
సాక్షి, కడప : భర్త ఎస్‌ఐ రాఘవయ్య తనకు అన్యాయం చేశారని సింహాద్రిపురం మండలం బలపనూరుకు చెందిన రాజకుమారి ఆవేదన వక్తంచేశారు. శనివారం ప్రెస్ క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె పేర్కొన్న వివరాలివి. 2014లో ఈమెకు రాఘవయ్యతో వివాహమైంది. నాలుగు నెలలు మాత్రమే కలిసి ఉన్నారు. ఎస్‌ఐ ఉద్యోగం వచ్చాక అతడు ఈమెను పట్టించుకోలేదు. కుమారుడిని ప్రసవించిన 20 రోజులకు వచ్చి చూసి వెళ్లాడు. తరువాత రాలేదు. ఈమె ఫిర్యాదు మేరకు 2016 జూన్‌లో వరకట్న వేధింపు కేసు నమోదయ్యింది.
కేసు విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం రాఘవయ్య అనంతపురం జిల్లా అమడగూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఆ జిల్లా ఎస్పీని రాజకుమారి కలిసినా మార్పు లేదు. విజయవాడకు ఇద్దరినీ కౌన్సిలింగ్‌కు పంపినా ప్రయోజనం లేకపోయింది. విడాకులు కావాలని కోర్టులో భర్త కేసు వేశారని రాజకుమారి చెప్పింది. భర్త కావాలని..ఈ విషయంలో పోలీసు అధికారులు తనకు న్యాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమన్నారు. ఎస్‌ఐ రాఘవయ్య ఫోన్‌లో మీడియాతో మాట్లాడుతూ భార్య నుంచి ఐదేళ్లుగా దూరంగా ఉన్నానన్నారు. కోర్టులో కేసు విచారణ జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment