simhadripuram
-
జగనన్న హామీలన్నీ నెరవేర్చారు.. : ఎంపీ అవినాష్‌రెడ్డి
వైఎస్సార్ కడప: రాష్ట్ర ప్రజలకు 2019 ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సింహాద్రిపురంలో మండలానికి సంబంధించిన వైఎస్సార్ ఆసరా సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలానికి సంబంధించి 524 డ్వాక్రా సంఘాలకు చెందిన 5078మంది డ్వాక్రా మహిళలకు రూ.5,24,92,136ల మెగా చెక్కును ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలు అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు సంబంధించిన ప్రార్థన చాలా మోటివేటివ్గా ఉంటుందన్నారు. ఈ మధ్యకాలంలో అనేక సమావేశాల్లో డ్వాక్రా మహిళలు ఆ ప్రార్థనతోనే మొదలుపెడతారన్నారు. జీవితంలో వెలుగులు నింపాలని.. చీకటిని పారదోలాలని.. స్వర్గం అనేది ఎక్కడ ఉన్నా నేలపైకి తీసుకొద్దాం.. అంటూ ఎంతో ప్రేరణగా ప్రార్థన ఉంటుందన్నారు. ఒక్కసారి ఆలోచిస్తే 2019లో జగనన్న ఎన్నికలకు వచ్చినప్పుడు 2019 ఏప్రిల్ నాటికి డ్వాక్రా రుణం రూ.26వేల కోట్లు ఉండేదన్నారు. ఆ రుణ మొత్తాన్ని నాలుగు విడతల్లో తీరుస్తానని.. ఆ డబ్బులు మీకు తిరిగి ఇస్తానని జగనన్న ఆనాడు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన విధంగా ఇప్పటికే మూడు విడతలుగా ఒక్కో విడత రూ.6,500కోట్లు చెల్లించారన్నారు. ఇప్పుడు నాలుగో విడతగా రూ.6,500కోట్లు చెల్లిస్తున్నారన్నారు. నిజంగా ఇది చాలా గర్వకారణమైన విషయమని అన్నారు. ఒక్క వైఎస్సార్ ఆసరానే కాదు.. వైఎస్సార్ చేయూత కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రూ.3వేల పింఛన్ కావచ్చు చెప్పుకుంటూ పోతే ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని జగనన్న నెరవేర్చారని తెలిపారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేలు కలిగేలా చేయడమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశమన్నారు. కరోనా విపత్తు సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ సంతకం, మరోవైపు చంద్రబాబు సంతకాలతో ఇంటింటికి కరపత్రాలు పంచారన్నారు. అందులో రైతుల రుణాలు, బ్యాంకు రుణాలు మాఫీ చేస్తాం, బ్యాంకులో బంగారు ఇంటికి రావాలంటే బాబు రావాలి, నిరుద్యోగ భృతి రూ.3వేలు, ఇలా అనేక హామీలతో కరపత్రాలు పంపిణీ చేశారన్నారు. అందులో చంద్రబాబు ఏ ఒక్క హామీనైనా అమలుపరిచారా అని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అలాంటి చంద్రబాబు మరలా ఇప్పుడు మరోసారి ష్యూరిటీ, గ్యారంటీ, వారంటీ అంటూ మరోసారి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారన్నారు. దయచేసి ప్రజలందరూ చంద్రబాబు చెప్పే మాయ మాటలు నమ్మవద్దని హితవు పలికారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డ్వాక్రా మహిళలతో కలిసి సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు తమ జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటామన్నారు. అంతకముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ ఝాన్సీరాణి, ఎంపీపీ అరుణ, మండల ఉపాధ్యక్షురాలు సుభాషిణి, సింగిల్ విండో ప్రెసిడెంట్ శేఖరరెడ్డి, ఎంపీటీసీ జాఫర్, సర్పంచ్ రామ్మోహన్, వైఎస్సార్సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, అరవిందనాథరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓ సాల్మన్ రాజు, డీఆర్డీఏ పీడీ ఆనంద నాయక్, కో.ఆర్డినేటర్ నీలకంఠారెడ్డి, ఏపీఎంలు మంజునాథ్, గురురాజ్, ఆంజనేయులు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమాన్ని అందించారు.డీవీటీ ద్వారా రూ.203కోట్లు మండలానికి అందించగా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.64కోట్లు సింహాద్రిపురం మండలానికి అందించారు. చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చేతులేత్తేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్ నాలు విడత వైఎస్సార్ ఆసరా డబ్బులు విడుదల చేశారు. – శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, సింహాద్రిపురం మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళాసంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతి పల్లెలో ఏర్పాటు చేసి న పాల కేంద్రాల ద్వారా మహిళలు నెలకు రూ. 4వేలు పొందుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం యా నిమేటర్లకు రూ.8వేలకు జీతం పెంచారు. ప్రభు త్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి. – హేమావతి, వైఎస్సార్ ఆసరా లబ్ధిదారురాలు, సింహాద్రిపురం మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు.. మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కరోనా విపత్తు సమయంలో కూడా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. ప్రజలకు అండగా ఉంటూ ఆదుకున్నారు. – ఝాన్సీరాణి, జెడ్పీటీసీ, సింహాద్రిపురం దోచుకోవడం.. దాచుకోవడం టీడీపీ నైజం! టీడీపీ హయాంలో దోచుకోవడం.. దాచుకోవడం తప్ప.. ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదు.సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కరోనా విపత్తు సమయంలో కూడా సీఎం వైఎస్ జగన్ పలు సంక్షేమ పథకాలను అమలు చేశారు. – రామ్మోహన్‌రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్, సింహాద్రిపురం ఇవి చదవండి: ఒక్క ఓటుతో ఏడుగురం పనిచేస్తాం! : మంత్రి వేణు -
CM YS Jagan Photos: సింహాద్రిపురంలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం (ఫోటోలు)
-
పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనం: సీఎం జగన్
సింహాద్రిపురం(వైఎస్సార్‌జిల్లా): పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం సింహాద్రిపురంలో నూతనంగా నిర్మించిన రోడ్డు వెడల్పు సుందరీకరణ పనులు, వైఎస్సార్ పార్క్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పాడా నిధులతో పులివెందుల నియోజకవర్గం, సింహాద్రిపురం మండల కేంద్రంలో రూ 11.6 కోట్లతో నూతనంగా సుందరీకరరించిన రోడ్లు, జంక్షన్లను సీఎం జగన్ ప్రారంభించారు. ఇందులో ఫోర్ లైన్ సీసీ రోడ్, బీటీ రోడ్ జంక్షన్లు ఉన్నాయి. . అనంతరం రూ 5.5 కోట్ల నిధులతో 1.5 ఎకరాల్లో సుందరంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్కును ఆయన ప్రారంభించారు. ఇందులో ఎంట్రీలో ప్లాజా వాటర్ ఫౌండేషన్, చిన్నపిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ , వైఎస్సార్ విగ్రహాలను అందంగా ఏర్పాటు చేశారు. అనంతరం రూ 3.19కోట్ల పాడానిధులతో నిర్మించిన న్యూ తహశీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ ను, రూ 2 కోట్ల నిధులతో నిర్మించిన న్యూ పోలీస్ స్టేషన్ ను,రూ 3.16 నిధులతో నిర్మించిన ఎంపీడీవో ఆఫీసును ఆయన ప్రారంభించారు. సింహాద్రిపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం జగన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట జిల్లా ఇంఛార్జి, మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు, జెసి గణేష్ కుమార్, పాడ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పులివెందుల ఆర్డీవో వెంకటేశం, నాయకులు, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సింహాద్రిపురం తహశీల్దార్ డి. మహబూబ్‌బాషా, ఎంపీడీవో జి కృష్ణమూర్తి, పోలీస్ అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు ప్రార్థన మందిరంలోని క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్ అంతకుముందు ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్న సీఎం జగన్.. మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం ఘాట్‌లో జరిగే ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇడుపులపాయలో పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన
Updates 2:54PM,. Dec 24. 2023 వైఎస్సార్‌జిల్లాలో సీఎం వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన సింహాద్రిపురంలో రోడ్డు వెడల్పు, సుందరీకరణ పనులు వైఎస్సార్ పార్క్, తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం ప్రారంభోత్సవంతో సీఎం జగన్ ►ఇడుపులపాయ నుంచి సింహాద్రిపురం పర్యటనకు సీఎం జగన్ ►ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం ►సింహాద్రిపురంలో పోలీసు స్టేషన్, తాహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు సింహాద్రిపురం జంక్షన్, పార్కులను ప్రారంభించనున్న సీఎం ►అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్న సీఎం జగన్ ►పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్ సమావేశం ►సమావేశానికి హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్ అమర్నాథ్రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్థానిక నాయకులు ఇడుపులపాయలో సీఎం జగన్ ►వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్న సీఎం జగన్ ►మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్ ►అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం. ►ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రా రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య సలహాదారు రాజోలి వీరారెడ్డి, తదితరులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా నేడు సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. ఘాట్‌లో జరిగే ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని 11.30 వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సింహాద్రిపురం జూనియర్ కళాశాల సమీపాన ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.40 గంటల వరకు సింహాద్రిపురం మండల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారు. అనంతరం సింహాద్రిపురంలోని రోడ్డు వెడల్పు, సుందరీకరణ, వైఎస్సార్ పార్క్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్‌లో దిగుతారు. ఎకో పార్క్ మీటింగ్ ప్రదేశానికి చేరుకుంటారు. పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 4.45 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని, ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. -
టీడీపీ కార్యకర్తల వీరంగం.. పెట్రోల్ బంక్‌పై దాడి
సాక్షి, వైఎస్సార్ కడప : మండల పరిధిలోని అంకాలమ్మగూడూరులో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఇక్కడి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఇద్దరిపై దాడి చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సింహాద్రిపురం మండలం దిద్దెకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రామచంద్రారెడ్డి కుమార్తె వివాహానికి మూడు వాహనాలలో శనివారం రాత్రి బయలుదేరారు. అంకాలమ్మ గూడూరులో ఉన్న పెట్రోల్ బంకులో రాత్రి 11 గంటల సమయంలో వాహనాలకు డీజిల్ నింపాలని అక్కడి సిబ్బందిని అడిగారు. వారు డీజిల్ పట్టేలోపే ఆలస్యమైందని వారితో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. పెట్రోల్ బంకు యజమాని ఫిర్యాదు మేరకు సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ముఖం చాటేసిన పోలీస్ భర్త
సాక్షి, కడప : భర్త ఎస్ఐ రాఘవయ్య తనకు అన్యాయం చేశారని సింహాద్రిపురం మండలం బలపనూరుకు చెందిన రాజకుమారి ఆవేదన వక్తంచేశారు. శనివారం ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె పేర్కొన్న వివరాలివి. 2014లో ఈమెకు రాఘవయ్యతో వివాహమైంది. నాలుగు నెలలు మాత్రమే కలిసి ఉన్నారు. ఎస్ఐ ఉద్యోగం వచ్చాక అతడు ఈమెను పట్టించుకోలేదు. కుమారుడిని ప్రసవించిన 20 రోజులకు వచ్చి చూసి వెళ్లాడు. తరువాత రాలేదు. ఈమె ఫిర్యాదు మేరకు 2016 జూన్‌లో వరకట్న వేధింపు కేసు నమోదయ్యింది. కేసు విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం రాఘవయ్య అనంతపురం జిల్లా అమడగూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆ జిల్లా ఎస్పీని రాజకుమారి కలిసినా మార్పు లేదు. విజయవాడకు ఇద్దరినీ కౌన్సిలింగ్‌కు పంపినా ప్రయోజనం లేకపోయింది. విడాకులు కావాలని కోర్టులో భర్త కేసు వేశారని రాజకుమారి చెప్పింది. భర్త కావాలని..ఈ విషయంలో పోలీసు అధికారులు తనకు న్యాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమన్నారు. ఎస్ఐ రాఘవయ్య ఫోన్లో మీడియాతో మాట్లాడుతూ భార్య నుంచి ఐదేళ్లుగా దూరంగా ఉన్నానన్నారు. కోర్టులో కేసు విచారణ జరుగుతోందన్నారు. -
చంద్రబాబు చ్చిన హామీల్లో ఒక్క హామీని నెరవేర్చలేదు
-
ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్ : వైఎస్ భారతి
సాక్షి, సింహాద్రిపురం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొమ్మిదేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ.. వారి కష్టాలు తెలుసుకున్నారని ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటింకి తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటుపడతారని హామీ ఇచ్చారు. విలేకరులతో ఆమె మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన పసుపు కుంకుమ పథకం మోసమని డ్వాక్రా మహిళలు గమనించారని చెప్పారు. చంద్రబాబు పరిపాలనను ప్రజలు చూశారని, ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. -
రోడ్డు ప్రమాదాలపై నిర్లక్ష్యం
► నివారణలు చేపట్టని అధికారులు సింహాద్రిపురం: మండలంలో పలు ప్రాంతాలు రోడ్ల ప్రమాదాలకు చిరునామాగా మారుతున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవడంలేదని వాహనదారులు విమర్శిస్తున్నారు. మండల పరిధిలోని టీటీడీ కళ్యాణ మండపం, నిడివెల్ల, ఆగ్రహారం, నక్కలపల్లె గ్రామాల వద్ద అధికంగా రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. రెండు వరుసల రోడ్డు కావడం.. వాహన చోధకులు అడ్డు అదుపు లేకుండా స్పీడ్ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ప్రమాదాల్లో 8మంది మృత్యువాత పడగా.. 10మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నానివారణకు ఆర్అండ్బీ అధికారులు, పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపట్ల వాహన చోదకులు విమర్శిస్తున్నారు. వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అపరాద రుసుం విధించి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడంలేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించుకొని మండల ప్రజలు కోరుతున్నారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. : తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఆగ్రహారం వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఆర్అండ్బీ అధికారులు స్పందించాలి. ---రవీంద్రనాథరెడ్డి(స్థానికుడు), ఆగ్రహారం ప్రమాదాలు నివారిస్తాం.. : ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాల సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లో అనేక సార్లు ట్రాఫిక్ విషయాలపై అవగాహన కల్పించాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ---హనుమంతు(ఎస్ఐ), సింహాద్రిపురం -
సినిమాల్లో నటించాలనే కోరికతో..
సాక్షి, తాడిపత్రి: సినిమాల్లో నటించాలనే కోరికతో 21 ఏళ్ల కిందట ఇల్లు వదిలిన యువకుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చింది ఫేస్బుక్. ఇన్నేళ్ల తర్వాత తమ కొడుకు రావడంతో ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఆనందంతో బాణసంచా పేల్చి, బెలూన్లు ఎగరేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తమకు నిజమైన సంక్రాంతి ఇదేనని తల్లిదండ్రులు ఆనందోత్సాహాలు వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళితే... వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం చెర్లోపల్లికి చెందిన అన్నవరం రాఘవరెడ్డి, శేఖర్‌రెడ్డి, అంకిరెడ్డి అన్నదమ్ములు. వ్యాపార నిమిత్తం కొన్నేళ్ల కిందట అనంతపురం జిల్లా తాడిపత్రికి వచ్చి స్థిరపడ్డారు. శేఖర్‌రెడ్డి, వెంకటలక్ష్మి దంపతులకు అమరనాథరెడ్డి, రాజారెడ్డి, నందకుమార్‌రెడ్డి కుమారులు. వీరిలో అమరనాథరెడ్డికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా సినిమాల్లో నటించాలన్న బలమైన కోరికతో 1994 అక్టోబర్ 15న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీకోసం కొన్నేళ్లపాటు తల్లిదండ్రులు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఎప్పటికైనా తమ బిడ్డ క్షేమంగా తిరిగొస్తాడనే ఆశగా ఎదురు చూస్తున్నారు. అమరనాథరెడ్డి ఎన్నో ప్రయత్నాల అనంతరం పలు సినిమాలు, సీరియళ్లలో విలన్ పాత్రలో నటించి రాణించాడు. దరువు, కాస్కో, శంకరాభరణం, మెంటల్‌కృష్ణ, శౌర్య సినిమాలతో పాటు మొగలిరేకులు, ఆడపిల్ల, జాబిలమ్మ సహా పలు సీరియళ్లలో అతను నటించాడు. అయితే నల్లగడ్డం, పెద్ద జుట్టు, సన్నగా పొడుగ్గా తలకు టోపీ పెట్టుకోని ఉండటంతో తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. అయితే బాబాయి అంకిరెడ్డి కుమారుడు హరీశ్‌రెడ్డి ఫేస్బుక్లో ఇంటిపేరు ‘అన్నవరం’ ఉండటాన్ని చూసి అమరనాథరెడ్డిని గుర్తించాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య ఫేస్బుక్ పరిచయం పెరిగింది. ఆ తరువాత ఇద్దరూ ఫోన్లో తరచూ మాట్లాడుకున్నారు. ఆ క్రమంలో మూడు నెలల కిందట వారి మూలాలేమిటో తెలుసుకున్నారు. ఆ తరువాత అమరనాథరెడ్డి ఫోన్లో తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చివరకు సోమవారం వారిని కలుసుకున్నాడు. 21 ఏళ్ల తర్వాత కొడుకు అనుకున్నది సాధించి ఇంటికి రావడంతో తల్లిదండ్రులు ఆనందంతో గుండెలకు హత్తుకున్నారు. దేవుడే కలిపాడు ఇక మా బిడ్డ లేడనుకుని ఆశలన్నీ వదులుకున్నాం. ఇల్లు వదిలినప్పటి నుంచి ఎంత మానసిక వేదనకు గురయ్యామో చెప్పలేం. 21 ఏళ్ల తరువాత ఇంటికి రావడంతో ఆనందంగా ఉంది. దాన్ని మాటల్లో వర్ణించలేం. మమ్మల్ని దేవుడే కలిపాడు. - శేఖర్‌రెడ్డి, వెంకటలక్ష్మి (అమరనాథరెడ్డి తల్లిదండ్రులు) ఇంత ఆనందాన్ని చూడలేదు సినిమాల్లో నటించాలన్న లక్ష్యంతో చిన్నతనంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయా. అనుకున్నది సాధించా. అయితే సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిస్తే ఏమంటారోననే భయంతో సమాచారం ఇవ్వలేదు. చివరకు 21 ఏళ్ల తరువాత మా అమ్మానాన్న, కుటుంబ సభ్యులను కలుసుకోవడం అంతులేని ఆనందాన్నిచ్చింది. - అమరనాథరెడ్డి -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఫేస్బుక్
-
పెళ్లి ట్రాక్టర్ బోల్తా: పదిమందికి గాయాలు
సింహాద్రిపురం (వైఎస్సార్ జిల్లా) : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా సింహాద్రిపురం మండలం రావలకొలను గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. తొండూరు నుంచి బానుకోటకు పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ రావలకొలను వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
ట్రాన్స్ఫార్మర్ పేరుతో రూ.10 లక్షలు వసూలు చేసి..
సింహాద్రిపురం (వైఎస్సార్ జిల్లా) : టాన్స్‌ఫార్మర్ ఇప్పిస్తానని రైతుల నుంచి వసూలు చేసిన రూ.10 లక్షలతో ఓ అధికారి కనిపించకుండా పోయారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన కొందరు రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకోగా విద్యుత్ సబ్ ఇంజినీర్ శివప్రసాద్ వారి నుంచి రూ.10 లక్షల వరకు తీసుకున్నాడు. అయితే గత మూడు రోజులుగా ఆయన కనిపించకుండా పోవటంతో దాదాపు 15 మంది రైతులు గురువారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పల్లె జనంతో మమేకం
పులివెందుల, సాక్షి, కడప : పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఓపికగా ప్రజలు చెప్పే సమస్యలు ఆలకిస్తూ త్వరలో మంచి రోజులు వస్తాయంటూ వారికి ధైర్యం చెప్పారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు పట్టించుకోని తీరును విమర్శిస్తూ.. పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధికారం చేపట్టి ఏడాది దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన వైనాన్ని ఎండగట్టారు. ప్రజలు పలు గ్రామాల్లో పింఛన్లు, రుణాలు మాఫీ కానీ వైనం, ఇంటి బిల్లులు రాని పరిస్థితి, నిరుద్యోగ భృతి.. తదితర సమస్యలను ప్రతిపక్ష నేతకు విన్నవించారు. అండగా తానుంటానని, అసెంబ్లీలో సమస్యలపై గళమెత్తుతానని వారికి ధైర్యం చెప్పారు. చంద్రబాబు మెడలు వంచైనా హామీల అమలుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మూడు కుటుంబాలకు పరామర్శ సింహాద్రిపురం మండలం అగ్రహారం వద్ద మే 30వ తేదీన విద్యుత్ తీగలు తగిలిన ప్రమాదంలో చనిపోయిన కృష్ణమోహన్‌రెడ్డి, శేషారెడ్డి కుటుంబాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. తొలుత కసనూరు గ్రామంలోని మృతుడు కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణమోహన్‌రెడ్డి సతీమణి శ్రావణి.. వైఎస్ జగన్‌ను చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు. కుమారులు ఫంకజ్ సాయిరెడ్డి, బాబుల పరిస్థితి గురించి వైఎస్ జగన్ వాకబు చేశారు. చదువు పరంగా తానుంటానని, అధైర్యపడొద్దని ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం అగ్రహారం గ్రామానికి చెందిన శేషారె డ్డి (ఇతనూ విద్యుదాఘాతంతో మృతి చెందాడు) కుటుంబాన్ని పరామర్శించారు. శేషారెడ్డి సతీమణి లక్ష్మిదేవి వైఎస్ జగన్‌ను చూడగానే విలపిస్తుండగా ఓదార్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. వైఎస్ఆర్సీపీ తరఫున పూర్తి స్థాయిలో ఆదుకుంటామని.. ధైర్యంగా ముందుకుపోవాలని ఆమెకు సూచించారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు బొగ్గుడుపల్లె ప్రభాకర్‌రెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీకి ప్రభాకర్‌రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్‌ను చూడగానే ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు విలపిస్తుండటంతో దగ్గరకు తీసుకొని ఓదార్చారు. అంకాలమ్మ గూడూరులోని మాజీ సర్పంచ్ శివనారాయణరెడ్డి (మిద్దె కూలి మృతి చెందాడు) కుటుంబ సభ్యులను పరామర్శించారు. శివనారాయణరెడ్డి సతీమణి, అంకాలమ్మ గూడూరు సర్పంచ్ పార్వతమ్మను ఓదార్చి ధైర్యం చెప్పారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం సింహాద్రిపురం మండలం అగ్రహారం సమీపంలో 33/11 కె.వి విద్యుత్ లైన్ నేలకు సమీపంలో ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతోనే రెండు కుటుంబాలు ఇబ్బందులకు గురయ్యాయని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాలి, వానకు విద్యుత్ స్తంభం ఒరిగిపోయి నేల స్థాయికి విద్యుత్ తీగలు చేరినా.. ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోకపోవడమే ప్రమాదానికి కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 24 గంటలు గడిచినా కూడా విద్యుత్ లైన్లను సరిచేయక పోవడంతోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రభుత్వం ఆ రెండు కుటంబాలను ఆదుకున్న పాపాన పోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. రెండు వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన జగన్ వేంపల్లెలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం పక్కన ఉన్న వాటర్ ప్లాంటుతోపాటు సింహాద్రిపురం మండలం చవ్వారిపల్లె గ్రామంలో బుధవారం సాయంత్రం వాటర్ ప్లాంట్లను వైఎస్ జగన్ ప్రారంభించారు. పులివెందులలోని దినేష్ మెడికల్ సెంటర్లో పనిచేస్తున్న ప్రకాష్‌రెడ్డి కుమారుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి, సువర్ణల వివాహ మహోత్సవానికి అప్పట్లో హాజరు కాలేకపోయిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బుధవారం మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్లి ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఇటీవలే వివాహమైన మరో జంట.. వైఎస్ఆర్సీపీ నాయకుడు రసూల్ సాహేబ్ కుమార్తె రేష్మిల, అల్లుడు రియాజ్‌లను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రసూల్ బంధువులతోపాటు, కుటుంబ సభ్యులను వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. సింహాద్రిపురం మండలం చవ్వారిపల్లె గ్రామంలో మాజీ సర్పంచ్ సుధాకర్‌రెడ్డి కుమార్తె శిరీష, అల్లుడు ఓబుళరెడ్డిల వివాహానికి హాజరుకాలేకపోయిన ప్రతిపక్షనేత బుధవారం వారి ఇంటికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. పులివెందులకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు మహమ్మద్ గౌస్‌కు ఇటీవలే బైపాస్ సర్జరీ జరిగిన నేపథ్యంలో జెండామాను వీధిలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. రక్తదానం శిబిరం ప్రారంభించిన వైఎస్ జగన్ వై.కొత్తపల్లె గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు భాస్కర్‌రెడ్డి.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్ చేశారు. అనంతరం అక్కడే ఉన్న వృద్ధులతో చాలాసేపు మాట్లాడారు. చవ్వారిపల్లెలో వైఎస్ఆర్ సీపీ నాయకులు ద్వారకనాథరెడ్డి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేస్తున్న వారిని అభినందించారు. వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు నేతలు కలిశారు. ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్ది, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అంజాద్ బాషా, మేయర్ సురేష్‌బాబు, జెడ్పీ చెర్మైన్ గూడూరు రవి తదితరులు ఆయన్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఇతర జిల్లాలకు చెందిన పలువురు నాయకులు సైతం జగన్మోహన్రెడ్డిని కలిశారు. -
సింహాద్రిపురం మూవీ స్టిల్స్
-
అంజలి నటనే హైలైట్
అంజలి కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘తమ్మివెటైతై సుందరం’. ‘సింహాద్రిపురం’ పేరుతో ఈ చిత్రాన్ని శ్రీ పూర్ణి క్రియేషన్స్ పతాకంపై బళ్లారి సాగర్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. వడివుడియాన్ దర్శకుడు. విద్యాసాగర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదల య్యాయి. అంజలి నటనే హైలైట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత డి.నారాయణ తెలిపారు. -
డబ్బు విషయమై దాడి
సింహాద్రిపురం : డబ్బు విషయం ఓ వ్యక్తిపై దాడికి దారితీసింది. సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లెకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త షేక్ పెద్ద బాదుల్లా(58)పై శుక్రవారం టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. బాధితుడి కుమారుడు సర్దార్ కథనం మేరకు .. శుక్రవారం ఉదయం చీనీ తోటకు నీటి తడులు అందించేందుకు తండ్రి బాదుల్లాతో కలిసి సర్దార్ పొలం వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గీయులు ఓబులేసు, గోపాల్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, చింతలప్ప, రాములు తదితరులు మచ్చుకత్తి, కర్రలతో పెద్ద బాదుల్లాపై దాడి చేశారు. బాదుల్లాకు రెండు చేతులకు తీవ్రగాయాలయ్యాయి. డబ్బు విషయమై ఆరు నెలల నుంచి బాదుల్లాకు, టీడీపీ కార్యకర్తలకు గొడవ జరుగుతోంది. డబ్బు ఇవ్వాలని టీడీపీ వర్గీయులు బాదుల్లాను వేధిస్తుండేవారు. అలాగే స్థానిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశారన్న కక్షతో పొలం వద్దకు వెళ్లిన బాదుల్లాపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలైన అతనిని పులివెందుల ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరి స్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించారు. టీడీపీ వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేశ్వరరెడ్డి తెలిపారు.