సాక్షి, శ్రీకాకుళం : ఫొని తుపాను ఖర్చుల్లోనూ భారీ అవినీతి వెలుగుచూస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో తుపాను నష్టాన్ని పెంచి చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 38 కోట్ల 43లక్షల మేర నష్టం జరిగితే... అధికారులు రూ. 58కోట్ల 61 లక్షలుగా చూపిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా విద్యుత్ శాఖ ఖర్చుల్లోనే ఎక్కువగా అవినీతి ఉందని తెలుస్తోంది. తుపాను బీభత్సం ఘటనాస్థలానికి చేరుకుని వినియోగించని క్రేన్లు, జనరేటర్లు, కూలీలకు కోట్లలో నగదు చెల్లింపులు జరిగాయని చూపిస్తున్నారని, ఈపీడీసీఎల్‌లో మెటీరియల్ కొనుగోళ్లలో ప్రాజెక్ట్స్, ఆపరేషన్ సీజీఎంలు చేతివాటం ప్రదర్శించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment