రాజకీయ హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది | Kakani Govardhan Reddy Fires On Nara Lokesh Redbook, Check His Comments Inside | Sakshi
Sakshi News home page

రాజకీయ హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది

Published Wed, Aug 7 2024 5:55 AM | Last Updated on Wed, Aug 7 2024 1:52 PM

Kakani Govardhan Reddy Fires on Lokesh Redbook

లోకేశ్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది

హత్యలు చేయడంలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘గత ప్రభుత్వంలో వేసిన అభివృద్ధి శిలాఫలకా­లను టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వంసం చేస్తు­న్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఎవరైతే శిలా­ఫలకాలను కూల్చివేస్తారో.. మళ్లీ వాళ్లేతోనే నిర్మింప­జే­స్తాం. టీడీపీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీల అమ­లుకు కృషి చేయాలి. లేకపోతే ప్రజ­లకు అండగా నిలిచి.. పోరాటం చేస్తాం’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు.  ఆయన మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. రాజకీయ హత్య­లతో రాష్ట్రం అట్టుడికిపోతోందని.. లోకేశ్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడిపి­స్తు­న్నా­డని కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండి­పడ్డారు. ‘ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చడం కుదరదని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. 

మైసూర్‌ బోండాలో మైసూర్‌లాగా.. ఉచిత ఇసుకలో ఉచితం కన్పిస్తోంది. ఉచిత ఇసుక ఇస్తున్నట్లు చంద్రబాబు రోజూ ఊకదంపుడు ఉపన్యా­సాలు ఇస్తున్నారు. ఆ ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతుందో చంద్రబాబుకే తెలియా­లి. టీడీపీ మూకలు మాత్రం ఇసుక రేవుల్లో పడి ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. రాష్ట్రంపై రూ.14 లక్షల కోట్ల అప్పు భారం ఉందంటూ రచ్చ చేసిన చంద్రబాబు.. గవర్నర్‌ ప్రసంగంలో మాత్రం రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పించారు. ఇష్టారీతిన హామీ­లు ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా అప్పుల గురించి? అవినీతి, అక్రమాలకు పాల్ప­డుతున్న ఎమ్మె­ల్యేలు చెప్పిన­ట్లుగా నడుచు­కోవా­లని కలెక్టర్లు, ఎస్పీలకు చెప్పడం ద్వారా చంద్రబాబు కూడా అవినీతికి వంతపాడుతున్నారు. దాడులు, అవినీతి, అక్రమాల్లో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు’ అని కాకాణి ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement