మళ్లీ ఢిల్లీ విమానం ఎక్కిన లోకేశ్‌ | Confusion in TDP cader | Sakshi
Sakshi News home page

మళ్లీ ఢిల్లీ విమానం ఎక్కిన లోకేశ్‌

Published Sun, Oct 8 2023 4:52 AM | Last Updated on Sun, Oct 8 2023 7:18 AM

Confusion in TDP cader - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభ­కోణంలో చంద్రబాబు అరెస్టయి జైల్లో ఉన్న సమ­యంలో ఆయన తనయుడు లోకేశ్‌ వ్యవ­హరిస్తున్న తీరుతో తెలుగుదేశం పార్టీలో అయో­­మయం నెలకొంది. యువ­గళం పాద­యాత్రను నిలిపివేసిన లోకేశ్‌ వెంటనే ఢిల్లీ వెళ్లి, అక్కడే ఉండిపోవడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణి­ంచుకోలేకపోయాయి. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసుల గురించి న్యాయ­వాదులతో చర్చించేందుకు అక్కడే ఉంటున్నట్లు పార్టీ వర్గాలు సమర్థించు­కుంటూ వచ్చాయి.

అరెస్టు భయంతోనే ఆయన ఢిల్లీ వదిలి రావడంలేదని సొంత పార్టీ నేతలకే అవగతమైంది. దీనిపై విమర్శలు వచ్చినా ఇన్నాళ్లూ ఆయన అక్కడే కాలం గడి­పారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ పోలీసులు లోకేశ్‌కు నోటీసులు ఇచ్చినప్పుడు సైతం ఆయన డ్రామా నడి­పారు. నోటీసులు తీసుకోకుండా ఢిల్లీలో దాగు­డు­మూతలు ఆడి చివరికి తప్పనిసరి పరిస్థి­తుల్లో తీసుకున్నారు.

సీఐడీ పోలీసులు తనకు లవ్‌ లెటర్‌ ఇచ్చారంటూ సెటైర్లు వేశారు. తాను 4వ తేదీన సీఐడీ విచా­రణకు హాజరవు­తానని గంభీరంగా చెప్పారు. కానీ దానిపై కోర్టుకెళ్లి విచారణకు తనకు సమయం కావా­లని అభ్యర్థించారు. కోర్టు 10వ తేదీ వరకు సమయం ఇవ్వడంతో ఢిల్లీలోనే పనేమీ లేకుండా కాలక్షేపం చేశారు.

తప్పులో కాలేసి మళ్లీ ఢిల్లీకి.. 
ఈ సమయంలోనే సీఎం జగన్‌ అధికా­రిక పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లడంతో లోకేశ్‌ ఉన్నట్టుండి రాజమండ్రి వచ్చారు. తన తండ్రి చంద్రబాబుతో ములాఖత్‌ ఉంది కాబట్టే వచ్చా­నని సర్దిచెప్పుకుంటున్నా జగన్‌ ఢిల్లీలో అడుగుపెట్టగానే ఆయన ఢిల్లీని వీడడం చర్చ­నీయాంశమైంది. రాజమండ్రి వచ్చి జైల్లో చంద్ర­బాబును కలిశాక గంభీర ఉపన్యాసం ఇచ్చా­రు.

తన తండ్రి అవినీతిని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తామంటూ మళ్లీ పప్పులో కాలే­యడంతో టీడీపీ శ్రేణులు తల పట్టు­కు­న్నా­యి. ఆ వ్యాఖ్య­లు సోషల్‌ మీడియాలో విప­రీతంగా ట్రోల్‌ అవు­తుండగా శనివారం సీఎం జగన్‌ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి రావడంతో లోకేశ్‌ మళ్లీ వెంటనే ఢిల్లీ విమానం ఎక్కేశారు. దీంతో ఏం జరు­గుతోందో అర్థం కాక టీడీపీ శ్రే­ణులు అయో­­మయంలో పడిపో­యా­యి.

అరె­స్ట్‌ భయ­ంతోనే లోకేశ్‌ ఇలా చేస్తున్నారని టీడీపీ­లోని సీనియర్‌ నేతలు చర్చించుకుంటు­న్నారు. అత్య­ంత కీలక సమయంలో లోకేశ్‌ ఇలా పార్టీని వది­లేసి వెళ్లడం సరికాదని వాపో­తు­న్నారు. ఏదో వంకతో 10వ తేదీ విచారణకు కూ­డా డుమ్మా కొడతారని టీడీపీ నేత ఒకరు తెలి­­పా­రు. రోజుకోరకంగా తన అసమర్థత, బేల­త­నాన్ని లోకేశ్‌ ఇలా బయట పెట్టుకోవడం పరి­­పాటిగా మారిందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement