
మేమున్నాం...
‘దేశం కోసం మీరున్నారు. మీ కోసం మేమున్నాము’ అని నటుడు నానా పటేకర్ భారత్-పాకిస్తాన్ సరిహద్దులో తమ విధులలో ఉండే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) జవాన్లతో అన్నారు. బిఎస్‌ఎఫ్ ఆహ్వానం మీద జమ్ములోని కతువా ప్రాంతంలోని జవాన్లతో రోజంతా గడిపిన నానా పటేకర్ ‘నేను హీరోనే కాని నిజమైన హీరోలు మీరే’ అని వారిలో ఉత్సాహం నింపారు.
ఇటీవల పాక్ దుశ్చర్యలకు బలైన సైనికుల కుటుంబాలను ఆయన కలిశారు. జమ్ములోని స్కూల్ విద్యార్థులను కలవడం చాలా సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు. జవాన్లను ఉత్సాహపరచడానికి తారాలోకపు అతిథులను ఆహ్వానించడం ఒక సంప్రదాయం. అందులో భాగంగానే విలక్షణ నటుడు నానా ఇలా సరిహద్దు దళాలను కలిశారు.