మోదీ, షా కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు: మంత్రి ఆర్కే రోజా | Minister RK Roja Slams On Chandrababu | Sakshi

చంద్రబాబు డర్టీ పొలిటీషియన్: మంత్రి ఆర్కే రోజా

Feb 7 2024 3:20 PM | Updated on Feb 7 2024 4:12 PM

Minister RK Roja Slams On Chandrababu - Sakshi

చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి తన కొడుకు లోకేష్‌ను పంపాడు. ఇప్పుడు చంద్రబాబుతో కలిస్తే బీజేపీకే నష్టం..

సాక్షి, విజయవాడ: ఈ దేశంలోనే చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఆమె బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

‘ప్రధాని మోదీ తల్లి, భార్యని తిట్టిన వ్యక్తి చంద్రబాబు. మోదీని తిట్టి, నల్ల జెండాలు ఎగురవేశాడు. మళ్ళీ ఇప్పుడు మోదీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. మోదీని దేశంలో లేకుండా చేస్తానని చంద్రబాబు గతంలో అన్నాడు.

అమిత్ షాపై తిరుమలలో చంద్రబాబు రాళ్లు వేయించాడు. ఇప్పుడు అమిత్ షా కాళ్ళు పట్టుకుంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి తన కొడుకు లోకేష్‌ను పంపాడు. ఇప్పుడు చంద్రబాబుతో కలిస్తే బీజేపీకే నష్టం’ అని రోజా దుయ్యబట్టారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసినా వైఎస్‌ జగన్.. మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement