Live Updates
►పులివెందులలో నూతనంగా రూ. 26.12కోట్లతో నిర్మించిన వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవం చేసిన సీఎం జగన్
►రాష్ట్రంలో రెండవ హాకీ టర్ఫ్ కోర్టును ప్రారంభించిన సీఎం జగన్
►హాకీ టర్ఫ్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు,ఆర్చరీ బ్లాక్, హ్యాండ్ బాల్, ఖో ఖో, ఇండోర్ బ్యాట్ మింటన్ కోర్టు ప్రారంభించిన సీఎం జగన్
►ఇడుపులపాయకు తిరుగు ప్రయాణమైన సీఎం జగన్
►పులివెందులలో ఇస్టా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
►కార్యక్రమానికి హాజరైన మంత్రి అంజాద్ భాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు
►పులివెందులలో వైఎస్సార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన సీఎం జగన్
► గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం పులివెందులలో పలు ప్రారంభోత్సోవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల మున్సిపల్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్లతో సమావేశమయ్యారు.
►ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం గండికోట: సీఎం జగన్
►ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం
►స్టార్ గ్రూపుల రాకతో గండికోటను టూరిజం మ్యాప్‌లోకి తీసుకెళ్తాం
►గండికోట అంతర్జాతీయ మ్యాప్‌లోకి వెళ్తుంది
►ఒబెరాయ్ సెవెన్ స్టార్స్ హోటల్స్ ద్వారా ఉపాధి అవకాశాలు
►గండికోటకు మరో స్టార్ గ్రూప్‌ను కూడా తీసుకొస్తాం
►కొప్పర్తి డిక్సన్ కంపెనీ ద్వారా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు
►కొప్పర్తిలో పలు కంపెనీలతో రేపు(సోమవారం) ఎంవోయూలు చేసుకుంటాం
► గండికోట చారిత్రాత్మక ప్రదేశం: సీఎస్ జవహర్‌రెడ్డి
► పర్యాటక రంగంలో కొత్త అధ్యాయానికి సీఎం శ్రీకారం చుట్టారు
► పోలవరం ప్రాంతాల్లో కూడా పర్యాటక అభివృద్ధి
► గండికోట దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా నిలుస్తుంది
► రాష్ట్రంలో అభివృద్ధిని సీఎం జగన్ పరుగులు పెట్టిస్తున్నారు: మంత్రి రోజా
► అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేస్తున్నారు
►ఏపీలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
►రికార్డు సృష్లించాలన్నా.. బద్ధలుగొట్టాలన్నా సీఎం జగన్‌కే సాధ్యం
► ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ జిల్లా గండికోటలో సీఎం భూమి పూజ చేశారు. విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్‌కు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపనం చేశారు. ఈ కార్యక్రమంలో ఒబెరాయ్ హోటల్స్ ఎండీ విక్రమ్‌సింగ్ ఒబెరాయ్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు.
► మూడు చోట్ల ఒబెరాయ్ గ్రూప్ సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మించనుంది. గండికోట, తిరుపతి, విశాఖపట్నంలో సెవెన్ స్టార్ట్స్ హోటల్స్ నిర్మాణం జరగనున్నాయి.
► గండికోట చేరుకున్న సీఎం జగన్.. ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శుంకుస్థాపన చేశారు. అనంతరం వ్యూపాయింట్‌ను పరిశీలించారు.
►ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ గండికోట బయల్దేరారు.
సాక్షి, కడప: వైఎస్సార్ కడప జిల్లాలో నేడు(ఆదివారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 9.20 నిమిషాలకు గండికోటకు చేరుకోనున్నారు. అక్కడ ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలించనున్నారు. తర్వాత పులివెందులలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు.
అనంతరం పులివెందుల రాణితోపు చేరుకొని నగరవనాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి గరండాల రివర్ ఫ్రంట్ చేరుకొని.. గరండాల కెనాల్ డెవలప్‌మెంట్ ఫేజ్-1 పనులను సీఎం జగన్ ప్రారంభిస్తారు. తర్వాత పులివెందులలో నూతనంగా నిర్మించిన(వైఎస్‌ఆర్ ఐఎస్‌టీఏ) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు
అనంతరం పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేసిన న్యూటెక్ బయో సైన్సెస్‌ను ప్రారంభిస్తారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకుపులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు.
చదవండి: ఏపీయే స్ఫూర్తి.. దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలు
Comments
Please login to add a commentAdd a comment