ఎన్టీఆర్ జిల్లా: టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని, చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఆయన తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం వినగడపలో కట్లేరు బ్రిడ్జి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు.
చంద్రబాబు, ఆయన పనికిమాలిన కొడుకు కలలు కంటున్నారని మండిపడ్డారు. టీడీపీ పార్టీ పని అయిపోయిందని, అమరావతి కడతానన్న చంద్రబాబు ఏపీలో సొంతిల్లు కూడా కట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ సీట్లను అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ పోతారని దుయ్యబట్టారు. 2024 ఎన్నికలవ్వగానే మేలో ఫలితాలొస్తాయని, ఫలితాలు రాగానే చంద్రబాబు, లోకేష్ వాళ్ల సొంత రాష్ట్రం తెలంగాణ పోవడం ఖాయమని మండిపడ్డారు.
టీడీపీ పార్టీ ఈనాడు,ఆంధ్రజ్యోతి,టీవీ5, సోషల్ మీడియా మీదే ఆధారపడిందని, టీడీపీ పార్టీకి గ్రౌండ్ లెవల్లో పనిచేసే వారియర్స్ ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. తన చిన్నప్పుడు ఎన్టీఆర్ సభల్లో చూసినంత జనం ‘సిద్ధం’ సభలో చూశానని తెలిపారు. గుడివాడలో చంద్రబాబు సభ పెడితే 3 వేల మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాట్లాడేసరికి ఉన్నవాళ్లు కూడా వెళ్లిపోయారని, చంద్రబాబుకు అమెరికా నుంచి పార్టీ ఫండ్ ఇవ్వడానికి కమ్మోళ్లు కొంతమంది ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం పనిచేసే వ్యక్తి అని గుర్తుచేశారు.
ధనికుల కోసం.. పనికిమాలిన కొడుకు కోసం.. పనిచేసే వ్యక్తి చంద్రబాబ అని ధ్వజమెత్తారు. వాళ్లు బాగా సంపాదించి కొనుకున్న రోల్స్ రాయిల్స్ కార్లలో తిరగాలి కాబట్టి.. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతికి నున్నటి రోడ్ల కోసం చంద్రబాబు తపనపడుతున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో మనం నొక్కే బటన్ దెబ్బకు ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవాలని ప్రజలు కేశినేని పిలునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ కేసుపెడతారని అర్ధరాత్రి తెలంగాణ నుంచి ఏపీకి చంద్రబాబు పారిపోయి వచ్చాడని విమర్శించారు. ఇప్పుడు జగనన్న దెబ్బకు ఏపీ నుంచి తెలంగాణ పారిపోవడం ఖాయమని అన్నారు.
కట్లేరు బ్రిడ్జి కోసం రూ. 25 కోట్లు మంజూరు చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని ఎంపీ కేశినేని నాని గుర్తుచేశారు. కట్లేరు బ్రిడ్జి కోసం ప్రజలు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారని తెలిపారు. స్వామిదాస్ వైఎస్సార్‌సీపీలో చేరగానే కట్లేరు బ్రిడ్జి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. సీఎం జగన్ తక్షణమే స్పందించి రూ. 25 కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పారు. సంక్రాంతి లోగా బ్రిడ్జిని పూర్తిచేస్తామని అన్నారు. తిరువూరులో 25వేల మెజార్టీతో స్వామిదాస్ చరిత్ర సృష్టించడం ఖాయమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment