‘నారా’రూప రాక్షసం.. యథేచ్ఛగా నరమేధం! | 35 people committed suicide due to harassment by TDP mobs | Sakshi
Sakshi News home page

‘నారా’రూప రాక్షసం.. యథేచ్ఛగా నరమేధం!

Published Fri, Jul 19 2024 5:35 AM | Last Updated on Fri, Jul 19 2024 6:13 AM

35 people committed suicide due to harassment by TDP mobs

నాజీలను మరిపిస్తూ పచ్చమూకల పైశాచికం

40 రోజులుగా అడ్డూ అదుపులేని ఉన్మాదం 

గజినీలు, ఘోరీలను తలదన్నేరీతిలో దురాగతాలు  

వరుస హత్యలు... దాడులు...దౌర్జన్యాలు 

ఏకంగా 31 మంది హతం...  

300 మందిపై హత్యాయత్నాలు.. 1,050 దాడులు...  

టీడీపీ రౌడీమూకల వేధింపులతో 35 మంది ఆత్మహత్య 

ప్రాణభయంతో స్వస్థలాలు వదిలివెళ్లిపోయిన 2,700 కుటుంబాలు

ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు రక్షణ కరువు 

యథేచ్ఛగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసకాండ 

మీడియా స్వేచ్ఛకూ విఘాతం.. శాంతిభద్రతలు మృగ్యం

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి పోలీసుల గులాం 

మధ్య యుగాల్లో గజినీలు, ఘోరీలు దండెత్తి సృష్టించిన మారణహోమాన్ని రాష్ట్రంలో చంద్రబాబు రాక్షసపాలన గుర్తుకు తెస్తోంది. ఆధునిక కాలంలో యూదు జాతి మొత్తాన్ని తుదముట్టించాలని జర్మన్‌ నాజీ నియంత హిట్లర్‌ చేసిన ఘోరకలిని తలపిస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పచ్చమూక మరణమృదంగం మోగిస్తోంది. ‘నారా’సుర పాలన విశృంఖలత్వం సృష్టిస్తోంది. అధికారబలం ఉన్నవాడిదే అరాచకం... అన్న అడవినీతిని తలపిస్తూ యథేచ్చగా నరమేధం సాగిస్తోంది. హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది.

 ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసకాండ కొనసాగుతోంది. ప్రైవేటు ఆస్తుల ధ్వంస రచన అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. పచ్చ ముఠాలు సభ్యులు రాష్ట్రంపై తెగబడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లను ముట్టడిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయాలపై దండెత్తుతున్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, తాగునీటి ట్యాంకులు వంటి ప్రభుత్వ ఆస్తులను కూలగొడుతున్నారు. 

టీడీపీ అధికార మదానికి పోలీసు శాఖ దాసోహమైంది. ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కావడంతో చేష్టలుడిగి చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. గోడు వెళ్లబోసుకునేందుకు ఏ వ్యవస్థా అందుబాటులో లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ ధర్మాన్ని కాలరాస్తోంది. టీడీపీ రెడ్‌బుక్‌ రాజ్యాంగ అరాచకమే రాజ్యమేలుతోంది. – సాక్షి, అమరావతి  

నేడు
వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని గురువారం ఆయన సొంత నియోజకవర్గంలోనే హత్య చేసేందుకు టీడీపీ గూండాలు బరితెగించారు. పక్కా పన్నాగంతో కత్తులు, రాళ్లు చేతబట్టి మాటు వేశారు. మూకుమ్మడిగా దాడిచేశారు. టీడీపీ రౌడీమూకలను వారించబోయిన మాజీ ఎంపీ రెడ్డప్పను బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎంపీ ప్రాణాలకే రక్షణలేని పరిస్థితి. 

నిన్న
పల్నాడు జిల్లా వినుకొండలో నడిరోడ్డుపై  వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌పై టీడీపీ గూండా జిలానీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రెండు చేతులు తెగనరికాడు. అనంతరం కత్తితో మెడ నరికి పాశవికంగా హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ సామాన్యుడికి ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదనడానికి తాజా తార్కాణం ఈ దురాగతం.  

కక్ష కట్టి కత్తివేటు...  
హత్యలు31 హత్యాయత్నాలు 300
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 31 మంది దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథహళ్లిలో మాల గుండమ్మ అనే దళిత మహిళను ఆమె పొలంలోనే టీడీపీ నేత రాఘవేంద్రారెడ్డి, ఆయన కుమారుడు శ్రీధర్‌రెడ్డి దారుణంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండువానిపాలెంలో సురేష్‌ అనే ఉన్మాది 9వ తరగతి చదువుతున్న బాలికను కత్తితో పొడిచి హత్యచేశాడు. 

అదేవిధంగా హిందూపురం నియోజకవర్గం గోళపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేత సతీష్... విజయనగరం జిల్లా సీతానగరం మండలం పెద్ద భోగిలే హడ్కో కాలనీలో గుజ్జల హేమంత్‌... శ్రీకాకుళం రెల్లివీధికి చెందిన నల్లపిల్లి గౌరీశంకర్‌.. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారి సమీపంలోని ఓ దాబాలో రాంబాబు అనే వ్యక్తి...

అనంతపురం జిల్లా కోమటికుంట్ల గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఎరికలయ్య..  విశాఖపట్నంలోని అగనంపూడిలో కిరణ్‌ అనే యువకుడు... బాపట్ల జిల్లా చీరాలలో ఓ వ్యాపారి... ఒంగోలులో ఓ యువకుడు... పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టపల్లెలో హనిమిరెడ్డి, దాచేపల్లిలో గుమ్మడి నాగిరెడ్డి... ఇలా 40 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఐదు హత్యలు జరిగాయి. మరో 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి.

భరించలేక.. బలవన్మరణాలు 
ఆత్మహత్యలు 35 
వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రమే కాదు... చిరు వ్యాపారులు, చిన్నాచితక ఉద్యోగులు, సామాన్యులపై సైతం టీడీపీ నేతలు తమ ప్రతాపం చూపుతున్నారు. ‘ఇక మా ప్రభుత్వం వచ్చింది.. మీరు తప్పుకోండి..’ అంటూ బెదిరిస్తున్నారు. తమకు ఎదురు చెబితే తప్పుడు కేసులు పెట్టి కుళ్ల»ొడిపిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఉపాధి కోల్పోతామని... పరువు పోతుందనే భయంతో తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

టీడీపీ నేతలు ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించడంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ జడ ఆనంద్‌ పురుగులమందు తాగి చనిపోయాడు. పోలీసుల వేధింపులతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్‌ కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా 40 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ నేతల వేధింపుల కారణంగా అత్యధికంగా వైఎస్సార్‌ జిల్లాలో 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 11 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.

చిన్నారులనేకనికరం లేకుండా.. 
లైంగిక దాడులు20
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లైంగికదాడులుఘోరంగా జరుగుతున్నాయి. చిన్నారులు అనే కనికరం కూడా లేకుండా ఉన్మాదులు చెలరేగిపోతున్నారు. కేవలం 40 రోజుల్లోనే 20 మందిపైలైంగికదాడులు జరిగాయి. వారిలో నలుగురిని దుండగులు చంపేశారు. చీరాలలో జూన్‌ 21వ తేదీన ఓ చేనేత కుటుంబానికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లగా, ఆమెపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. 

నంద్యా­ల జిల్లా ముచ్చుమర్రిలో పది రోజుల కిందట ఎని­మి­­దేళ్ల గిరిజన బాలికను దుండగులు అపహరించి అత్యా­చారానికి పాల్పడ్డారు. ఆ బాలిక ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. అనంతపురం జిల్లా అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను జూన్‌ 24న అపహరించి తాడిపత్రి మార్కెట్‌ యార్డ్‌ వద్ద ఉన్న వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలిసిలైంగికదాడికి పాల్పడ్డారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా 20 మందిపై లైంగిక దాడులు జరిగాయి.

అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నవభారత్‌ జంక్షన్‌లో జూన్‌ 17న ఓ మహిళపై దాడి చేసి ఒళ్లంతా కారం చల్లి ఆటోలోకి బలవంతంగా ఎక్కించి శ్రీకాకుళం పట్టణంలోకి తీసుకువెళ్లి నడివీధిలో వివస్త్రను చేసి ఊరేగించారు. అనకాపల్లి జిల్లా దర్మసాగరంలో టీడీపీ వర్గీయులు కుమారి అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమెను వివస్త్రను చేసి కొట్టారు. ఇవన్నీ అధికారిక లెక్కలు. కానీ ఫిర్యాదులు చేసేందుకు పలువురు బాధితులు వెనుకంజ వేస్తున్నారు. బాధితులు అందరూ ఫిర్యాదులు చేస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement