
సాక్షి,మైదుకూరు: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో 16వ శతాబ్దం నాటి వినాయక విగ్రహాన్ని గుర్తించినట్టు ఔత్సాహిక పరిశోధకుడు బొమ్మిశెట్టి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి పశువుల దొడ్డిలో ఈ విగ్రహాన్ని కనుగొన్నట్టు పేర్కొన్నారు.
విగ్రహం ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిలో డమరుకం ఉన్నట్టు తెలిపారు. మైసూరు పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి విగ్రహం గురించి తెలియజేయగా, అది 16వ శతాబ్దం నాటిదని ఆయన చెప్పినట్టు రమేష్ తెలిపారు.