నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు | Chandrababu was exposed to election irregularities | Sakshi
Sakshi News home page

నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు

Published Thu, May 9 2024 5:49 AM | Last Updated on Thu, May 9 2024 6:43 AM

Chandrababu was exposed to election irregularities

ఎన్నికల అక్రమాలకు బరితెగించిన చంద్రబాబు

వరదలై పారుతున్న ‘పచ్చ’ నోట్లు 

రూ.17,500 కోట్లతో పన్నాగం

మాచర్లలో హోలోగ్రామ్‌తో ఓటరు స్లిప్పులు పంపిణీ

దాని ద్వారా ఓటరుకు రూ.3 వేలు..  మద్యం, మధ్యస్థాయి నేతలకు నగదు అదనం

మొత్తం నియోజకవర్గానికి రూ.100 కోట్ల ఖర్చుకు స్కెచ్‌

ప్రతి నియోజకవర్గంలో మాచర్ల తరహా ప్లాన్‌.. పోలీసుల తనిఖీల్లో పచ్చ కుట్ర బట్టబయలు

రామోజీ, నారాయణ, టీడీపీ నేతల సంస్థల ద్వారానే కుతంత్రం అమలు

టీడీపీ నేతల ఇళ్లల్లో భారీగా పట్టుబడుతున్న అక్రమ నిధులు

మైలవరం టీడీపీ అభ్యర్థి సన్ని­హితుడి ఇంట్లో రూ. కోటి పట్టివేత.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో పట్టుబడుతున్న ‘పచ్చ’ నోట్ల కట్టలు

అవసరమైతే దౌర్జన్యాలు, హత్యలకూ సిద్ధం.. ఇందుకోసం రిటైర్డ్‌ అధికారులతో ప్రత్యేక టీం

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు లేదేని, ఓటమి ఖాయమని తేలిపోవడంతో చంద్రబాబు తన నల్ల ఖజానా గేట్లు ఎత్తేశారు. పచ్చ నోట్ల వరద పారిస్తున్నారు. ఇందుకు నిదర్శనాలివి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఎన్నికల అధికారుల తనిఖీల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, అనుచరుల వద్ద భారీ మొత్తంలో అక్రమ నగ­దు, కానుకలు పట్టుబడ్డాయి.

వెలుగులోకి రాని అక్రమాలు, పట్టు­బడకుండా టీడీపీ నేతల వద్ద గుట్టలు గుట్టలుగా ఉన్న అక్రమ సొమ్ముకు లెక్కే లేదు. ఎన్నికల కమిషన్‌ (ఈసీ)ని బురిడీ కొట్టిస్తూ కొత్తదారుల్లో పచ్చ నోట్లు వెదజల్లుతున్నారు. అందుకోసం షెల్‌ కంపెనీల నుంచి రామోజీరావుకు చెందిన మార్గదర్శి, నారాయణ విద్యా సంస్థలు, ఇతర టీడీపీ నేతల వ్యాపార సంస్థల్లోకి భారీగా అక్రమ నిధులు మళ్లిస్తున్నారు.

గొల్లపూడిలో దొరికింది పెద్దమొత్తమే!
భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వసంత కృష్ణప్రసాద్‌ అనుచరుడు ఆలూరి సురేష్‌ ఇంటిపై ఫ్లయింగ్‌ స్క్వాడ్, పోలీసు అధికారుల దాడిలో దొరికింది రూ. కోటి అని చెబుతున్నప్పటికీ, ఇంకా పెద్దమొత్తంలోనే నగదు బయటపడినట్లు భావిస్తున్నారు. సురేష్‌ ఇంట్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు భవానీపురం పోలీసులకు అందిన సమాచారాన్ని ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారిణి సుధకు తెలియజేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్, పోలీసులు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గొల్లపూడి టెలికాం కాలనీలోని సురేష్‌ ఇంట్లో సోదాలు చేశారు.

దాదాపు నాలుగు గంటలపాటు సోదాలు చేసి, సురేష్‌ను విచారించారు. సొమ్మును లెక్కించేందుకు కౌంటింగ్‌ మిషన్‌ కూడా తెప్పించారు. దీంతో పెద్ద మొత్తమే దొరికి ఉండవచ్చని భావిస్తున్నారు. సాయంత్రం 6.30 తరువాత ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారిణి సుధ బయటకు వచ్చి తమ సోదాలో కోటి రూపాయలు దొరికాయని ముక్తసరిగా చెప్పారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేసి వెళ్లిపోయారు. 

అసలు ఈ డబ్బు సురేష్‌ వద్దకు ఎలా వచ్చింది, ఇతర విషయాలు గోప్యంగా ఉంచడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మైలవరం నియోజకవర్గంలో పంచాయితీరాజ్‌ డీఈఈగా ఉన్న సుధకు ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌తో పరిచయాలు ఉండటం వల్లే ఇంత గోప్యంగా వ్యవహరించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. కృష్ణప్రసాద్‌ ఇదే విధంగా తన సామాజికవర్గానికి చెందిన పలువురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు డంప్‌ చేసినట్లు సమాచారం.

ఉప్పందించింది దేవినేని ఉమా వర్గమే!
ఎన్టీఆర్‌ జిల్లా కవులూరుకు చెందిన ఆలూరి సురేష్‌ కొన్నేళ్లుగా గొల్లపూడిలో శ్రీనివాస లారీ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీస్‌ నడుతున్నాడు. గతంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావు వెంట ఉండేవారు. వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలోకి వచ్చి మైలవరం అభ్యర్ధిగా పోటీ చేస్తుండటంతో ఆయనకు అనుచరుడిగా మారారు. సురేష్‌ బుల్లెట్‌ బైక్‌ వెనుక నంబరు కూడా లేదు. ‘మన మైలవరం..మన వసంత’ అని స్టిక్కర్‌ ఉంది. మైలవరం నియోజకవర్గంలో కృష్ణప్రసాద్‌కు, మాజీ మంత్రి దేవినేని ఉమా వర్గానికి పడదు. దీంతో దేవినేని వర్గమే సురేష్‌ వద్ద ఉన్న డబ్బు సమాచారాన్ని పోలీసులకు చేరవేసి ఉంటారని భావిస్తున్నారు. 

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ పంపిణీ చేస్తున్న ఓటర్ల స్పిప్పులు ఇవి. ఎన్నికల్లో ఓటర్ల స్లిప్పుల పంపిణీ సాధారణమే. కానీ అక్కడే ఉంది చంద్రబాబు మాయోపాయం. ఓటర్లకు పంచుతున్న ఆ ఓటరు స్లిప్పుల మీద హోలోగ్రామ్‌ ముద్రించారు. ఈ డబ్బు ఇచ్చేందుకు ప్రతి బూత్‌కు ఓ ఏజెంటును నియమించారు. ఓటరు స్లిప్పును ఆ ఏజెంటుకు ఇస్తే, ఆయన దానికి స్కాన్‌ చేసి, ఓటరు ఖాతాలో రూ.3 వేలు వేస్తారు. 

ఇలా నియోజకవర్గంలోని 1.70 లక్షల మంది ఓటర్లకు ఓటుకు రూ.3 వేలు చొప్పున రూ. 51 కోట్ల పంపిణీకి చంద్రబాబు బరితెగించారన్నది సుస్పష్టం. పోలింగ్‌ రోజు వరకు మద్యం పంపిణీ, చోటా మోటా నేతలు, బూత్‌ కమిటీలకు యథేచ్ఛగా డబ్బుల పందేరం అదనం. ఇలా నియో­జకవర్గంలో ఎన్నికల అక్రమాలకు చంద్రబాబు రూ.100 కోట్లతో  పకడ్బందీ స్కెచ్‌ వేసినట్టు స్పష్టమైంది. మాచర్లలో పోలీసులు దాడులు చేసి టీడీపీ నేతల ఇళ్లలో ఉన్న ఈ స్లిప్పులను స్వాధీనం చేసుకోవడంతో చంద్రబాబు పన్నాగం బట్టబయలైంది. 

ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడు ఆలూరి సురేశ్‌ బాబు నివాసంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్, పోలీసు అధికారులు తనిఖీ చేసి, రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. ఆయన విజయవాడలోని స్వీట్‌ మ్యాజిక్‌ హోటల్స్‌ భాగస్వామి. మైలవరం నియోజకవర్గంలో ఓట్లు కొనేందుకే ఈ నిధులు అక్రమంగా తరలించినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులకు దొరికింది రూ. కోటే అయినా, స్వీట్‌ మ్యాజిక్‌ హోటల్స్‌ యజమానుల ద్వారా షెల్‌ కంపెనీలను ఉపయోగించి దాదాపు రూ.10 కోట్ల వరకు తరలించాలని కుతంత్రం పన్నినట్టు భావిస్తున్నారు. మిగిలిన నిధుల కోసం పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు.

రాష్ట్రం అంతటా మాచర్ల ఫార్మూలానే!
మాచర్ల ఫార్మూలానే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చంద్రబాబు పకడ్బందీ ప్రణాళిక రచించారు. హోలోగ్రామ్‌లు ముద్రించిన ఓటర్ల స్లిప్పులతో ఓట్లు కొనుగోలుకు రంగం సిద్ధం చేశారు. దీంతోపాటు మద్యం, నేతలకు ముడుపులకూ నల్ల ధనాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. ఇలా నియోజకవర్గానికి రూ.100 కోట్లు చొప్పున 175 నియోజకవర్గాలకు మొత్తం రూ.17,500 కోట్లు వెదజల్లి ఎన్నికల అక్రమాలకు బరితెగించాలన్నది చంద్ర­బాబు లక్ష్యం. అందుకోసం ఎంతకైనా తెగించాలని, ఎంతటి బీభత్సమైనా సృష్టించాలని ఆయన స్పష్టం చేసినట్టు సమా­చారం. 

ఈమేరకు నియోజకవర్గాల్లో దౌర్జన్యాలకు, చివరికి హత్యలకు కూడా తెగించేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ రిటైర్డ్‌ రాష్ట్ర పోలీస్‌ బాస్, రిటైర్డ్‌ డీఐజీ, సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌లతో ఓ ముఠాను తయారు చేసి పచ్చ పన్నాగం అమలు బాధ్యతను అప్పగించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో చంద్రబాబుతో కలసి చదువుకున్న ఓ రిటైర్డ్‌ ప్రొఫెసర్, ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌  (ఈయన చంద్రబాబు కేసుల్లో సహా నిందితుడు కూడా), టీడీపీ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన ఆర్థిక నిపుణుడు ఈ కుట్ర అమలు కోసం టీడీపీ నేతలతో సమన్వయం చేస్తున్నట్లు సమాచారం.

అంతా చంద్రబాబు, లోకేశ్‌ కనుసన్నల్లోనే
ఎన్నికల అక్రమాలకు పాల్పడేందుకు నల్ల ధనం తరలింపు వ్యవహారం మొత్తం చంద్రబాబు, లోకేశ్‌ కనుసన్నల్లోనే సాగుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్చగా కుంభకోణాలకు పాల్పడి కొల్లగొట్టిన నిధు­లను చంద్రబాబు వివిధ షెల్‌ కంపెనీల ద్వారా తరలించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన నిధులను షెల్‌ కంపెనీల ద్వారా హైదరాబాద్‌లోని నాలుగు బ్యాంకుల్లో ఉన్న టీడీపీ ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారా­లతోసహా గుర్తించిన విషయం తెలిసిందే. 

అదే విధంగా అమరావతి భూములు, మద్యం, ఇసుక, ఫైబర్‌ నెట్‌ తదితర కుంభకోణాల ద్వారా కొల్లగొ­ట్టిన లక్షల కోట్ల రూపాయలను షెల్‌ కంపెనీల ద్వారా తరలించారు. ఆ అక్రమ ఖజానా నుంచే ప్రస్తుతం ఎన్నికల అక్రమా­ల కోసం నిధులను వివిధ రూపాల్లో తరలిస్తున్నారన్నది తేటతెల్లమ­వుతోంది. మార్గదర్శి, నారాయణ, రాయల్‌ మెరైన్‌ సీఫుడ్స్, సోమా అగ్రిటెక్, స్వీట్‌ మ్యాజిక్‌... ఇలా వివిధ సంస్థల ద్వారా నియోజక­వర్గాలకు తరలి­స్తున్న వేల కోట్ల రూపాయలు చంద్రబాబు అక్ర­మ ఖజానా నుంచి మళ్లిస్తున్నవేనన్నది సుస్పష్టం. పోలింగ్‌నాటికి చంద్రబాబు ఇంకెంతగా బరితెగిస్తారో.. ఈ అక్రమాలను ఈసీ, పోలీసులు ఎలా కట్టడి చేస్తారో అన్నది చూడాల్సిందే.

ఇటీవలి కాలంలో పట్టుబడ్డ 
‘పచ్చ’ ధనంలో ప్రధానమైనవి మరికొన్ని..
» అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్‌ వాహనంలో తరలిస్తున్న రూ.2 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 
»    బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మకు చెందిన రాయల్‌ మెరైన్‌ ఫుడ్స్‌ కంపెనీ కంటైనర్లలో భారీ మొత్తంలో తరలిస్తున్న నగదును డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
»    ఏకంగా చంద్రబాబు రాజగురువు రామోజీ­రావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల నుంచే గుట్టుచప్పుడు 
కాకుండా నల్లధనం పంపిణీ జరుగుతుండటం గమనార్హం. విశాఖపట్నంలో మార్గ­దర్శి చిట్‌ఫండ్స్‌ సిబ్బంది అక్రమ నిధులు తరలిస్తూ పోలీసులకు పట్టుబ­డ్డారు. రాష్ట్రంలోని 37 మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ శాఖల ద్వారా నెలకు రూ.200 కోట్ల టర్నోవర్‌ అని అక్రమంగా చూపిస్తూ.. కొన్ని నెలలుగా టీడీపీ ఎన్నికల అక్రమా­లకు భారీగా నల్లధనాన్ని వెదజల్లేలా సాగిస్తున్న కుట్ర బట్టబయలైంది. 
»   టీడీపీ సీనియర్‌ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు చెందిన విద్యా సంస్థల తరపున ఏర్పాటు చేసిన ఇన్‌స్పైరా కంపెనీ వ్యవహారాల ముసుగు­లో ఎన్నికల అక్రమాలకు భారీగా నల్లధనాన్ని మళ్లించిన బాగోతం ఇటీవల బట్టబయలైంది. పోలీ­సులు సోదాల్లో నగదుతోపాటు, షెల్‌ కంపెనీల ద్వారా భారీగా నల్లధనం తరలించినట్లు వెలుగులోకి వచ్చింది.
»   బీజేపీ తరపున పోటీ చేస్తున్న చంద్రబాబు ముఠా సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి నల్లధనం 
పంపిణీకి ఏకంగా ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పారు. ఓట్ల కొనుగోలు, ఇతర అక్రమాల కోసం సుజనా చౌదరికి ఉమ్మడి కృష్ణా జిల్లా, సీఎం రమేశ్‌కు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను అప్పగించారు.
»   బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు తన నోవా అగ్రిటెక్‌ కంపెనీ బ్యాంకు ఖాతాల్లోకి అక్రమ నిధులు మళ్లించి, ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డ బాగోతం కూడా డీఆర్‌ఐ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కంపెనీ వ్యాపార లావాదేవీల ముసుగు­లో ఓట్లు కొనుగోలు, ఇతర ఎన్నికల అక్రమాలకు నిధులు తరలించిన కుతంత్రం ఆధా­రాలతోసహా బయటపడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement