సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ నేత నారా లోకేశ్‌ని పప్పు అని, మందబుద్ధి అని ఇతర పార్టీల నేతలు విమర్శిస్తుంటారు. ఇది కరెక్టే అని ఆయన మాటలు, చేతల్లో ఆయనకు ఆయనే నిరూపించుకుంటూ ఉంటారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే విషయంలో ఈ అజ్ఞానం మరింత స్పష్టంగా బయటపెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటిదే శుక్రవారం ఒక ట్వీట్ చేశారు.
మహిళల రక్షణ పైన వాస్తవాలు తెలుసుకోకుండా.. ఒక అంశాన్ని మరో అంశంతో కలిపేసి సోషల్‌మీడియా సాక్షిగా అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. పప్పు లోకేశ్.. ఇది తప్పు రాష్ట్రంలో లైంగిక వేధింపులపై లోకేశ్ తప్పుడు ఆరోపణ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. సీఎం వైఎస్‌జగన్ రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దిశ ఎస్‌ఓఎస్ యాప్ ద్వారా ఆపద సమయంలో ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారు.
దీంతో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు చాలా తగ్గిపోయాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ, ఆరోగ్యసర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)– 5 ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో 18 నుంచి 29 ఏళ్ల మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు ప్రస్తుత ప్రభుత్వంలో తగ్గినట్టు వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వం ఉండగా 2015–16లో 6.8 శాతం మంది లైంగిక వేధింపులకు గురైనట్టు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–4 నివేదికలో కేంద్రం వెల్లడించింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019–20లో లైంగిక వేధింపుల ఘటనలు 3.7 శాతానికి తగ్గాయని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–5 లో కేంద్రం పేర్కొంది. అయితే, వైఎ స్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లేలా లోకేశ్ ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–5లో వెల్లడించిన చిన్న వయస్సులో గర్భధారణల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఇందుకు లైంగిక వేధింపులే కారణమంటూ దిగజారి ఆరోపణలు చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోప్రజలకు సరైన అవగాహన లేక చిన్న వయస్సుల్లోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తుంటారు.
దీంతో వారు చిన్న వయస్సులో గర్భం దాలుస్తుంటారు. 2019–20లో ఇలా గర్భం దాల్చిన వారు 12 శాతం దాటినట్లు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–5లో వెల్లడించారు. దీన్ని పట్టుకొని మహిళలపై లైంగిక దాడులే ఇందుకు కారణం అంటూ ఆరోపణలు చేయడం లోకేశ్ మందబుద్ధికి నిదర్శనం. ఇదే లోకేశ్ తండ్రి చంద్రబాబు సీఎంగా ఉన్న 2015–16 మధ్య రాష్ట్రంలో చిన్న వయస్సు గర్భధారణలు 12 శాతం ఉన్నట్టు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–4 నివేదిక పేర్కొంది. దీనికి ఏం సమాధానం చెబుతావ్ అని సోషల్ మీడియాలో లోకేశ్‌పై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment