విడతలో మరో 90 గ్రామాలలోనూ తనిఖీలు నిర్వహించి నివేదికలు రూపొందించింది.

వీటి ఆధారంగా ఆగస్టు 12 నుంచి సీబీ సీఐడీ రంగంలోకి దిగింది. అధికారులు బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో లబ్ధిదారుల జాబితా ఆధారంగా విచారణ జరిపారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా విచారణలో ఏం తేలిందో బట్టబయలు కాలేదు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర వహించిన కొందరు ఎంపీడీఓలు, తహసీల్ దారుల పాత్రపై ప్రభుత్వం ఇంకా మౌనం వహిస్తోంది. గృహ నిర్మాణ సంస్థ అధికారులపై సస్పెన్స్ వీడటం లేదు. ఈ నేపథ్యంలో విచారణ ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియడం లేదు.
 
కట్టకుండానే బిల్లులు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అక్రమాలపై నాలుగు నెలల క్రితం రంగంలోకి దిగిన సీబీసీఐడీ దోషుల గురించి ఇంకా ఏమి తేల్చకపోవడం చర్చనీయాం శంగా మారింది. తెలంగాణ జిల్లాలలోని 245 మండలాలు, 625 గ్రామాలలోని 2,11,290 ఇండ్లపై ప్రభుత్వం థర్డ్‌పార్టీ సర్వే నిర్వహిస్తే, 26,122 ఇండ్లలో అక్రమాలు జరిగినట్లు తేలింది. ఇందులో 1,623 ఇండ్లకు రెండుసార్లు, 1,566 పాత ఇండ్లకు బిల్లులు ఇచ్చినట్లు తేలింది. 4,375 కేసులలో ఇండ్లు కట్టకుండానే బిల్లులు కాజేసినట్లు బయటపడింది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 29 గ్రామాలలో 2,705 ఇండ్ల పేరిట రూ. 42.50 కోట్లు స్వాహా కావడం దారుణం.

గతంలో ఇక్కడ డీఎంగా పనిచేసిన జ్ఞానేశ్వర్‌రావు నిజామాబా   ద్ శివారు గ్రామాలలో ఇండ్లు నిర్మించినట్లు తప్పుడు రికార్డులు సష్టించి రూ.53.77 లక్షలు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి లబ్ధిదారుల పేరిట ఓ బ్యాంకు జమచేసిన సొమ్మును కొందరు కాజేయడం తో, డీఎం బాధ్యత వహించాల్సి వచ్చింది. ఈ క్ర మంలో ఆయనను 2005లోనే ఉద్యోగం నుంచి తొల గించినా, స్వాహా చేసిన డబ్బు ఇంతవరకు రికవరీ కాలేదు. దీని మీదా సీబీసీఐడీ అధికారులు ఆరా తీశారు.
 
ఊరూరా అక్రమాలే
సీబీసీఐడీ అధికారులు ఇంటింటికి తిరిగి విచారణ జరిపారు. కోటగిరి మండలం కొత్తపల్లిలో రూ.44.65 లక్షల అవినీతి జరిగినట్లు తేలినా అందుకు బాధ్యులైనవారిపై అధికారులు చర్యలు తీసుకోలేదు. దీనిని సీబీసీఐడీ గమనించింది. కమ్మరపల్లి మండలం మానాలలో ముగ్గురు అధికారులు రూ.6.84 లక్షల అవినీతికి పాల్పడిన వైనం వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లాలోని 11 మండలాలలో 73 గ్రామాలకు మంజూరైన 2,121 ఇండ్ల పేరిట భారీగా నిధులు స్వాహా అయ్యాయి.

సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీసీఐ డీ నివేదికలు సిద్దమైనట్లు కూడ ప్రకటించింది. కరీంనగర్ జిల్లాలోని 54 గ్రామాలలోని 791 ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు తేలింది. వరంగల్ జిల్లాలో 14,003 ఇండ్ల మంజూరు, నిర్మాణాలపై థర్డ్‌పార్టీ సమర్పించిన నివేదిక ప్రకారం నిఘా అధికారు లు ఆరా తీశారు. నాలుగు జిల్లాల్లో జరిగిన ఇండ్ల అక్రమాలపై విచారణ జరిపిన అధికారులు త్వరలోనే నివేదిక సమర్పించనున్నారన్న ప్రచారం కూడ జరిగింది. అయితే ఇప్పటికీ ఇందిరమ్మ స్కామ్‌లో అసలు దోషుల గుట్టురట్టు చేయడంలో  ఎందుకు తాత్సారం జరుగుతుందన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది.
 
కొత్తపల్లిలో సీఐ విచారణ
కోటగిరి : మండలంలోని కొత్తపల్లి గ్రామ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం బోధన్ రూరల్ సీఐ దామోదర్‌రెడ్డి విచారణ జరిపారు. గతంలో ‘పేదల సొమ్ము పెద్దల పాలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడం తో స్పందించిన అధికారులు గ్రామానికి చెందిన ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

దీనికి సంబంధించిన విచారణను సీఐ దామోదర్‌రెడ్డికి అప్పగిం చారు. ఇందులో భాగంగా ఆయన కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్ల జాబితాతో ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. అధికశాతం బోగస్ రేషన్ కార్డులతో బిల్లులు స్వాహా చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. గ్రామంలో సుమారు 244 ఇళ్లకు సంబంధించిన బిల్లులు అక్రమంగా తీసుకున్నట్టు తెలుస్తోందన్నా రు. పూర్తిస్థాయి విచారణ జరిపి ఉన్నతాధికారుల  కు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. ఆయన వెంట కోటగిరి ఎస్‌ఐ బషీర్ ఆహ్మద్, సర్పంచ్ కళ్యాణి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement