
సీసీ పుటేజ్‌లో రికార్డయిన దాడి దృశ్యం
సాక్షి, వైఎస్సార్ కడప : మండల పరిధిలోని అంకాలమ్మగూడూరులో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఇక్కడి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఇద్దరిపై దాడి చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సింహాద్రిపురం మండలం దిద్దెకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రామచంద్రారెడ్డి కుమార్తె వివాహానికి మూడు వాహనాలలో శనివారం రాత్రి బయలుదేరారు. అంకాలమ్మ గూడూరులో ఉన్న పెట్రోల్ బంకులో రాత్రి 11 గంటల సమయంలో వాహనాలకు డీజిల్ నింపాలని అక్కడి సిబ్బందిని అడిగారు. వారు డీజిల్ పట్టేలోపే ఆలస్యమైందని వారితో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. పెట్రోల్ బంకు యజమాని ఫిర్యాదు మేరకు సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment