Heavy corruption
-
ఫొని తుపాను ఖర్చులోనూ భారీ అవినీతి
-
ఫొని తుపాను ఖర్చులోనూ భారీ అవినీతి
సాక్షి, శ్రీకాకుళం : ఫొని తుపాను ఖర్చుల్లోనూ భారీ అవినీతి వెలుగుచూస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో తుపాను నష్టాన్ని పెంచి చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 38 కోట్ల 43లక్షల మేర నష్టం జరిగితే... అధికారులు రూ. 58కోట్ల 61 లక్షలుగా చూపిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా విద్యుత్ శాఖ ఖర్చుల్లోనే ఎక్కువగా అవినీతి ఉందని తెలుస్తోంది. తుపాను బీభత్సం ఘటనాస్థలానికి చేరుకుని వినియోగించని క్రేన్లు, జనరేటర్లు, కూలీలకు కోట్లలో నగదు చెల్లింపులు జరిగాయని చూపిస్తున్నారని, ఈపీడీసీఎల్‌లో మెటీరియల్ కొనుగోళ్లలో ప్రాజెక్ట్స్, ఆపరేషన్ సీజీఎంలు చేతివాటం ప్రదర్శించినట్టు సమాచారం. -
ప్రాజెక్టుల్లో అవినీతి విపరీతంగా జరిగింది
-
‘ఇందిరమ్మ’లో అవినీతి బహిర్గతం
ఖమ్మం వైరారోడ్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగినట్లు సీబీసీఐడీ విచారణలో తెలిసింది. ఈ అక్రమాల్లో 177 మంది భాగస్వామ్యం ఉందని విచారణలో నిర్ధారణయింది. గృహనిర్మాణ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు అవినీతిలో భాగస్వాములైనట్లు తెలిసింది. ఇందులో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు తేలింది. ఇందిరమ్మ పథకం కింద జిల్లాకు మూడు దశల్లో 4.10 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 2.80 లక్షల ఇళ్లు పూర్తి కాగా, మరో 64 వేల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. మంజూరైన ఇళ్లలో చాలా వరకు నిధులు దుర్వినియోగం అయినట్లు ప్రభుత్వం గుర్తించి సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. మొత్తంగా రూ.14 కోట్లు స్వాహా అయినట్లు గృహ నిర్మాణశాఖ అధికారుల విచారణలోనే తేలింది. జిల్లాలో 2004 నుంచి 2014 వరకు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో బోగస్ లబ్ధిదారులతోపాటు అసలు ఇళ్లే నిర్మించకుండా నిధులు స్వాహా చేసిన వారిని కనుగొనేందుకు సీబీసీఐడీ బృందం నియోజకవర్గాల వారీగా విచారణ చేపట్టింది. మూడు నెలల పాటు విచారణ... ప్రభుత్వ ఆదేశాలతో సీబీసీఐడీ డీఎస్పీ బాలుజాదవ్ తన బృందంతో గత ఏడాది ఆగస్టు 8న జిల్లాలో విచారణ ప్రారంభించారు. తొలుత జిల్లా గృహ నిర్మాణ కార్యాలయంలో సంబంధిత ఫైళ్లను పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా అధికారులను ప్రశ్నించారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో కూడా విచారణ చేపట్టారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం, కూసుమంచి మండ లం లోక్యాతండా, నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం పట్వారిగూడెం, ముల్కలపల్లి మండలం కూసుగూడెంలో విచారణ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు నిర్మించిన గృహాలు, నిర్మాణ దశలో ఉన్న ఇళ్ల వివరాలను పరిశీలించి ఉన్నతాధికారులకు గత నవంబర్‌లో నివేదిక అందజేశారు. అవినీతిలో 177 మంది హస్తం! ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో విచారణ చేపట్టిన సీబీసీఐడీ బృందం 177 మందికి అవినీతిలో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించిందని ఆ శాఖ ఉన్నతాధికారి ద్వారా తెలిసింది. మూడు నెలల పాటు సాగిన విచారణలో దీనికి సంబంధించిన వారిని గుర్తించి నివేదికలో పొందుపరిచారు. దీనిలో గృహ నిర్మాణ శాఖకు చెందిన వారు 37 మంది ఉన్నట్లు తెలిసింది. ఈ జాబితాలో వర్క్ఇన్స్పెక్టర్లు, ఏఈలు, డీఈలు, ఈఈలు ఉన్నట్లు సమాచారం. రాజకీయ నాయకులు 8 మంది, మహిళా సమాఖ్యకు చెందిన వారు 15 మంది, అలాగే ఒక ఆర్డీఓ, ఇద్దరు ఎమ్మార్వోలు, ఒక ఎంపీడీవో, ముగ్గురు మద్యవర్తులు, 110 మంది లబ్ధిదారులు అవినీతిలో పాలుపంచుకున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ చేసిన అధికారులు నవంబర్‌లో నివేదికను సీబీసీఐడీ డీజీకి అందజేశారు. త్వరలో దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎక్కడ అరెస్ట్‌లకు ఆదేశిస్తుందోనని అవినీతిపరుల్లో వణుకు మొదలైంది. సస్పెండ్ అయ్యి విధుల్లో చేరిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆదేశాలు రాగానే అరెస్ట్‌ల పర్వం మొదలవుతుందని ఆ శాఖ అధికారులు ద్వారా తెలిసింది. -
విచారణ ఎందాకా?
‘ఇందిరమ్మ’ ఇండ్ల నిర్మాణంలో అవినీతికి అంతు లేకుండాపోయింది. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రటించారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్నారు. సీబీసీఐడీని రంగంలోకి దించారు.వారు ఊరూరా తిరిగి విచారణ జరిపారు. నివేదికలు మాత్రం వెలుగు చూడడం లేదు. ⇒ అక్రమాల నిగ్గు తేలేనా! ⇒సీబీసీఐడీ దర్యాప్తు పూర్తయ్యేనా? ⇒నాలుగు నెలలు గడిచినా జాడలేని నివేదిక ⇒ఎంపీడీఓలు, తహశీల్దారుల పాత్రపై మౌనం ⇒గృహ నిర్మాణ సంస్థ అధికారులపై అదే సస్పెన్స్ ⇒ఆరంభంలో ఉన్న జోరు ఇప్పుడు లేదెందుకో! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో జరిగిన భారీ అవినీతిపై సీబీసీఐడీ విచారణ ఇంకా కొలిక్కిరాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 2,11,290 ఇండ్లను శాంపిల్‌గా తీసుకుని చేపట్టిన విచారణ కాగితాలకే పరిమితమైంది. జిల్లాలోనే రూ. 42.50 కోట్లు స్వాహా అయ్యాయని తేలింది. ఇళ్ల మంజూరు, నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై మొదట థర్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపించిన ప్రభుత్వం అనంతరం సీబీసీఐడీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. తెలంగాణలోని 593 గ్రామాలలో మొదటి విడత థర్డ్ పార్టీ తనిఖీలు నిర్వహించింది. రెండో విడతలో మరో 90 గ్రామాలలోనూ తనిఖీలు నిర్వహించి నివేదికలు రూపొందించింది. వీటి ఆధారంగా ఆగస్టు 12 నుంచి సీబీ సీఐడీ రంగంలోకి దిగింది. అధికారులు బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో లబ్ధిదారుల జాబితా ఆధారంగా విచారణ జరిపారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా విచారణలో ఏం తేలిందో బట్టబయలు కాలేదు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర వహించిన కొందరు ఎంపీడీఓలు, తహసీల్ దారుల పాత్రపై ప్రభుత్వం ఇంకా మౌనం వహిస్తోంది. గృహ నిర్మాణ సంస్థ అధికారులపై సస్పెన్స్ వీడటం లేదు. ఈ నేపథ్యంలో విచారణ ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియడం లేదు. కట్టకుండానే బిల్లులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అక్రమాలపై నాలుగు నెలల క్రితం రంగంలోకి దిగిన సీబీసీఐడీ దోషుల గురించి ఇంకా ఏమి తేల్చకపోవడం చర్చనీయాం శంగా మారింది. తెలంగాణ జిల్లాలలోని 245 మండలాలు, 625 గ్రామాలలోని 2,11,290 ఇండ్లపై ప్రభుత్వం థర్డ్‌పార్టీ సర్వే నిర్వహిస్తే, 26,122 ఇండ్లలో అక్రమాలు జరిగినట్లు తేలింది. ఇందులో 1,623 ఇండ్లకు రెండుసార్లు, 1,566 పాత ఇండ్లకు బిల్లులు ఇచ్చినట్లు తేలింది. 4,375 కేసులలో ఇండ్లు కట్టకుండానే బిల్లులు కాజేసినట్లు బయటపడింది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 29 గ్రామాలలో 2,705 ఇండ్ల పేరిట రూ. 42.50 కోట్లు స్వాహా కావడం దారుణం. గతంలో ఇక్కడ డీఎంగా పనిచేసిన జ్ఞానేశ్వర్రావు నిజామాబా ద్ శివారు గ్రామాలలో ఇండ్లు నిర్మించినట్లు తప్పుడు రికార్డులు సష్టించి రూ.53.77 లక్షలు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి లబ్ధిదారుల పేరిట ఓ బ్యాంకు జమచేసిన సొమ్మును కొందరు కాజేయడం తో, డీఎం బాధ్యత వహించాల్సి వచ్చింది. ఈ క్ర మంలో ఆయనను 2005లోనే ఉద్యోగం నుంచి తొల గించినా, స్వాహా చేసిన డబ్బు ఇంతవరకు రికవరీ కాలేదు. దీని మీదా సీబీసీఐడీ అధికారులు ఆరా తీశారు. ఊరూరా అక్రమాలే సీబీసీఐడీ అధికారులు ఇంటింటికి తిరిగి విచారణ జరిపారు. కోటగిరి మండలం కొత్తపల్లిలో రూ.44.65 లక్షల అవినీతి జరిగినట్లు తేలినా అందుకు బాధ్యులైనవారిపై అధికారులు చర్యలు తీసుకోలేదు. దీనిని సీబీసీఐడీ గమనించింది. కమ్మరపల్లి మండలం మానాలలో ముగ్గురు అధికారులు రూ.6.84 లక్షల అవినీతికి పాల్పడిన వైనం వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లాలోని 11 మండలాలలో 73 గ్రామాలకు మంజూరైన 2,121 ఇండ్ల పేరిట భారీగా నిధులు స్వాహా అయ్యాయి. సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీసీఐ డీ నివేదికలు సిద్దమైనట్లు కూడ ప్రకటించింది. కరీంనగర్ జిల్లాలోని 54 గ్రామాలలోని 791 ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు తేలింది. వరంగల్ జిల్లాలో 14,003 ఇండ్ల మంజూరు, నిర్మాణాలపై థర్డ్‌పార్టీ సమర్పించిన నివేదిక ప్రకారం నిఘా అధికారు లు ఆరా తీశారు. నాలుగు జిల్లాల్లో జరిగిన ఇండ్ల అక్రమాలపై విచారణ జరిపిన అధికారులు త్వరలోనే నివేదిక సమర్పించనున్నారన్న ప్రచారం కూడ జరిగింది. అయితే ఇప్పటికీ ఇందిరమ్మ స్కామ్‌లో అసలు దోషుల గుట్టురట్టు చేయడంలో ఎందుకు తాత్సారం జరుగుతుందన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. కొత్తపల్లిలో సీఐ విచారణ కోటగిరి : మండలంలోని కొత్తపల్లి గ్రామ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం బోధన్ రూరల్ సీఐ దామోదర్‌రెడ్డి విచారణ జరిపారు. గతంలో ‘పేదల సొమ్ము పెద్దల పాలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడం తో స్పందించిన అధికారులు గ్రామానికి చెందిన ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణను సీఐ దామోదర్‌రెడ్డికి అప్పగిం చారు. ఇందులో భాగంగా ఆయన కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్ల జాబితాతో ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. అధికశాతం బోగస్ రేషన్ కార్డులతో బిల్లులు స్వాహా చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. గ్రామంలో సుమారు 244 ఇళ్లకు సంబంధించిన బిల్లులు అక్రమంగా తీసుకున్నట్టు తెలుస్తోందన్నా రు. పూర్తిస్థాయి విచారణ జరిపి ఉన్నతాధికారుల కు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. ఆయన వెంట కోటగిరి ఎస్ఐ బషీర్ ఆహ్మద్, సర్పంచ్ కళ్యాణి తదితరులు ఉన్నారు. -
అక్రమార్కుల్లో దడ
‘హౌసింగ్’లో తవ్వినకొద్దీ అవినీతి - పిల్లల పేరిట సైతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు! - నాలుగు గ్రామాల్లోనే రూ. కోటికిపైగా స్వాహా - జిల్లాలో రూ. 70 కోట్లు దారిమళ్లినట్టు అంచనా - సీఐడీ విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.70 కోట్లకుపైగా అవినీతి జరిగి ఉంటుందని అంచనా. దీనిని నిర్ధారించుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. అవినీతిపై ఇటీవల సీఐడీ విచారణ ప్రారంభించింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని శేరిదామరగిద్ద, పంచగామ, అందోలు నియోజకవర్గంలోని కేరూర్, నాగులపల్లిలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఇందిరమ్మ లబ్ధిదారులు, హౌసింగ్ అధికారులతో మాట్లాడటంతోపాటు ఇళ్లు నిర్మించిందీ, లేనిదీ స్వయంగా పరిశీలించారు. నాలుగు గ్రామాల్లోనే సుమారు కోటి రూపాయల అవినీతి చోటు చేసుకున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లోని రాజకీయనాయకులు, హౌసింగ్ అధికారులు, దళారులకు అవినీతిలో భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. జిల్లా సీఐడీ అధికారులు, హౌసింగ్ శాఖకు చెందిన ఈఈ, డీఈలతోపాటు పదిమంది ఏఈలను విచారించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే గత పదేళ్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిపైనా సీఐడీ విచారణకు సిద్దమైంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేక బృందాలు త్వరలో విచారణ ప్రారంభించనున్నట్లు సమాచారం. అక్రమార్కులకు బిగుస్తున్న ఉచ్చు ‘హౌసింగ్’లో అక్రమార్కుల మెడ చుట్టూ అవినీతి ఉచ్చు బిగుసుకుంటోంది. ఇళ్ల మంజూరులో ఈఈ, డీఈల పాత్ర ఉండగా పనుల పర్యవేక్షణ, బిల్లుల మంజూరులో ఏఈ, వర్క్ఇన్స్పెకర్ కీలకపాత్ర ఉంటుంది. వ ర్క్ఇన్స్పెక్టర్ మొదలు ఈఈ స్థాయి అధికారుల వరకు అవినీతిలో ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. -
వరంగల్‌లో భారీ లంచావతారం