
సాక్షి, రాజంపేట: బుల్లెట్ రూ.25 నుంచి రూ.35వేలకే వస్తోందంటే ఆశ్చర్యమే కదూ... వైఎస్సార్ కడప జిల్లా నందలూరులో పలువురు యువకుల చేతిలో బుల్లెట్ కనిపిస్తోందంటే ఇదే కారణం అన్న భావన వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే కర్ణాటక నుంచి నందలూరు తదితర ప్రాంతాలకు బుల్లెట్, పల్సర్ లాంటి బైకులను తీసుకొచ్చి అతి తక్కువ ధర విక్రయించే ముఠా వ్యవహారం నందలూరులో బట్టబయలైంది. రూ.1లక్షకు పైగా ఉన్న బుల్లెట్ ద్విచక్రవాహనం ధర రూ.50 వేలకే లభ్యం కావడంతో యువత ఎగబడి కొన్నారు. నందలూరు పోలీసులకు అనుమానం వచ్చి రెండురోజుల కిందట బుల్లెట్ వాహనాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. వీటిని స్మగ్లింగ్ చేసే అసలు వ్యక్తి కోసం పోలీసులు రంగంలోకి దిగారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment