బంజారాహిల్స్: చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ దొరికిన జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పి.సుధీర్‌రెడ్డి కేసులో వాంటెడ్‌గా ఉన్న ఇన్‌స్పెక్టర్ బల్వంతయ్య శుక్రవారం ఏసీబీ ఎదుట లొంగిపోయారు. దీంతో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. కాగా, డబ్బులు ఇవ్వాలని తానే నిందితుడిని డిమాండ్ చేశానని.. ఎస్‌ఐ సుదీర్‌రెడ్డి ద్వారా తీసుకున్నట్లు బల్వంతయ్య వాం గ్మూలం ఇచ్చారని ఏసీబీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో బల్వంతయ్యతో పాటు సు«దీర్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో ‘పేజ్ 3 లగ్జరీ సెలూన్’నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న వంశీకృష్ణ నుంచి రూ.50 వేల నగదు, 2 మద్యం సీసాలు లంచంగా తీసుకుంటూ గురువారం సు«దీర్‌రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం విదిత మే. ఈ విషయం తెలియడంతో బల్వంతయ్య పరారయ్యారు. అనంతరం ఏసీబీ అధికారుల ఎదుట శుక్రవారం లొంగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment