మట్టి గణపతే.. మహా గణపతి | use on clay idols of Ganesh | Sakshi
Sakshi News home page

మట్టి గణపతే.. మహా గణపతి

Published Fri, Aug 25 2017 12:29 AM | Last Updated on Sun, Sep 17 2017 5:55 PM

మట్టి గణపతే.. మహా గణపతి

మట్టి గణపతే.. మహా గణపతి

మన్సూరాబాద్‌: మట్టి వినాయక విగ్రహాలను వాడుదాం... పర్యావరణాన్ని కాపాడుదామని ఈస్ట్‌జోన్‌ కమిషనర్‌ గంగాధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సాక్షి ఆధ్వర్యంలో మన్సూరాబాద్‌ చౌరస్తాలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఆయనతో పాటు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి, హయత్‌నగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ ముకుంద్‌రెడ్డి, సర్కిల్‌ ఏఎంహెచ్‌ఓ ఉమాగౌరి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జోనల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజల్లో చైతన్యం పెరిగి మట్టి విగ్రహాల  వాడకం పెరిగిందని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. సాక్షి చేపట్టిన ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ భేష్‌ అన్నారు. కార్యక్రమంలో సాక్షి జోనల్‌ ఇన్‌చార్జి దశరథ, రిపోర్టర్లు శ్రీనివాస్, ప్రకాష్, నాయకులు చుక్కుమెట్టు శ్రీకాంత్‌రెడ్డి, పోచబోయిన జగదీష్‌యాదవ్, కన్నా మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement