సాక్షి,మచిలీపట్నం:డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇటీవలి కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పేర్నినాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై మచిలీపట్నంలో పేర్నినాని సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.
స్టెల్లాషిప్‌ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్ కెన్‌స్టార్‌షిప్‌ను ఎందుకు వదిలేశారని మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. తన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కెన్‌స్టార్‌షిప్‌లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని, అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టం చేయాలన్నారు. కెన్‌స్టార్‌షిప్‌లోకి వెళ్లకూడదని పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు చెప్పారా అని పేర్నినాని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment