పోలీసులను ఆశ్రయించిన బాధితులు
కర్ణాటక: బెంగళూరు నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలోని వాహనదారులకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల నుంచి చలాన్లు వస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టు అందులో వారి బైక్ ఫోటోలతో సహా ఉంది. సుమారు 60 మందికి చలాన్లు రాగా, మొత్తం విలువ లక్షలాది రూపాయలుగా ఉంది. అయితే వారెప్పుడూ ద్విచక్ర వాహనాల్లో రాజధానికి వెళ్లింది లేదు.
కానీ చలాన్లు రావడం చూసి లబోదిబోమన్నారు. ఒక్కొక్కరికి ఏకంగా రూ.50 వేల వరకూ బాదుడు పడింది, గ్రామ వాటర్ మ్యాన్‌కు హెల్మెట్ లేదని రూ.48వేలు జరిమానా వచ్చింది. వణికిపోయిన బాధితులు కనకపుర గ్రామీణ పోలీసుల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఎప్పుడూ బెంగళూరుకు వెళ్లకపోయినా చలాన్లు ఎలా వచ్చాయని అడిగారు. పోలీసులు కూడా మొదట అర్థం కాక ఆశ్చర్యం వ్యక్తం చేసారు. తీరా అసలు సంగతి తెలిశాక అవాక్కయ్యారు.
లోకేశ్ చేసిన పని..
గ్రామంలో నివసిస్తూ, బెంగళూరులో ఇంజినీర్‌గా పనిచేస్తున్న లోకేశ్ అనే పోకిరీ యువకుడు దీనంతటికీ కారణమని తెలిసింది. గ్రామస్తులపై ఏదో కారణం చేత కక్ష పెంచుకున్న లోకేశ్ తన ఇంటి ముందు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసుకుని బైక్‌లు, కార్ల ఫోటోలను కట్ చేసి బెంగళూరు సిటీ పోలీసు (బీసీపీ) యాప్‌లో అప్‌లోడ్ చేసాడు. నాలుగు నెలల నుంచి ఈ దందా చేశాడు. బాధితుల గోడు విన్న సీఐ క్రిష్ణ లమాణి బెంగళూరు పోలీసులతో మాట్లాడి చలాన్లను రద్దు చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment