ట్రాన్స్‌ఫార్మర్ పేరుతో రూ.10 లక్షలు వసూలు చేసి.. | Electrical Sub Engineer collects Rs.10 lakhs from Farmers | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్ పేరుతో రూ.10 లక్షలు వసూలు చేసి..

Published Thu, Aug 13 2015 4:49 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Electrical Sub Engineer collects Rs.10 lakhs from Farmers

సింహాద్రిపురం (వైఎస్సార్ జిల్లా) : టాన్స్‌ఫార్మర్ ఇప్పిస్తానని రైతుల నుంచి వసూలు చేసిన రూ.10 లక్షలతో ఓ అధికారి కనిపించకుండా పోయారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన కొందరు రైతులు ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకోగా విద్యుత్ సబ్ ఇంజినీర్ శివప్రసాద్ వారి నుంచి రూ.10 లక్షల వరకు తీసుకున్నాడు.

అయితే గత మూడు రోజులుగా ఆయన కనిపించకుండా పోవటంతో దాదాపు 15 మంది రైతులు గురువారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement