కరెంటు కష్టాలు తీర్చండి | Reduse the Current difficulties | Sakshi
Sakshi News home page

కరెంటు కష్టాలు తీర్చండి

Published Wed, Mar 15 2017 11:43 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

కరెంటు కష్టాలు తీర్చండి - Sakshi

కరెంటు కష్టాలు తీర్చండి

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతుల నిరసన

బాలాయపల్లి: కాలువ సాగేలోపే కరెంట్‌ పోతుందని మండలంలోని నిండలి గ్రామానికి చెందిన రైతులు గూడూరు రూరల్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిండలి రైతులు మాట్లాడుతూ కరెంట్‌ సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో వారం రోజుల నుంచి సాగు, తాగు నీటికి అవస్థ పడుతున్నామని వాపోయారు.

కరెంట్‌ ప్రతి ఐదు నిమిషాలకు వస్తూపోతూ ఉండటంతో మోటారు వద్దే పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. గత వారం బాలాయపల్లి విద్యుత్‌ శాఖ ఏఈ ఓంకార్‌కు సమస్యను విన్నవించినా పట్టించుకోలేదన్నారు. విద్యుత్‌ కోతలతో నిమ్మ చెట్లు ఎండ బెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.  విద్యుత్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement