డబ్బు విషయమై దాడి | The attack on the money | Sakshi
Sakshi News home page

డబ్బు విషయమై దాడి

Published Sat, Jun 28 2014 2:07 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

డబ్బు విషయం ఓ వ్యక్తిపై దాడికి దారితీసింది. సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లెకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త షేక్ పెద్ద బాదుల్లా(58)పై శుక్రవారం టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు.

సింహాద్రిపురం :  డబ్బు విషయం ఓ వ్యక్తిపై దాడికి దారితీసింది. సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లెకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త షేక్ పెద్ద బాదుల్లా(58)పై శుక్రవారం టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. బాధితుడి కుమారుడు సర్దార్ కథనం మేరకు .. శుక్రవారం ఉదయం చీనీ తోటకు నీటి తడులు అందించేందుకు తండ్రి బాదుల్లాతో కలిసి సర్దార్ పొలం వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గీయులు ఓబులేసు, గోపాల్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, చింతలప్ప, రాములు తదితరులు మచ్చుకత్తి, కర్రలతో పెద్ద బాదుల్లాపై దాడి చేశారు. బాదుల్లాకు రెండు చేతులకు తీవ్రగాయాలయ్యాయి.

డబ్బు విషయమై ఆరు నెలల నుంచి బాదుల్లాకు, టీడీపీ కార్యకర్తలకు గొడవ జరుగుతోంది. డబ్బు ఇవ్వాలని టీడీపీ వర్గీయులు బాదుల్లాను వేధిస్తుండేవారు. అలాగే స్థానిక ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా పనిచేశారన్న కక్షతో పొలం వద్దకు వెళ్లిన బాదుల్లాపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలైన అతనిని పులివెందుల ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరి స్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించారు. టీడీపీ వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేశ్వరరెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement