సాక్షి, హైదరాబాద్: ‘చంద్రబాబు నాయుడి అరెస్టు ఏపీకి సంబంధించిన అంశం. రెండు రాజకీయ పార్టీల నడుమ యుద్ధానికి సంబంధించినది. ఆ రెండు పార్టీల ఉనికి ఇక్కడ లేదు. అక్కడి రాజకీయాలతో మాకేం సంబంధం? అక్కడి పరిణామాలు తెలంగాణ ప్రజలపై ఎలాంటి ప్రభా వం చూపలేవు. ఎవరైనా వచ్చి ఇక్కడ నాటకాలు వేస్తే ‘బేగానీ షాదీ మే అబ్దుల్లా దీవానా’ అన్నట్లు (ఎవరిదో పెళ్లికి వేరెవరో హడావుడి చేసినట్లు..) ఉంటుంది.
చంద్రబాబు అరెస్టు అయింది ఏపీ లో. అక్కడ ర్యాలీలు, ధర్నాలు చేసుకుంటే ఎవరొ ద్దంటారు. హైదరాబాద్‌లో ర్యాలీలు తీస్తే ఎలా? పక్కింటి పంచాయతీ ఇక్కడ తీర్చుకోవడం ఎక్కడి పద్ధతి? ఏపీలో ఒకరితో ఒకరు తేల్చుకోండి. రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా ర్యాలీలు తీయండి. అక్కడి పంచాయితీ హైదరాబాద్‌లో పెడితే ఎలా? ఇక్కడ శాంతి భద్రతలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎలా అను మతి ఇస్తారు? ఇవాళ వీళ్లు చేస్తే రేపు ఇంకొకరు చేస్తారు. వాళ్ల ఘర్షణకు హైదరాబాద్‌కు వేదిక కావాలా? విజయవాడ, రాజమండ్రి, అమరా వతి లేవా? అక్కడ ఏమీ చేయకుండా ఇక్కడ రాద్ధాంతం, రాజకీయం చేయడం ఏంటి?.
లోకేశ్ తన స్నేహితుడి ద్వారా మాట్లాడించారు..
చంద్రబాబు అక్కడ న్యాయ పోరాటం చేస్తున్నపుడు ఇక్కడ ఎవరు పడితే వాళ్లు రోడ్డు మీదకు వచ్చి మాట్లాడతారా? లోకేశ్, జగన్, పవన్‌తో నాకు మితృత్వం ఉంది. అందరూ దోస్తులే.. ఆంధ్రాతో తగాదాలు లేవు. అలాంటపుడు మాకు లేని పోని పంచాయితీలు ఎందుకు పెడుతున్నారు. హైదరాబాద్‌లో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు కలసిమెలసి ఉన్నారు.
అక్కడి పంచాయితీ ఇక్కడ పెట్టి ఇక్కడ స్థిరపడిన వారి నడుమ లేని వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు లేపి దానిని మాకు చుడతామంటే ఎలా? హైదరాబాద్‌లో నిరసనలకు అనుమతి ఎందుకు ఇవ్వ డం లేదని లోకేశ్ తన స్నేహితుడి ద్వారా మాట్లాడించారు. ఇక్కడి ఐటీ కారిడార్‌లో శాంతిభద్రతలు ఏం కావాలి? ఇక్కడ పెట్టుబడులు పెడుతున్న ఆంధ్రా వారికి లాభాలు రావాలంటే శాంతిభద్రతలు బాగుండాలి. అక్కడి రాజకీయ గొడ వల్లో మేము తలదూర్చం. చంద్రబాబు అరెస్టుపై మా పార్టీ నేతలు ఎవరైనా మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం. మేము న్యూట్రల్‌గా ఉంటున్నాం.. సహకరించాలి..’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment