పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనం: సీఎం జగన్‌ | CM YS Jagan In YSR District:: Many development programs Simhadripuram | Sakshi
Sakshi News home page

పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనం: సీఎం జగన్‌

Published Sun, Dec 24 2023 5:51 PM | Last Updated on Sun, Dec 24 2023 6:53 PM

CM YS Jagan In YSR District:: Many development programs Simhadripuram - Sakshi

సింహాద్రిపురం(వైఎస్సార్‌జిల్లా): పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం సింహాద్రిపురంలో  నూతనంగా నిర్మించిన రోడ్డు వెడల్పు సుందరీకరణ పనులు, వైఎస్సార్ పార్క్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.


పాడా నిధులతో పులివెందుల నియోజకవర్గం,  సింహాద్రిపురం మండల కేంద్రంలో  రూ 11.6 కోట్లతో నూతనంగా సుందరీకరరించిన రోడ్లు, జంక్షన్‌లను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఇందులో ఫోర్ లైన్ సీసీ రోడ్‌, బీటీ రోడ్‌ జంక్షన్‌లు ఉన్నాయి. . అనంతరం  రూ 5.5 కోట్ల నిధులతో 1.5 ఎకరాల్లో సుందరంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్కును ఆయన ప్రారంభించారు. 

ఇందులో ఎంట్రీలో ప్లాజా వాటర్ ఫౌండేషన్, చిన్నపిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ , వైఎస్సార్‌ విగ్రహాలను అందంగా ఏర్పాటు చేశారు. అనంతరం రూ 3.19కోట్ల పాడానిధులతో నిర్మించిన న్యూ తహశీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ ను,  రూ 2 కోట్ల నిధులతో నిర్మించిన న్యూ పోలీస్ స్టేషన్ ను,రూ 3.16 నిధులతో నిర్మించిన ఎంపీడీవో ఆఫీసును ఆయన ప్రారంభించారు. సింహాద్రిపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం జగన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట జిల్లా ఇంఛార్జి, మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు, జెసి గణేష్ కుమార్, పాడ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పులివెందుల ఆర్డీవో వెంకటేశం, నాయకులు, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో  సింహాద్రిపురం తహశీల్దార్ డి. మహబూబ్బాషా, ఎంపీడీవో జి కృష్ణమూర్తి, పోలీస్ అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు


ప్రార్థన మందిరంలోని క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్‌

అంతకుముందు ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకున్న సీఎం జగన్‌.. మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం ఘాట్‌లో జరిగే ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారు.  ఈ క్రమంలోనే ఇడుపులపాయలో పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు.

ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement