వైఎస్సార్‌ కడప జిల్లాలో ముగిసిన సీఎం జగన్‌ పర్యటన | CM YS Jagan YSR District Tour Day 3 Updates | Sakshi
Sakshi News home page

CM YS Jagan:వైఎస్సార్‌ కడప జిల్లాలో ముగిసిన సీఎం జగన్‌ పర్యటన

Published Mon, Dec 25 2023 7:30 AM | Last Updated on Mon, Dec 25 2023 3:40 PM

CM YS Jagan YSR District Tour Day 3 Updates - Sakshi

Live Updates..

3:28PM. సోమవారం, Dec 25, 2023

వైఎస్సార్‌ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ముగిసింది. కడప ఎయిర్‌పోర్టు నుంచి గన్నవరానికి సీఎం బయల్దేరారు.

12:40PM, సోమవారం, Dec 25, 2023

► మైదుకూరు చేరుకున్న సీఎం జగన్‌

►  వైఎ‍స్సార్‌ జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ దస్తగిరి నివాసానికి చేరుకున్న సీఎం జగన్‌

►  ఆయన కుమారుడు, కుమార్తెల వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం జగన్‌

 ► నూతన దంపతులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

► పులివెందుల పర్యటన ముగించుకుని మైదుకూరుకు బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 

► కాసేపట్లో వక్ఫ్ బోర్డు చైర్మన్ దస్తగిరి కుమారుడు, కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్‌

► 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ను సీఎం జగన్‌, వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. వారితోపాటు ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటి సీఎం అంజాద్ బాషా,  మంత్రి అదిమూలపు సురేష్ ఉ‍న్నారు.

►  ప్రార్థనల అనంతరం సీఎం జగన్‌, వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేశారు.

► సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్‌ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

► సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌. 

పులివెందులలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌, కుటుంబ సభ్యులు. 

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈరోజు క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా సీఎం జగన్‌ పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. 

కుటుంబ సభ్యులతో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌ (ఫొటోలు)

 మూడో రోజు పర్యటన ఇలా..

  • ‘మూడో రోజు జిల్లా పర్యటనలోభాగంగా.. సోమవారం ఉదయం ఇడుపులపాయ ఎస్టేట్ నుండి హెలికాప్టర్ ద్వారా బాకరపురం హెలిప్యాడ్, అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా పులివెందుల టౌన్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
  • ఉదయం 9.30 గంటలకు సిఎస్ఐ చర్చి ప్రాంగణం చేరుకుని.. అక్కడికి హాజరైన వారిని ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇక్కడికి విచ్చేసిన బందువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు
  • ఈ సందర్బంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలను, ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
  • ప్రతి ఏడాది ఈ క్రిస్మస్ పర్వదినం రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బందుగణం, స్నేహితులతో.. కలిసి పండుగ వేడుకలో పాల్గొనడం తన మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
  • రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొంత ఊరిలో.. అందరితో కలిసి క్రిస్మస్ ప్రార్థనలు చేయడం తనకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తినిచ్చిందని, అలాగే.. మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలేలు తనకు ఎల్లవేళలా అందాలని కోరుకుంటున్నానని ప్రార్థించిన ముఖ్యమంత్రి.
  • రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని.. ఎప్పటికీ మీ హృదయాల్లో ప్రియమైన నాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొందగలనని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
  • కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసిన ముఖ్యమంత్రి.. 2024 చర్చి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
  • క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతమ్మ లతో పాటు.. వైఎస్ ప్రకాష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి తదితర బంధువర్గాలు, ఆత్మీయులు, మిత్రులు, పురప్రజలు
  • వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే డా.డి. సుధా, తదితరులు.
  • కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు జిల్లాస్థాయి అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు తదితరులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement