Ganesha idols
-
రిచెస్ట్ గణపతి: 69 కిలోల బంగారం.. 336 కిలోల వెండి.. చూస్తే రెండు కళ్లూ చాలవు!
Richest Ganpati: దేశంలో ప్రముఖంగా జరిగే పండుగల్లో వినాయక చవితి ఒకటి. భక్తులు తమ శక్తికొద్దీ గణేషుడి ప్రతిమలు కొలుదీర్చి పూజలు చేస్తారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో గణేష్ చతుర్థి అత్యంత వైభవంగా జరుగుంది. గణేషుడి భారీ విగ్రహాలతోపాటు కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన మంటపాలను ఇక్కడ చూడవచ్చు. ముంబై నగరంలోని అత్యంత సంపన్నమైన గణపతి మండపాలలో ఒకటిగా పేరుగాంచిన గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) మండల్ తమ 69వ వార్షిక గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా 69 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలతో గణేష్ విగ్రహాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. (Ganesh Chaturthi: రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..) కాగా ఈ సంవత్సరం ఉత్సవాలకు రూ. 360.45 కోట్ల బీమా కవరేజీని తీసుకున్నట్లు జీఎస్బీ సేవా మండల్ వైస్ ఛైర్మన్ రాఘవేంద్ర జి భట్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో వెల్లడించారు. గతేడాది రూ. 316.40 కోట్లకు బీమా తీసుకోగా ఈసారి మరింత మొత్తానికి కవరేజీ కవరేజీ తీసుకున్నారు. బీమా ప్యాకేజీలో బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు రూ. 31.97 కోట్ల కవరేజీ ఉంటుంది. మిగిలినది మంటపం, నిర్వాహకులు, భక్తుల భద్రతకు కవరేజీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. #WATCH | Maharashtra | 'Richest' Ganpati of Mumbai - by GSB Seva Mandal - installed for the festival of #GaneshChaturthi. The idol has been adorned with 69 kg of gold and 336 kg of silver this year. pic.twitter.com/hR07MGtNO6 — ANI (@ANI) September 18, 2023 -
గణపయ్యా.. కాస్త దిగి రావయ్యా!
హైదరాబాద్: పది అడుగుల ఎత్తు వినాయక విగ్రహం ధర రూ.45 వేలు. ఇంకొంచెం ఆకర్షణీయంగా ఉంటే రూ.50 వేలు. 18 అడుగుల గణనాథుడు రూ.2 లక్షల పైనే ఉన్నాడు. ఇక 25 ఫీట్ల మూర్తిని మండపంలో ఏర్పాటు చేయాలంటే రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సిందే. ఈసారి గణనాథుడి విగ్రహాల ధరలకు రెక్కలొచ్చాయి. నగరంలోని అనేక చోట్ల విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి 20 శాతం వరకు పెరిగినట్లు అంచనా. వినాయక విగ్రహాల తయారీ కోసం వినియోగించే వివిధ రకాల ముడిసరుకు ధరలు, రవాణా చార్జీలు పెరగడంతోనే విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని ధూల్‌పేట్, నాగోల్, మియాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు చెబుతున్నారు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులకు సైతం డిమాండ్ పెరిగిందని, ఎక్కువ మొత్తంలో చెల్లిస్తే తప్ప కళాకారులు లభించడం లేదని ధూల్‌పేట్‌కు చెందిన ఒక వ్యాపారి విస్మయం వ్యక్తం చేశారు.ఈ మేరకు గతేడాది కంటే ఈసారి కొంతమేరకు పెరిగాయన్నారు. ఆకట్టుకునే ఆకృతుల్లో.. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం అందమైన వినాయక విగ్రహాలు ముస్తాబయ్యాయి. కొన్ని చోట్ల అమ్మకాలు కూడా ఆరంభమయ్యాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన మండపాల నిర్వాహకులు హైదరాబాద్ నుంచే విగ్రహాలను తరలిస్తారు. ఈ మేరకు ధూల్‌పేట్, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, కార్ఖానా, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం విభిన్న ఆకృతుల్లో బొజ్జ గణపయ్య మూర్తులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ధరలు ఎందుకు పెరిగాయంటే.. ► ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కొబ్బరి పీచు, రంగులు తదితర వస్తువుల ధరలు పెరగడంతో విగ్రహాల ధరలకు రెక్కలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి ముడిసరుకును హైదరాబాద్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు కూడా భారీగా పెరిగాయి. దీంతో విగ్రహాల ధరలను పెంచవలసి వచ్చిందని హస్తకళాకారులు చెబుతున్నారు. సుమారు 500కు పైగా చిన్న, పెద్ద కార్ఖానాలు ఉన్న ధూల్‌పేట్‌లో రూ.500 ఖరీదైన విగ్రహాలు మొదలుకొని రూ.3.5 లక్షల ఖరీదు చేసే విగ్రహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల సైజులను బట్టి 15 శాతం నుంచి 20 శాతం వరకు ధరలు పెరిగాయి. ► గతేడాది రూ.40 వేలకు లభించిన విగ్రహాలు ఇప్పుడు రూ.45 వేలకు పెరిగాయి. 15 ఫీట్ల విగ్రహం రూ.85 వేల నుంచి 1.10 లక్షల వరకు పెరిగింది. ఎక్కువమంది కొనుగోలు చేసే 18 ఫీట్ల విగ్రహాల ధరలు కూడా రూ.2 లక్షలకు చేరాయి. ► చిన్న విగ్రహాలకు సైతం భారీ డిమాండ్ ఉంది. ధూల్‌పేట్‌లోని కళాకారులు ఇళ్లల్లో చిన్న విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటికి రూ.500 నుంచి రూ.2500 వరకు ధరలు ఉన్నాయి. ఈ ధరలకు అనుగుణంగానే వివిధ సైజుల్లో ఉన్న విగ్రహాలను అమ్మకానికి సిద్ధం చేశారు. కార్ఖానా ఖర్చులు పెరిగాయి: గణేష్ నగరంలో విగ్రహాల తయారీ కోసం కోల్‌కతా, పుణె, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి కూడా కళాకారులను తీసుకొస్తాం. వాళ్లకు చెల్లించే జీతభత్యాలు ఈసారి బాగా పెరిగాయి. విగ్రహాల తయారీ పూర్తయ్యే వరకు భోజనం, వసతి కూడా కల్పించాలి. ముడిసరుకు ధరలు పెరగడం వల్ల కార్ఖానా నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి. పోటీ కూడా ఎక్కువే : రాకేష్ ఒకప్పుడు ధూల్‌పేట్ విగ్రహాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అన్ని చోట్లా విగ్రహాలను తయారు చేసి అమ్ముతున్నారు. షోలాపూర్ నుంచి తెచ్చి ఇక్కడ అమ్మకానికి పెట్టారు. రూ.లక్షలు ఖర్చు చేసి విగ్రహాలను తయారు చేస్తే ఈ పోటీ వల్ల ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. అలాగని నష్టానికి అమ్ముకోలేం కదా. -
‘ధిక్కరణ’ వేయండి.. చర్యలు తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: గతేడాది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీఓపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారన్న ఆధారాలుంటే...ధిక్కరణ పిటిషన్ వేయాలని న్యాయవాది వేణుమాధవ్‌ను హైకోర్టు ఆదేశించింది. సరైన ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్నచిన్న కొలనుల్లో మాత్రమే పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలన్న మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. పీఓపీతో తయారు చేసే విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలను కొట్టివేయాలని కోరుతూ ధూళ్‌పేటకు చెందిన తెలంగాణ గణేశ్‌మూర్తి కళాకా రుల సంక్షేమ సంఘంతో పాటు మరికొందరు హైకోర్టు లో 2022లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ.. పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయలేదని, తాత్కాలిక కొలనుల్లో చేశామని తెలిపారు. ఈ క్రమంలో న్యాయవాది వేణుమాధవ్ వాదిస్తూ.. కోర్టు ఆదేశాలున్నా పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, విచారణను వాయిదా వేసింది. -
16వ శతాబ్దం నాటి వినాయక విగ్రహం గుర్తింపు
సాక్షి,మైదుకూరు: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో 16వ శతాబ్దం నాటి వినాయక విగ్రహాన్ని గుర్తించినట్టు ఔత్సాహిక పరిశోధకుడు బొమ్మిశెట్టి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి పశువుల దొడ్డిలో ఈ విగ్రహాన్ని కనుగొన్నట్టు పేర్కొన్నారు. విగ్రహం ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిలో డమరుకం ఉన్నట్టు తెలిపారు. మైసూరు పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి విగ్రహం గురించి తెలియజేయగా, అది 16వ శతాబ్దం నాటిదని ఆయన చెప్పినట్టు రమేష్ తెలిపారు. -
ఆవు పేడతో వినాయక విగ్రహాలు
బోడుప్పల్: జీవ జాతులకు హాని కలుగకుండా... పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఆవు పేడతో గణపతి విగ్రహాలను తయారు చేస్తూ ఆయా విగ్రహాలను లాభాపేక్ష లేకుండా విక్రయిస్తోంది బోడుప్పల్ బాలాజీహిల్స్ కాలనీలోని శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్. ►ఆవు పేడతో 300 రకాల ఉత్పత్తులు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సంస్థ నిర్వాహకుడు కుప్ప శ్రీనివాస్ తెలిపారు. వినాయక విగ్రహాలు, గోడకు వేలాడ దీసే బొమ్మలు, ఇంటి ముఖ ద్వార తోరణాలు, ఆది యోగి విగ్రహాలు, శివలింగాలు, జ్ఞాపికలు, నర్సరీ కుండీలు, విత్తన గోలీలు, దీపావళికి లక్ష్మీదేవి విగ్రహాలు, ప్రమిదలు, జప మాలలు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు పెన్ను స్టాండ్లు, సెల్‌ఫోన్ స్టాండులు, విభూది, దంత మంజరి (పళ్లపొడి), తయారు చేస్తున్నారు. అలాగే గో మూత్రంతో పినాయిల్, వేప, హ్యాండ్‌వాచ్‌ల లాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. భవిష్యత్‌లో ఆవు పేడతో చెప్పులు తయారీ, ఆసనాల కోసం వేసుకునే పీటలు, దూబ్‌బత్తి, దోమల కోసం మచ్చల బత్తి వంటి ఉత్పతులు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ►గోశాలకు విరాళాలు అందజేసే వారికి పేడతో తయారు చేస్తున్న ఉత్పత్తులను ఉచితంగా అందజేస్తున్నామని సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్ తెలిపారు. భావితరాలకు గో జాతిని వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. -
సాక్షి టీవీ లైవ్ చూస్తు చిన్నారుల మట్టి వినాయకుల తయారీ
-
‘సాక్షి’ చూస్తూ ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ గణేశా తయారీ..
వినాయక చవితి.. ఈ పేరు వినగానే ఎక్కడలేని ఉత్సాహం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఊరు వాడా మొత్తం అసలైన పండగ వాతావరణం నెలకొంటుంది. గణేష్ నవరాత్రి వేడుకలు ప్రారంభం కాకముందే ప్రతి వీధిలో మండపాల ఏర్పాటు, విగ్రహ కొనుగోలు వంటి పనులతో బిజీగా ఉంటుంది. అయితే ఈ ఏడు వినాయక చవితికి ఈ హంగామా అంతా కనిపించేలా లేదు. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేనట్లు తెలుస్తోంది. గణపతి బప్ప మోరియా అంటూ మారుమోగే నినాదాలు ఈసారి వినిపించేలా లేవు. ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేనట్లు స్పష్టం చేసింది. ఇళ్లలోనే కరోనా నియమాలు పాటిస్తూ ఎవరిళ్లలో వారు వినాయక చవితి జరుపుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (కరోనా మార్గదర్శకాలకు లోబడే చవితి వేడుకలు) మచిలిపట్నం : ఈ క్రమంలో ‘సాక్షి’ టీవీలో మట్టి వినాయకుడిని ఎలా తయారు చేయాలో వివరించడాన్ని చూస్తూ మచిలిపట్నంలోని చిన్నారులు ఇంట్లోనే మట్టి గణపతులను తయారు చేస్తున్నారు. సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడి ప్రతిమను చిన్నారులు తమ చిట్టి చిట్టి చేతులతో తయారు చేసేందుకు పూనుకున్నారు. అయితే ఈ ఏడాది పర్యావరణహిత గణేశ విగ్రహాల ప్రాధాన్యం పెరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతీక అయిన వినాయక చవితి పండగను జరుపుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఏకో ప్రెండ్లీ గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిద్దాం. (‘ఎకో’దంతుడికి జై!) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పరిసరాలు మరింత కాల్యుష్యం అయ్యే అవకాశం ఉన్నందున మట్టి గణపతికి భక్తులు జై అంటున్నారు. దీంతో ఎకో ఫ్రెండ్లీ విత్తన వినాయకుడిని రూపొందించి పూజించాలనే ఈ ఏడు ప్రచారం కొనసాగుతోంది. పర్యావరణ స్నేహపూర్వక గణేష్ విగ్రహాలు ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నాయి. ఇంతక ముందు కేవలం బంకమట్టి, సహజ రంగులతో తయారు చేసేవి. కానీ ఇప్పుడు మట్టి లోపల వివిధ చెట్ల గింజలతో రానున్నాయి. రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఆకు పచ్చ కవచాన్ని పెంచే విధంగా గణేష్ పండుగను జరుపుకునేందుకు ప్రజలు సంకల్పించారు. (‘ఈ ఏడాది లడ్డూ వేలం లేదు’) -
ధనలక్ష్మి అలంకారంలో దత్త గణపతి
-
కోటిన్నర కరెన్సీతో ‘ధన గణపతి’
మంగళగిరి టౌన్/మైలవరం: వినాయక నవరాత్రులను పురస్కరించుకొని గుంటూరు జిల్లా మంగళగిరి పూలమార్కెట్ సెంటర్లో సంకా బాలాజీగుప్తా బ్రదర్స్, వర్తక వ్యాపారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడికి మంగళవారం రూ.కోటిన్నర కరెన్సీ నోట్లతో ధనగణపతిగా అలంకరించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ధనగణపతిని వీక్షించడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. కాగా, కృష్ణా జిల్లా, మైలవరం 3వ వార్డులో శ్రీబాల గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూ.లక్షతో కరెన్సీ గణపతిగా అలంకరించారు. -
మట్టి గణపతే.. మహా గణపతి
మన్సూరాబాద్: మట్టి వినాయక విగ్రహాలను వాడుదాం... పర్యావరణాన్ని కాపాడుదామని ఈస్ట్‌జోన్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సాక్షి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ చౌరస్తాలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఆయనతో పాటు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ముకుంద్‌రెడ్డి, సర్కిల్ ఏఎంహెచ్ఓ ఉమాగౌరి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజల్లో చైతన్యం పెరిగి మట్టి విగ్రహాల వాడకం పెరిగిందని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. సాక్షి చేపట్టిన ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ భేష్ అన్నారు. కార్యక్రమంలో సాక్షి జోనల్ ఇన్చార్జి దశరథ, రిపోర్టర్లు శ్రీనివాస్, ప్రకాష్, నాయకులు చుక్కుమెట్టు శ్రీకాంత్‌రెడ్డి, పోచబోయిన జగదీష్‌యాదవ్, కన్నా మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం
హైదరాబాద్ : హైదరాబాద్‌లో నిన్న వేకువజామున మొదలైన గణనాధుల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ సుమారు 30 వేల విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యాయి. అర్థరాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల కాస్త ఆలస్యంగా, నెమ్మదిగా విగ్రహాలు ముందుకు కదులుతున్నాయి. ఇక ఖైరతాబాద్ మహా గణపతి మరికాసేపట్లో నిమజ్జనం అయ్యేందుకు సిద్ధమయ్యాడు. ట్యాంక్‌బండ్ వద్ద తుదిపూజలు అందుకున్నాడు. అయితే కార్యాలయం వేళలు కావడంతో ట్రాఫిక్‌కు పలుచోట్ల తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రద్దీ ప్రాంతాల్లో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి.