cbcid inquiry
-
వక్ఫ్ ఆక్రమణలపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో వక్ఫ్‌బోర్డు ఆస్తులు కబ్జాదారుల పాలవుతు న్నాయని, వీటిపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 78 వేల ఎకరాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులున్నాయని, వీటిలో 50 శాతానికిపైగా ఆక్రమణలకు గురైనట్లు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం జీరో అవర్‌లో అక్బరుద్దీన్ మాట్లాడారు. పల్లెల పేర్ల మార్పుపై రగడ ! పల్లెసీమలకు వందల ఏళ్లుగా ఉన్న పేర్లను యథాతథంగా కొనసాగించాలని, మార్చాల్సిన అవసరం లేదని ఎంఐఎంఎల్పీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. గ్రామాల పేర్ల మార్పు ప్రక్రియ ను సులభతరం చేస్తే హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి వంటి పేర్లు సైతం మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టిన తెలంగాణ పంచాయతీరాజ్ సవరణబిల్లు –2021ను ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ప్రశాంత తెలంగాణలో ఈ ప్రతిపాదనలతో సమస్యలు వస్తాయని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క అన్నారు. -
శ్రీగౌతమి హత్యకు డీల్ రూ.లక్షల్లో..?
నరసాపురం : శ్రీగౌతమి మృతి ప్రమాదవశాత్తు జరిగింది కాదని తేలిపోయింది. పథకం పన్ని కిరాయి హత్య చేయించారని సీఐసీఐడీ నిగ్గుతేల్చింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు కీలక నిందితులు రిమాండ్‌లో ఉన్నారు. పైగా వారు టీడీపీకి చెందిన బడా వ్యక్తులు. సాక్షాత్తు జడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్ కూడా ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ హత్యలో అనేక అంశాలపై చర్చసాగుతోంది. సీబీసీఐడీ చొరవతో మత్తు వదిలిన జిల్లా పోలీసులు కేసును పునఃప్రారంభించి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచే సమయంలో పోలీసులు ఈ కేసు దర్యాప్తు ఇప్పటికి సగమే పూర్తయిందని చెప్పారు. పోలీసులు చెప్పినట్టుగానే ఇంకా అనేక అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ హత్యకు కిరాయి ఎంతకు మాట్లాడుకున్నారనేది ఇంకా వెలుగులోకి రాలేదు. పోలీసులు కూడా ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అయితే సీఐడీ అధికారుల వద్ద కొంత సమాచారం ఉన్నప్పటికీ, ఎంత కిరాయి అనే అంశంపై పూర్తి వివరాలు లభ్యంకాలేదని తెలిసింది. విశాఖపట్టణంకు చెందిన పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌లను హత్యకు పురమాయించారు. వారికి యాక్సిడెంట్ చేసే నిమిత్తం ముందుగా రూ 1.70 లక్షలు ఇచ్చారు. మళ్లీ వారు యాక్సిడెంట్ చేసే సమయానికి రూ 50 వేలకు కారు తాకట్టుపెడితే, మళ్లీ జడ్పీటీసీ బాలం ప్రతాప్, అతని సోదరుడు ఆండ్రూలు వైజాగ్ వెళ్లి కారును విడిపించారు. దీనికి కూడా సజ్జా బుజ్జి బ్యాంకు ఖాతా ద్వారా సొమ్ము ముట్టచెప్పాడు. ఇది ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా పోలీసులు చెప్పిన విషయం. అసలు ఈ హత్య చేయడానికి ఎంత మేరకు బేరం కుదుర్చుకున్నారనేది తెలియాల్సి ఉంది. ముందు యాక్సిడెంట్ కేసులో అరెస్టై తరువాత బెయిల్‌పై వచ్చిన కిరాయి హంతకులు పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌లు కేసు తిరగతోడిన తరువాత పరారీలో ఉన్నారు. వారు దొరికితేనే కానీ అసలు ఈ హత్యకు బేరం ఎన్ని లక్షల్లో కుదిరిందనేది తెలియదు. అయితే రూ 50 లక్షలు వరకూ బేరం కుదిరిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెర వెనుక సూత్రధారులు బయటకు వస్తారా? శ్రీగౌతమి హత్య అనంతరం సజ్జా బుజ్జి అండ్‌కోను తప్పించడానికి శతవిధాలా ప్రయత్నించి, తొలి ప్రయత్నంలో కేసును యాక్సిడెంట్‌గా 15 రోజుల్లోనే మాఫీ చేయించి సత్తా చూపించిన తెర వెనుక సూత్రధారులు ఇప్పుడైనా బయటకు వస్తారా? అనే అంశంలో జోరుగా చర్చసాగుతోంది. బుజ్జి సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు బడా వ్యక్తులు స్థానికంగా ఉంటూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతూ ఉంటారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారు పైరవీలు ఏ కోణంలో చేస్తున్నారనే దానిపై కూడా చర్చసాగుతోంది. అసలు సీబీసీఐడీనే కేసును పూర్తిగా చివరి వరకూ దర్యాప్తు చేస్తేనే తెరవెనుక సూత్రధారులు బయటకు వస్తారనే చర్చ సాగుతోంది. ఇంకో వైపు కేసును నీరుగార్చిన పోలీసులపై ఆశాఖ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. నిందితులకు ఇంకా అందలం ఇస్తున్న టీడీపీ ఇదిలా ఉంటే కేసులో ఉన్న నిందితులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన టీడీపీ వెనుక మాత్రం వారికి ఇంకా సహకారం ఇస్తోంది. సజ్జా బుజ్జి అండ్‌కో ప్రస్తుతం నరసాపురం సబ్‌జైలులో రిమాండ్ అనుభవిస్తున్నారు. అయితే వారిని పరామర్శించడానికి టీడీపీ నేతలు క్యూకడుతున్నారు. పరామర్శలకు వెళ్లే వారిలో స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఉండటం విశేషం. ఇక హత్యకేసులో ఏ–3 నిందితుడుగా ఉన్న నరసాపురం జడ్పీటీసీ సభ్యుడుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసింది. జూలై 2వ తేదీన జరగనున్న నరసాపురం అగ్రికల్చర్ మార్కెట్‌యార్డ్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో గౌరవ అతిథిగా స్థానం కల్పించింది. ఆయనను గౌరవ అతిథిగా ఉన్న ఆహ్వాన పత్రికలను శుక్రవారం పార్టీ నేతలు పంచారు. ఏకంగా ఓ యువతి కిరాయి హత్యకేసులో ఉన్న రిమాండ్ ఖైదీకి పార్టీలో పెద్దపీట వేయడం చర్చనీయాంశమయ్యింది. పోనీ ముందుగా ఆహ్వాన పత్రికలు ముద్రించి ఉంటారని సరిపెట్టుకోవడానికి కూడా వీలులేదు. ఎందుకంటే ఇప్పటికే వారు రిమాండ్‌కు వెళ్లి 5 రోజులు అవుతుంది. ఆహ్వాన పత్రికల్లో మార్పులు చేసి పంచడానికి కూడా సమయం ఉన్నందున అలా చేయలేదంటే పార్టీ అండ నిందితులకు ఉందని స్పష్టమవుతోంది. టీడీపీ అధికార అండ చూసుకునే అసాంఘిక వాదులు పేట్రేగిపోతున్నారనే విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇంతదానికి మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు బిల్డప్ రాజకీయాలు చేయడం ఏమిటని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలి కేసును నీరుగార్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. వారు నన్ను దారుణంగా మాట్లాడేవారు. నాపైనే కేసులు కడతామని అనేవారు. కానీ నేను నా పోరాటాన్ని ఆపలేదు. సీబీసీఐడీ వల్ల నాకు న్యాయం జరిగింది. అప్పుడు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటే మాకు నమ్మకం కలుగుతుంది. – దంగేటి పావని, గౌతమి చెల్లి -
విచారణ ఎందాకా?
‘ఇందిరమ్మ’ ఇండ్ల నిర్మాణంలో అవినీతికి అంతు లేకుండాపోయింది. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రటించారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్నారు. సీబీసీఐడీని రంగంలోకి దించారు.వారు ఊరూరా తిరిగి విచారణ జరిపారు. నివేదికలు మాత్రం వెలుగు చూడడం లేదు. ⇒ అక్రమాల నిగ్గు తేలేనా! ⇒సీబీసీఐడీ దర్యాప్తు పూర్తయ్యేనా? ⇒నాలుగు నెలలు గడిచినా జాడలేని నివేదిక ⇒ఎంపీడీఓలు, తహశీల్దారుల పాత్రపై మౌనం ⇒గృహ నిర్మాణ సంస్థ అధికారులపై అదే సస్పెన్స్ ⇒ఆరంభంలో ఉన్న జోరు ఇప్పుడు లేదెందుకో! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో జరిగిన భారీ అవినీతిపై సీబీసీఐడీ విచారణ ఇంకా కొలిక్కిరాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 2,11,290 ఇండ్లను శాంపిల్‌గా తీసుకుని చేపట్టిన విచారణ కాగితాలకే పరిమితమైంది. జిల్లాలోనే రూ. 42.50 కోట్లు స్వాహా అయ్యాయని తేలింది. ఇళ్ల మంజూరు, నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై మొదట థర్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపించిన ప్రభుత్వం అనంతరం సీబీసీఐడీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. తెలంగాణలోని 593 గ్రామాలలో మొదటి విడత థర్డ్ పార్టీ తనిఖీలు నిర్వహించింది. రెండో విడతలో మరో 90 గ్రామాలలోనూ తనిఖీలు నిర్వహించి నివేదికలు రూపొందించింది. వీటి ఆధారంగా ఆగస్టు 12 నుంచి సీబీ సీఐడీ రంగంలోకి దిగింది. అధికారులు బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో లబ్ధిదారుల జాబితా ఆధారంగా విచారణ జరిపారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా విచారణలో ఏం తేలిందో బట్టబయలు కాలేదు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర వహించిన కొందరు ఎంపీడీఓలు, తహసీల్ దారుల పాత్రపై ప్రభుత్వం ఇంకా మౌనం వహిస్తోంది. గృహ నిర్మాణ సంస్థ అధికారులపై సస్పెన్స్ వీడటం లేదు. ఈ నేపథ్యంలో విచారణ ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియడం లేదు. కట్టకుండానే బిల్లులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అక్రమాలపై నాలుగు నెలల క్రితం రంగంలోకి దిగిన సీబీసీఐడీ దోషుల గురించి ఇంకా ఏమి తేల్చకపోవడం చర్చనీయాం శంగా మారింది. తెలంగాణ జిల్లాలలోని 245 మండలాలు, 625 గ్రామాలలోని 2,11,290 ఇండ్లపై ప్రభుత్వం థర్డ్‌పార్టీ సర్వే నిర్వహిస్తే, 26,122 ఇండ్లలో అక్రమాలు జరిగినట్లు తేలింది. ఇందులో 1,623 ఇండ్లకు రెండుసార్లు, 1,566 పాత ఇండ్లకు బిల్లులు ఇచ్చినట్లు తేలింది. 4,375 కేసులలో ఇండ్లు కట్టకుండానే బిల్లులు కాజేసినట్లు బయటపడింది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 29 గ్రామాలలో 2,705 ఇండ్ల పేరిట రూ. 42.50 కోట్లు స్వాహా కావడం దారుణం. గతంలో ఇక్కడ డీఎంగా పనిచేసిన జ్ఞానేశ్వర్రావు నిజామాబా ద్ శివారు గ్రామాలలో ఇండ్లు నిర్మించినట్లు తప్పుడు రికార్డులు సష్టించి రూ.53.77 లక్షలు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి లబ్ధిదారుల పేరిట ఓ బ్యాంకు జమచేసిన సొమ్మును కొందరు కాజేయడం తో, డీఎం బాధ్యత వహించాల్సి వచ్చింది. ఈ క్ర మంలో ఆయనను 2005లోనే ఉద్యోగం నుంచి తొల గించినా, స్వాహా చేసిన డబ్బు ఇంతవరకు రికవరీ కాలేదు. దీని మీదా సీబీసీఐడీ అధికారులు ఆరా తీశారు. ఊరూరా అక్రమాలే సీబీసీఐడీ అధికారులు ఇంటింటికి తిరిగి విచారణ జరిపారు. కోటగిరి మండలం కొత్తపల్లిలో రూ.44.65 లక్షల అవినీతి జరిగినట్లు తేలినా అందుకు బాధ్యులైనవారిపై అధికారులు చర్యలు తీసుకోలేదు. దీనిని సీబీసీఐడీ గమనించింది. కమ్మరపల్లి మండలం మానాలలో ముగ్గురు అధికారులు రూ.6.84 లక్షల అవినీతికి పాల్పడిన వైనం వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లాలోని 11 మండలాలలో 73 గ్రామాలకు మంజూరైన 2,121 ఇండ్ల పేరిట భారీగా నిధులు స్వాహా అయ్యాయి. సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీసీఐ డీ నివేదికలు సిద్దమైనట్లు కూడ ప్రకటించింది. కరీంనగర్ జిల్లాలోని 54 గ్రామాలలోని 791 ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు తేలింది. వరంగల్ జిల్లాలో 14,003 ఇండ్ల మంజూరు, నిర్మాణాలపై థర్డ్‌పార్టీ సమర్పించిన నివేదిక ప్రకారం నిఘా అధికారు లు ఆరా తీశారు. నాలుగు జిల్లాల్లో జరిగిన ఇండ్ల అక్రమాలపై విచారణ జరిపిన అధికారులు త్వరలోనే నివేదిక సమర్పించనున్నారన్న ప్రచారం కూడ జరిగింది. అయితే ఇప్పటికీ ఇందిరమ్మ స్కామ్‌లో అసలు దోషుల గుట్టురట్టు చేయడంలో ఎందుకు తాత్సారం జరుగుతుందన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. కొత్తపల్లిలో సీఐ విచారణ కోటగిరి : మండలంలోని కొత్తపల్లి గ్రామ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం బోధన్ రూరల్ సీఐ దామోదర్‌రెడ్డి విచారణ జరిపారు. గతంలో ‘పేదల సొమ్ము పెద్దల పాలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడం తో స్పందించిన అధికారులు గ్రామానికి చెందిన ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణను సీఐ దామోదర్‌రెడ్డికి అప్పగిం చారు. ఇందులో భాగంగా ఆయన కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్ల జాబితాతో ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. అధికశాతం బోగస్ రేషన్ కార్డులతో బిల్లులు స్వాహా చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. గ్రామంలో సుమారు 244 ఇళ్లకు సంబంధించిన బిల్లులు అక్రమంగా తీసుకున్నట్టు తెలుస్తోందన్నా రు. పూర్తిస్థాయి విచారణ జరిపి ఉన్నతాధికారుల కు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. ఆయన వెంట కోటగిరి ఎస్ఐ బషీర్ ఆహ్మద్, సర్పంచ్ కళ్యాణి తదితరులు ఉన్నారు. -
కదులుతున్న డొంక
* నకిలీ సర్టిఫికెట్లపై సీబీసీఐడీ విచారణ * ఇద్దరు టీచర్లు, అధికారుల నుంచి వివరాల సేకరణ కడప ఎడ్యుకేషన్: నకిలీ సర్టిఫికెట్లపైన కొందరు ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందారనే విషయంపై డొంక కదులుతోంది. గురువారం తిరుపతికి చెందిన సీబీసీఐడీ అధికారులు డీఈఓ కార్యాలయం లో విచారణ చేపట్టారు. ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులతోపాటు అప్పట్లో వారికి సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులను సైతం విచారించారు. 2009లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా చాలామంది నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందారనే అరోపణలపై దుమారం చెలరేగింది. అప్పట్లో పాఠశాల విద్యా కమిషనర్ విచారణకు అదేశిస్తూ డీఈఓ కార్యాలయ ఏడీలతో రాష్ట్రవ్యాప్తంగా కేసులను నమోదు చేయించారు. దీంతో సర్టిఫికెట్లను పరి శీలించాలని ఆదేశిస్తూ సంబంధింత కేసును సీబీసీఐడీకి అప్పగించారు. ఈ మేరకు తిరుపతికి చెందిన సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ జి. కళావతి సిబ్బందితో గురువారం డీఈఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఇందులో కదులుతున్న డొంక భాగంగా నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ప్రమోషన్ పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేంపల్లి మండలం తాళ్లపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రకాషరాజ్(ఇంగ్లీష్)ను, అలాగే చాపాడు మండలం నక్కలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మునెయ్య (సోషియల్)తో పాటు అప్పట్లో వారికి సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులను( ఎంఈఓలు, హెచ్ఎంలు) సైతం విచారించారు. సర్టిఫికెట్లను ఏ యూనివర్శిటీ నుంచి తెచ్చుకున్నారనే విషయాలపై కూలంకషంగా విచారణ చేశారు. నివేదిక సమర్పిస్తాః సీబీసీఐడీ సీఐ 2009లో నకిలీ సర్టిఫికెట్లతో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందారనే విషయంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణకు కడపకు వ చ్చినట్లు సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ జి. కళావతి పేర్కొన్నారు. అప్పట్లో కడప జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. సంబంధిత ఇద్దరు టీచర్లను పిలిపించామన్నారు. సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. వారికి సర్టిఫికెట్లను జారీ చేసిన యూనివర్సిటీలకు గుర్తింపు ఉందా లేదా అనే విషయాలను కూడా విచారిస్తామన్నారు. వీరిలో ఒకరేమో సేలంలోని వినాయక మిషన్ యూనివర్సీటీ నుంచి సర్టిపికెట్ తేగా మరొకరు రాజస్తాన్‌లోని జేఆర్ఎం యూనివర్శిటీ నుంచి తెచ్చారన్నారు. వీరు సర్టిఫికెట్లు తెచ్చేనాటికి వాటికి యూజీసీ గుర్తింపు ఉన్నదా లేదా అనేది కూడా విచారిస్తామన్నారు. సంబంధిత సర్టిఫికెట్లు నకిలీవని తేలితే ఇద్దరు ఉపాధ్యాయులతోపాటు వారి సర్టిఫికేట్లను పరిశీలించిన వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. విచారణలో సిబ్బంది గోపీనాధ్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, శివ తదితరులు కూడా పాల్గొన్నారు. నకిలీ సర్టిఫికెట్లు కావు: తమ ప్రమోషన్ల సమయంలో చూపిన సర్టిఫికెట్లు నకిలీవి కావని ఉపాధ్యాయులు మునెయ్య, ప్రకాష్‌రావు పేర్కొన్నారు. అప్పట్లో విద్యాశాఖాధికారులు కూడా పరిశీలించారన్నారు. తాము సర్టిఫికెట్లు పొందిన యూనివర్సిటీలు గుర్తింపు ఉన్నవేనని అన్నారు. -
విచారణ ప్రారంభం
కడప అగ్రికల్చర్ : ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో అక్కడక్కడ జరిగిన అవకతవకలపై సీబీసీఐడి విచారణ ప్రారంభించింది. సొసైటీలలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతామని ఇటీవల శాసనసభలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం తిరుపతి సీబీసీఐడీ డీఎస్పీ కిశోర్ జిల్లా కేంద్రంలోని కేంద్ర సహకార బ్యాంకుకు వచ్చి సమాచారాన్ని సేకరించారు. అనంతరం పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె, అనంతంపల్లె, అనంతసముద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలలోని రికార్డులను తనిఖీ చేశారు. తిరుపతి నుంచి వచ్చిన సీబీసీఐడీ బృందం పదిరోజులపాటు జిల్లాలో ఉండి పలు విషయాలపై సమగ్రంగా విచారించనున్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకునేందుకు హైదరాబాదు నుంచి మరో బృందం జిల్లాకు రానున్నట్లు సమాచారం. -
అవినీతి గూళ్లు
‘ఇందిరమ్మ’ ఇళ్లలో స్వాహాపర్వం - అధికారులు తేల్చింది రూ.18 కోట్లే - రికవరీ రూ.20 లక్షలు మాత్రమే - అక్రమాలపై సీబీసీఐడీ విచారణ - అక్రమార్కుల గుండెళ్లో గుబులు సాక్షి, కరీంనగర్: ఇల్లు లేని పేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహనిర్మాణ పథకంలో అడుగడుగునా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. లబ్ధిదారుల ఎంపిక మొదలు బిల్లు మంజూరు వరకు అధికారులు, దళారులు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారాన్ని అదునుగా చేసుకుని కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో ఇళ్లు మంజూరీ చేయించుకుని బిల్లులు కాజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు దళారులు ఇల్లు ఉన్నవారికే లబ్ధి చేకూర్చారు. మరికొందరైతే ఏకంగా పాత ఇళ్లకే సున్నం వేయించి సర్కారు ఖజానాకు కన్నం వేయించిన సంఘటనలు జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. ఇలా వేలాది ఇళ్లు పునాదులు కూడా తవ్వకుంటే బిల్లులు డ్రా చేశారు. జిల్లావ్యాప్తంగా రూ.70 కోట్లకు పైనే నిధులు దుర్వినియోగమయ్యాయి. కానీ.. ఇప్పటివరకు రూ.18 కోట్ల మేర కే అవినీతి జరిగినట్టు అధికారులు విచారణలో తేల్చారు. ఇందులో కేవలం రూ.20 లక్షలు మాత్రమే అక్రమార్కుల నుంచి రికవరీ చేసినట్టు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 9,80,789 ఇళ్లు ఉండగా, ఇందులో నివాసయోగ్యమైనవి 2,91,248 వరకు ఉన్నాయి. శిథిలావస్థదశలో.. వసతులు లేని మిగిలిన ఇళ్లలో ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. ఇందిరమ్మ మూడు విడతల్లో జిల్లాకు 2.90 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 55వేల ఇళ్లు కూడా పూర్తి కాలేదు. కొన్ని నిర్మాణ దశలో ఉండగా, చాలాచోట్ల అసలు పునాదులే తవ్వలేదు. జిల్లాల్లో 57 మండలాలు, 1207 గ్రామాలుంటే.. ఇప్పటివరకు ఏడువందల గ్రామాల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. అధికారులు వందకు మించి గ్రామాల్లో విచారణ చేపట్టలేదు. మంథనిలో అధికం.. జిల్లావ్యాప్తంగా మంథని నియోజకవర్గంలోనే అధికంగా నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపణలున్నాయి. అప్పటి అధికార పార్టీ నేతలు పలు గ్రామాల్లో ఉన్న ఇళ్ల సంఖ్యకన్నా ఎక్కువ ఇళ్లు మంజూరు చేయించుకుని బిల్లులు మింగినట్టు తెలుస్తోంది. ఈనెల 25న జిల్లా పరిషత్ సమావేశమందిరంలో ‘మన జిల్లా-మన ప్రణాళిక’ సమావేశంలో అవినీతి విషయం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటారం జెడ్పీటీసీ సభ్యుడు, గత ప్రభుత్వంలో జిల్లా మంత్రి అనుచరుడే గృహనిర్మాణాల్లో అవినీతిని ప్రస్తావించారు. గతంలో కాటారం, మహాముత్తారం, మహదేవపూర్ మండలాల్లో రూ.50 కోట్ల అవినీతి జరిగిందని లెక్కతేల్చారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు. స్పందించిన మంత్రి విచారణకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మరుసటి రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సీఎం నాలుగు వేల మంది సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు విచారణ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పజెప్పడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అక్రమాలపై సమగ్రంగా, పకడ్బందీంగా విచారణ జరిపిస్తే జిల్లాలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. కాగా.. ఈ అక్రమ వ్యవహారం దళారులతో పాటు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. గతంలో గ్రామాల్లో పలువురు ప్రజాప్రతినిధుల సహకారంతో విలేజ్ ఆర్గనైజర్(వీవో)లు బిల్లులు చెల్లించకుండా డబ్బులు కాజేశారు. పనుల ప్రగతి చూసి బిల్లులు మంజూరు చేయాల్సిన వర్క్ ఇన్స్పెక్టర్లు ఇళ్లు లేకున్నా నిధులిచ్చేశారు. నిధుల దుర్వినియోగంపై గతంలో ఎన్నోసార్లు హౌసింగ్ అధికారులు విచారణ కూడా చేపట్టారు. కానీ అప్పట్లో ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా అక్రమార్కులపై చర్యలకు వెనుకడుగు వేశారు. తాజాగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.