Current supply
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నామని ట్రాన్స్‌కో ఏడీఈ మోహన్‌బాబు, ఏఈ జావేద్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు తదితర కరెంట్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజలు గమనించి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
నగరానికి వరుణుడి సైరన్!..
సాక్షి, హైదరాబాద్: నగరంలో బుధవారం తెల్లవారుజామున గాలి దుమారంతో కూడిన భారీ వర్షం దడ పుట్టించింది. నగర అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. వర్షాకాలంలోగా ముంపు ముప్పు తప్పించేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించినప్పటికీ, చెప్పుకోదగిన స్థాయిలో పనులు జరగలేదు. దీంతో ముంపుముప్పు పొంచే ఉంది. గంటసేపు కురిసిన ఒక్కవానకే వాస్తవ పరిస్థితి కళ్లకు కట్టింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి. వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇళ్లపైకప్పులు లేచిపోయాయి. రోడ్లపై జనసంచారం లేని సమయం, సెలవు దినాలు కావడంతో తాత్కాలికంగా గండం గట్టెక్కినప్పటికీ, వర్షాకాలంలో తలెత్తనున్న అసలు సినిమాకు టీజర్ రిలీజ్ అయిందని నగర ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. వరద సమస్యలకు పరిష్కారం చూపే నాలాల పనులు మందకొడిగా సాగుతున్నాయి. సీజన్‌లోగా ఇరవై శాతమే పూర్తికాగలవని అధికారులే చెబుతుండటంతో ఈసారీ వాన కష్టాలు పునరావృతం కానున్నాయని తెలుస్తోంది. వర్షాలు కూడా తోడైతే పనులు జరిగే పరిస్థితే ఉండదు. ఈ నేపథ్యంలో, అధికారులు తక్షణ చర్యలకు సిద్ధం కావాల్సిన పరిస్థితిని ప్రకృతి హెచ్చరించింది. డీసిల్టింగ్ పనులు సైతం పూర్తికాకపోవడంతో వరద, డ్రైనేజీ కలగలసి పారిన చిత్రాలు కనిపించాయి. నాలాల పనులు పూర్తికానందున నీటినిల్వ ప్రాంతాలను గుర్తించి వెంటన తోడిపోయాల్సిన చర్యలు తప్పని పరిస్థితి నెలకొంది. ముప్పు.. తప్పేదెప్పుడు? నగరంలో వాన కురిసిందంటే చాలు ప్రధాన రహదారులే చెరువులుగా మారే రంగమహల్ జంక్షన్, మైత్రీవనం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, విల్లామేరీ కాలేజ్, ఆర్పీ రోడ్, ఆలుగడ్డబావి, కార్ఖానా మెయిన్‌రోడ్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, కేబీఆర్ పార్క్, మైలాన్షోరూమ్ (బంజారాహిల్స్), బయోలాజికల్ ఈ లిమిటెడ్,(రామ్‌నగర్), నిజాంకాలేజ్, ఖైరతాబాద్, అయోధ్య జంక్షన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ తదితర ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కాలేదు. కొత్తగా ఇతర ప్రదేశాలు నీటినిల్వ ప్రాంతాలుగా మారాయి. జరిగింది కొంతే.. జరగాల్సింది ఎంతో.. సమస్యల పరిష్కారానికి నాలాల విస్తరణ, ఆధునికీకరణ తదితర పనులు మొదలు పెట్టినా, పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వివిధ ప్రాంతాల్లోని పనులే ఇందుకు నిదర్శనం. నాగమయ్యకుంట నాలా ఆధునికీకరణ పనులు 7 శాతం జరిగాయి. మోహిని చెరువు నుంచి మూసీ నది వరకు వరద కాల్వ పనులు 10 శాతం పూర్తయ్యాయి. యాప్రాల్‌లో నాగిరెడ్డిచెరువు–కాప్రాచెరువు వరదకాలువ పనులు 18 శాతం జరిగాయి. మన్సూరాబాద్ చిన్నచెరువు–బండ్లగూడ చెరువు పనులు 7 శాతం జరిగాయి. బండ్లగూడ చెరువు–నాగోల్ చెరువు పనులు 20 శాతం పూర్తయ్యాయి. నూరినగర్ –డెక్కన్ ప్యాలెస్ వరకు 14 శాతం జరిగాయి. జల్పల్లి ఫిరంగి నాలా– క్యూబా కాలనీ వరకు 3 శాతం మాత్రమే జరిగాయి. సాతం చెరువు నుంచి లంగర్‌హౌస్ (వయా మోతీ దర్వాజా) డ్రెయిన్ పనులు 10 శాతం జరిగాయి. నదీం కాలనీ నుంచి సాతం చెరువు వరకు పనులు 6 శాతం జరిగాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇతర ప్రాంతాల్లో వీటికి అటూఇటూగా పనులు జరిగాయి. ఫిర్యాదులెన్నో.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్కు 48 ప్రాంతాల్లో చెట్లు కూలినట్లు ఫిర్యాదులందగా తొలగించినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇతర మాధ్యమాల ద్వారా నీటి నిల్వ లు, చెట్లు కూలిన ఫిర్యాదులందాయి. ఖైరతాబాద్ జోన్లో 71 ప్రాంతాల్లో, సికింద్రాబాద్ జోన్లో 54 ప్రాంతాల్లో, చార్మినార్ జోన్లో 35 ప్రాంతాల్లో నీటినిల్వలు తొలగించారు. ఖైరతాబాద్‌జోన్‌లో 42, సికింద్రాబాద్జోన్లో 7, చార్మి నార్ జోన్లో 3 కూలిన చెట్లను తొలగించారు. వర్షాల సమస్యలపై జీహెచ్ఎంసీ కంట్రోల్‌రూమ్ 04021111111 లేదా 04029555500 నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ పేర్కొంది. -
Rain: తెలంగాణలో భారీ వర్షం.. ఈదురు గాలుల బీభత్సం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వేసవి ఎండతాపంతో సతమతమవుతున్న ప్రజలకు ఈ భారీ వర్షం కొంత ఉపశమనం కలిగించనుంది. ఇక భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఈదురు గాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు.. అకాల వర్షంతో అన్నదాత మరోసారి ఆగమయ్యాడు. కోతల సమయంలో వర్షం పడటంతో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఇక హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబీహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, సైదాబాద్, చంపాపేట, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్‌లోని సీతాఫల్మండిలో 7.2 సెంటీమీటర్లు, బన్సీలాల్‌పేట్‌లో 6.7 సె.మీ, వెస్ట్ మారేడ్‌పల్లిలో 6.1, అల్వాల్‌లో 5.9, ఎల్బీ నగర్లో 5.8, గోషామహల్ బాలానగర్‌లో 5.4, ఏఎస్ రావు నగర్లో 5.1, బేగంపేటలోని పాటిగడ్డలో 4.9, మల్కాజ్‌గిరిలో 4.7 పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. Heavy rain in early morning in #Hyderabad , pic.twitter.com/RCMkcV8DM8 — Pramod Chaturvedi (ANI) 🇮🇳 (@PramodChturvedi) May 4, 2022 #Hyderabad sees waterlogging in parts of the city after heavy rain on Wednesday morning @timesofindia @TOICitiesNews pic.twitter.com/JqAY7Wr0DH — TOI Hyderabad (@TOIHyderabad) May 4, 2022 -
ఇంట్లో విద్యుత్ సమస్యలు.. స్విచ్ బోర్డు రిపేర్లు తెలుసుకోండిలా..
సాక్షి, వెబ్ డెస్క్: సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లలో విద్యుత్‌కు సంబంధించిన పలు సమస్యలను తలెత్తుతుంటాయి. రాత్రివేళ అకస్మాత్తుగా పవర్ పోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపోయిందని అనుకుంటాము. అయితే, చిన్న చిన్న ఎలక్ట్రికల్ సమస్యలు.. కరెంట్ బల్బ్‌లు మార్చటం, తెగిపోయిన ఫ్యూజ్ స్థానంలో మరోటి అమర్చటం వంటి రిపేర్లను సులభంగానే చేసుకోగలగుతాము. కానీ ఇంట్లోని స్విచ్‌బోర్డులో సమస్య ఉంటే మాత్రం రిపేర్ చేసే సాహసం చేయము. ఎందుకంటే స్విచ్ బోర్డుల్లో పలు రకాల ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంటాయి కనుక. పవర్ సర్యూట్లు ఎక్కడ అనుసంధానం కోల్పోయిందో గుర్తించలేము. అయితే ఇటువంటి వాటిని సంబంధిత ఎలక్ట్రీషియన్స్ మాత్రమే బాగుచేయగలరు. స్విచ్ బోర్డులోని సర్క్యూట్స్ ఇంట్లోని వంట గది, బెడ్రూం, హాల్, బాత్ రూంలకు అనుసంధానమై ఉంటాయి. కరెంట్ వస్తూ, పోతూ ఉండటంతో తరచూ స్విచ్ బోర్డులో సమస్యలు ఏర్పాడతాయి. అయితే కొన్ని సార్లు స్విచ్ బోర్డులు షార్ట్ సర్క్యూట్స్ కారణంగా పేలిపోయి ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు చూశాం. అయితే మీ ఇంట్లోని స్విచ్ బోర్డుల పరిస్థితి ఎలా ఉందో? ఎప్పుడు అవి రిపేర్ దశకు చేరుకున్నాయో తెలుసుకుంటే చాలా ప్రమాదాలను ముందుగానే నివారించవచ్చు. స్విచ్ బోర్డులు రిపేర్‌కు వచ్చాయని తెలుసుకొనే కొన్ని సంకేతాలు మీ కోసం.. 1. స్విచ్ బోర్డుల వద్ద కాలిపోయిన వాసన రావటం.. ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డుల వద్ద కాలిపోయిన వాసన రావటం మనం గమనిస్తాము. కానీ, ఏం కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. అయితే కరెంట్ ఓవర్ లోడ్ వల్ల స్విచ్ బోర్డుల్లో ఉండే వైర్ల నుంచి కాలిపోయిన వాసన వస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జాగ్రత్తపడి ఎలక్ట్రిషియన్‌ను సంప్రదించి కొత్త వాటిని మార్చుకోవాలి. 2. కాలం చెల్లిన పాత స్విచ్ బోర్డులు.. ఇల్లు కట్టినప్పటి నుంచి కొంత మంది స్విచ్ బోర్డులను అసలు మార్చకుండా కాలం గడుపుతారు. అయితే సుమారు 20 ఏళ్లు దాటిన స్విచ్ బోర్డులను తప్పనిసరిగా మార్చుకోవాలి. మారుతున్న సాంకేతికతతో కొత్త ఎలక్ట్రికల్ బోర్డులను ఉపయోంగిచడంతో పలు విద్యుత్ సమస్యలను నిలువరించవచ్చు. పాత వాటిని మార్చటంతో నాణ్యమైన కరెంట్ సరాఫరా ఇళ్లలో పొందవచ్చు. 3. బల్బులు మినుకు మినుకు మంటూ ఆగిపోవటం.. వైర్ల మధ్య చోటు చేసుకున్న లూజ్ కనెక్షన్ల కారణంగా తరచూ ఇంట్లోని బల్బులు మినుకు మినుకు మంటూ ఆగిపోతాయి. అంటే ఇళ్లలోకి వచ్చే విద్యుత్‌తో స్విచ్ బోర్డులపై అధికంగా లోడ్ పడుతోందని గమనించాలి. లేదంటే వాటికి ఆ కరెంట్‌ను సరఫరా చేసే సామర్థ్యం తగ్గినట్టు గుర్తించాలి. 4. సర్క్యూట్స్ పాడవటంతో కరెంట్ ట్రిప్ కావటం.. విద్యుత్ అధిక లోడ్, ఆకస్మికంగా కరెంట్ రావటం, పోవటం కారణంగా స్విచ్ బోర్డులోని పవర్ సర్కూట్లు పాడవుతాయి. పాడైన స్విచ్ బోర్డుల్లో ఉండే విద్యుత్ సర్క్యూట్స్ కారణంగా కరెంట్ తరచూ ట్రిప్ అవుతూ ఉంటుంది. పలు చిన్న, చిన్న సర్క్యూట్స్ తో అనుసంధానమయ్యే స్విచ్ బోర్డులు కరెంట్ లోడ్‌ను తట్టుకోవటం లేదని గుర్తించాలి. 5. తరచూ ఫ్యూజ్‌లు మండిపోవటం.. కరెంట్ సరాఫరా మార్పుల్లో భాగంగా తరచూ స్విచ్ బోర్డులో ఉండే ఫ్యూజ్‌లు మండిపోతాయి. స్విచ్ బోర్డులు కరెంట్‌ను కంట్రోల్ చేయకపోతే కూడా తరచూ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ అయి ఫ్యూజ్ మండిపోయే అవకాశం ఉంటుంది. అయితే ముందుగానే స్విచ్ బోర్డులను పనితీరు, వాటి స్థితిని గుర్తించగలిగితే ఇళ్లలో విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు. -
విద్యుత్ సబ్సిడీలు: ముందు చెల్లిస్తే.. తర్వాత నగదు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంతో సహా ఏదైనా కేటగిరీ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీలు ఇవ్వాలనుకుంటే, నగదు బదిలీ (డీబీటీ) విధానంలో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయానికి ఉచితంగా, గృహాలు, ఇతర వినియోగదారులకు రాయితీపై తక్కువ టారిఫ్‌తో విద్యుత్ సరఫరా కోసం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విద్యుత్ సబ్సిడీలను చెల్లిస్తున్నాయి. డీబీటీ విధానం వస్తే ముందుగా రైతులు, ఇతర వినియోగదారులు పూర్తి స్థాయిలో విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు విద్యుత్ సబ్సిడీ మొత్తాలను బదిలీ చేస్తాయి. విద్యుత్ విధానంలో కీలక సిఫారసులు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటిం చిన ముసాయిదా జాతీయ విద్యుత్ విధానం– 2021లో పలు కీలక సిఫారసులు చేసింది. కాలుష్య రహిత, సుస్థిర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడం, అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను అభివృద్ధి పరచడం, డిస్కంలకు పునరుజ్జీవనం కల్పించడం, విద్యుత్ రంగంలో వ్యాపారాలను ప్రోత్సహించడం, విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలకు సంబంధించిన పరికరాల ఉత్పత్తిని దేశంలో ప్రోత్సహించడం, నిబంధనలను సరళీకరించడం వంటి లక్ష్యాలతో ఈ ముసాయిదాకు కేంద్రం రూపకల్పన చేసింది. రాష్ట్రాలతో సంప్రదింపుల అనంతరం రానున్న ఐదేళ్లలో దీనిని అమలుపరచనుంది. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 22లోగా మీటర్ల అనుసంధానం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఫీడర్లు అన్నింటికీ కమ్యూనికబుల్ మీటర్లు్ల/ ఏఎంఆర్ మీటర్లను బిగించి, వాటిని నేషనల్ పవర్ పోర్టల్ (ఎన్పీపీ)తో డిసెంబర్ 22లోగా అనుసంధానం చేయాలని కేంద్రం రాష్ట్రాలకు గడువు విధించింది. నాన్–కమ్యూనికబుల్ మీటర్లు ఉన్న స్థానంలో కమ్యూనికబుల్ మీటర్లు బిగించాలని స్పష్టం చేసింది. కచ్చితమైన విద్యుత్ సరఫరా లెక్కలు, ఆడిటింగ్ కోసం రానున్న మూడేళ్లలో 100 శాతం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించాలని కోరింది. ఇక రెండు టారిఫ్‌ల విధానం... విద్యుత్ డిమాండ్ అత్యధికం (పీక్), అత్యల్పం (ఆఫ్–పీక్) ఉన్న సమయాల్లో వేర్వేరు విద్యుత్ టారిఫ్‌లను వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలి. విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్న వేళల్లో తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించాలి. ఏటా గడువులోగా క్రమం తప్పకుండా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించేలా ఈఆర్సీలు చర్యలు తీసుకోవాలి. విద్యుత్ సరఫరాకు అవుతున్న మొత్తం వ్యయాన్ని విద్యుత్ చార్జీల రూపంలో రాబట్టుకునేలా టారిఫ్‌ను ఈఆర్సీలు ఖరారు చేయాలి. ప్రైవేటీకరణే శరణ్యం.. విద్యుత్ పంపిణీ రంగంలో సుస్థిరత, అభివృద్ధి కోసం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యాన్ని (పీపీపీ) ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణతో వినియోగ దారులకు మెరుగైన సేవలు లభించడంతో పాటు పోటీతత్వం వృద్ధి చెందుతుంది. ప్రైవేటు ఫ్రాంచైజీల ఏర్పాటు ద్వారా ప్రైవేటీకరణను ప్రవేశపెట్టాలి. ఇందుకు డిస్కంల పరిధిలోని కొంత ప్రాంతంలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను థర్డ్‌పార్టీకి కాంట్రాక్టు పద్ధతిలో అప్పగించాలి. రాష్ట్ర ఈఆర్సీ ఆమోదంతో సబ్ లైసెన్సీల ఏర్పాటు ద్వారా కూడా ప్రైవేటీకరణను ప్రవేశపెట్టవచ్చు. 10 వేల మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి ప్రస్తుతం దేశం 6,780 మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండగా, రానున్న 10 ఏళ్లలో మరో 10 వేల మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఉన్న అవకాశాలపై పరిశీలన జరపాలని నిర్ణయించింది. స్మార్ట్ మీటర్లతో చాలా చేయొచ్చు విద్యుత్ చౌర్యం నివారణ కోసం విద్యుత్ ఆడిటింగ్ వ్యవస్థలో భాగంగా స్మార్ట్ మీటర్లను వినియోగించాలి. వ్యవసాయ వినియోగ దారులకు మీటర్లు ఏర్పాటు చేయడంలో ఆశించిన పురోగతిని రాష్ట్రాలు సాధించలేదు. ఈ విధానాన్ని ప్రకటించిన తర్వాత ఏడాదిలోగా వ్యవసాయ వినియోగదారులతో పాటు అన్ని రంగాల వినియోగదారులకు 100 శాతం మీటర్లు బిగించాలి. 3 ఏళ్లలోగా 100 శాతం వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలి. దీని ద్వారా పీక్, ఆఫ్ పీక్ టారిఫ్ విధానాన్ని అమలు చేయవచ్చు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను వినియోగంలోకి తీసుకొస్తే సుదూర ప్రాంతం (రిమోట్) నుంచి మీటర్ రీడింగ్, బిల్లింగ్, బిల్లుల కలెక్షన్, బిల్లులు చెల్లించకుంటే డిస్ కనెక్షన్ వంటి పనులను డిస్కంలు నిర్వహించవచ్చు. ఇకపై విడుదల చేసే కొత్త కనెక్షన్లకు తప్పనిసరిగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలి. -
జోరువానల్లోనూ విద్యుత్ వెలుగులు
సాక్షి, అమరావతి: వర్షాకాలంలోనూ ఎలాంటి అంతరాయాలు లేకుండా కరెంట్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదేశించారు. విద్యుత్ లైన్లు, టవర్లు, సబ్ స్టేషన్లను తరచూ పరిశీలించాలని సూచించారు. క్షేత్రస్థాయి విద్యుత్తు అధికారులతో శ్రీకాంత్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను విద్యుత్‌శాఖ శుక్రవారం మీడియాకు వెల్లడించింది. ఏఈలు అప్రమత్తం కావాలి... ► గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తే ప్రాంతాల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు తక్షణమే అప్రమత్తం కావాలి. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, కండక్టర్లు తెప్పించుకోవాలి. ఏఈల పనితీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ► ఉత్తరాంధ్రలో వాగులు వంకలు ఉప్పొంగే అవకాశం ఉన్నందున లైన్ మెటీరియల్స్, టవర్ భాగాలు, కండక్టర్లు, ఇన్సులేటర్లను అదనంగా సమకూరుస్తున్నారు. ► డీజిల్ జనరేటర్లు, శాటిలైట్ ఫోన్లు, వాకీటాకీలు సిద్ధంగా ఉంచారు. ► ప్రతి సర్కిల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్‌కు అత్యధిక ప్రాధాన్యం: మంత్రి బాలినేని పొలం పనులు ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ నాటికి నూటికి నూరుశాతం ఫీడర్ల ద్వారా 9 గంటల విద్యుత్ అందించాలన్నారు. ఈ దిశగా జరుగుతున్న చర్యలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ తీసుకుంటున్న చర్యలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. -
మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సాధించిన అద్భుత ప్రగతిని దశదిశలా చాటేందుకు ఎన్నారైలు ముందుకు రావాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రవాస భారతీయులు రాష్ట్రానికి గుడ్ విల్ అంబాసిడర్‌గా, బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని కోరారు. రాష్ట్రాన్ని ఇతర దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పరిచయం చేసేందుకు, ఆసక్తిగల పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వంతో అనుసంధానం చేయడానికి ఎన్నారైలు కలసి రావాలన్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరంలో సోమవారం తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటు చేసిన ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు, విధానాలు, వాటి అమలు తీరుతో పాటు రాష్ట్ర రాజకీయాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్రం ఆవిర్భావం నాటి అయోమయ పరిస్థితి నుంచి ప్రభుత్వం అద్భుత ప్రగతి దిశగా రాష్ట్రాన్ని తీసుకుపోతోందని కేటీఆర్ అన్నారు. దశాబ్దంన్నర క్రితం ఏర్పాటైన రాష్ట్రాలు కూడా ఇంకా పూర్తిగా కుదురుకోని పరిస్థితుల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం మూడున్నర ఏళ్లలోనే అనేక రంగాల్లో దేశానికి ఆదర్శవంతమైన విధానాలతో ముందుకు పోతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణను సాధిస్తామని ఉద్ఘాటించారు. రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన వారే ప్రస్తుతం అభినందించే పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ వచ్చాక ప్రజలకి పవర్ కష్టాలు తొలగిపోతే కాంగ్రెస్ పార్టీకి మాత్రం పవర్ పోయిందన్నారు. కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ మొత్తం కాంగ్రెస్ పవర్ పోతోందని, అందుకే రైతాంగానికి ఇస్తున్న 24 గంటల కరెంట్ సరఫరాను సైతం రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఎన్నారైలు ఇక ధైర్యంగా భూములు కొనవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తాగునీరు, సాగునీరు సదుపాయం కల్పనలకే ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాదాన్యత ఇస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రజల కనీస అవసరాలైన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. చెరువుల ప్రక్షాళన, హైదరాబాద్‌లో మెరుగుపడిన శాంతి భద్రతలు, వాతావరణ కాలుష్యం, క్రీడల అభివృద్ధి తదితర అంశాలపై ఎన్నారైలు లేవనెత్తిన ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. ఎన్నారైలు తెలంగాణలో భూము లు కొనా లంటే ఇక ధైర్యంగా కొనవచ్చని, భూ రికార్డుల ప్రక్షాళన చేసి అన్నీ ఆన్‌లైన్‌లోకి తెస్తున్నామన్నారు. ఈ సమావేశాన్ని జ్యూరిక్‌లో నివాసముంటున్న తెలంగాణ ఎన్నారైలు శ్రీధర్ గండె, అల్లు కృష్ణారెడ్డి, అనిల్ జాలా, కిశోర్ తాటికొండ ఏర్పాటు చేశారు. సమావేశానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు స్వీడన్, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్ దేశాల్లోని తెలుగువారు హాజరయ్యారు. స్విట్జర్లాండ్‌లో టీఆర్ఎస్ శాఖ.. స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పలువురు ఎన్నారైలు టీఆర్ఎస్లో చేరారు. జ్యూరిక్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ ఇప్పటికే దేశ విదేశాల్లో పార్టీ శాఖలను కలిగి ఉందని, తాజాగా స్విట్జర్లాండ్ పార్టీ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి, ప్రపంచం నలుమూలలా ఉన్న తెలంగాణ వారందరికీ చేరేందుకు దోహదం చేస్తుందని కేటీఆర్ అన్నారు. వివిధ దేశాల్లో టీఆర్ఎస్ పార్టీ శాఖల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎన్నారై సమన్వయకర్త మహేశ్ బిగాల స్విట్జర్లాండ్ పార్టీ శాఖను ఏర్పాటు చేశారు. పది మందితో అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలోనే పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మహేశ్ తెలిపారు. -
48 గంటల ముందే ‘24 గంటలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కార్యక్రమం ముహూర్తం కన్నా రెండ్రోజుల ముందే ప్రారంభమైంది! సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన మేరకు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల నుంచి వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల కరెంట్ సరఫరా చేయాల్సి ఉంది. అయితే ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలు, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేసి సరఫరా, పంపిణీ వ్యవస్థల సన్నద్ధతలను పరీక్షించి చూశారు. రాష్ట్రంలో 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభం కావడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. రైతులంతా ఉదయం పూటే పంట పొలాలకు నీళ్లు పెట్టేందుకు పంపు సెట్లను ఆన్ చేయడంతో శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 9,379 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. పంట పొలాలకు రైతులు నీళ్లు పెట్టే సాధారణ వేళలైన ఉదయం 7 గంటల నుంచి 9 గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల సమయంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. గురువారం రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 8,283 మెగావాట్లుగా నమోదు కాగా.. 24 గంటల సరఫరా తర్వాత ఇది 9,379 మెగావాట్లకు ఎగబాకింది. తొలిరోజు అక్కడక్కడ సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలిగినా.. రెండుమూడ్రోజుల్లో సర్దుకుంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస సీఎండీ జి.రఘుమారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ముందస్తు సన్నాహాల్లో భాగంగానే రెండ్రోజుల ముందు 24 గంటల సరఫరా ప్రారంభించామని, అధికారికంగా సరఫరా జనవరి 1 నుంచి ప్రారంభిస్తామన్నారు. రివర్స్ విధానంలో జల విద్యుదుత్పత్తి పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు శ్రీశైలం జల విద్యుదుత్పత్తి కేంద్రం వద్ద రివర్స్ పంపింగ్ విధానంలో ఉత్పత్తిని ప్రారంభించారు. పగటి పూట వినియోగం భారీగా పెరిగి, రాత్రి వేళల్లో డిమాండ్ తగ్గిపోతోంది. దీంతో రాత్రి పూట మిగిలిపోతున్న విద్యుత్‌తో శ్రీశైలం జలాశయంలో నీళ్లను వెనక్కి తోడి, పగటి పూట రివర్స్ పంపింగ్ విధానంలో విద్యుత్ ఉత్పత్తి జరుపుతున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
మహబూబాబాద్ రూరల్: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామపరిధిలోని రంగశాయిపేటకు చెందిన కొల్లు నర్సయ్య(60) తన వరి పొలం వద్ద గల బుర్ర కాలువకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా అక్కడున్న విద్యుత్ మోటార్‌కు కరెంట్ సరఫరా అవుతున్న విషయాన్ని గుర్తించలేదు. విద్యుత్ మోటార్‌కు ఉన్న పైపులకు నర్సయ్య కాళ్లు తగలగానే ఒక్కసారిగా అక్కడికక్కడే విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. -
కరెంటు కష్టాలు తీర్చండి
విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతుల నిరసన బాలాయపల్లి: కాలువ సాగేలోపే కరెంట్ పోతుందని మండలంలోని నిండలి గ్రామానికి చెందిన రైతులు గూడూరు రూరల్ సబ్‌స్టేషన్ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిండలి రైతులు మాట్లాడుతూ కరెంట్ సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో వారం రోజుల నుంచి సాగు, తాగు నీటికి అవస్థ పడుతున్నామని వాపోయారు. కరెంట్ ప్రతి ఐదు నిమిషాలకు వస్తూపోతూ ఉండటంతో మోటారు వద్దే పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. గత వారం బాలాయపల్లి విద్యుత్ శాఖ ఏఈ ఓంకార్‌కు సమస్యను విన్నవించినా పట్టించుకోలేదన్నారు. విద్యుత్ కోతలతో నిమ్మ చెట్లు ఎండ బెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఊరిలో దీపం పెట్టింది!
* కెన్యా అథ్లెట్ ఘనతకు ప్రభుత్వ సాయం * సొంత ఊరికి కరెంట్ సరఫరా ఎన్దబిబిట్ (కెన్యా) : ఒలింపిక్స్ వేదికపై తాను స్వర్ణం సాధించిన క్షణంలో ఆమెకు తెలీదు తాను ఊరివారందరి ఇళ్లల్లో వెలుగు నింపబోతున్నానని... తన గెలుపు ఆటల్లో సాధించిన ఘనత మాత్రమే కాదని, అది చీకటిని చీల్చే కిరణం కానుందని! సాధారణంగా ఒలింపిక్ విజేతలు తాము సాధించిన పతకాలు చూసుకుంటూ జరుపుకునే సంబరాలకు భిన్నమైన కథ ఇది. వివరాల్లోకెళితే... కెన్యా అథ్లెట్ ఫెయిత్ చెపాంగ్టిక్ కిపైగాన్ రియో ఒలింపిక్స్‌లో 1500 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. అయితే ఆ సమయంలో తన కూతురి ఘనతను కనీసం టీవీలో కూడా చూడలేకపోయానని, తమ ఊరు ఎన్దబిబిట్కు కరెంట్ సౌకర్యం కూడా లేదని ఫెరుుత్ తండ్రి శామ్యూల్ కూచ్ తమ దేశాధ్యక్షుడు ఉహురు కెన్యట్టాకు ఆవేదనగా లేఖ రాశాడు. ఇక ముందైనా నా కూతురి పరుగు చూసే అవకాశం కల్పించమని అతను కోరాడు. అంతే... 40 ఏళ్లుగా చీకట్లోనే మగ్గిపోతున్న ఆ ఊర్లోకి విద్యుత్ శాఖ అధికారులు ఒక్కసారిగా వాలిపోయారు. రికార్డు స్థాయిలో తొమ్మిది రోజుల్లో లైన్లు వేయడంతో పాటు కనెక్షన్ కూడా ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వ అత్యున్నత అధికారితో ప్రారంభోత్సవం కూడా చేయించేశారు! చీకటి గదినుంచి రియోకు వెళ్లిన చెపాంగ్టిక్ తన పసిడితో పాటు విద్యుత్ వెలుగుల మధ్య ఇంట్లోకి ప్రవేశించింది. ఆమెకు అద్భుత రీతిలో స్వాగతం పలికిన గ్రామస్థులు... ఆమె వల్లే ఊరికి విద్యుత్ వచ్చిందని, జీవిత కాలం గుర్తుంచుకుంటామని హృదయపూర్వకంగా దీవించారు. దీనిని చూసి తండ్రి హృదయం కూడా పులకించిపోయింది. ఇక ముందు నీ కూతురు ఆటను చూడమంటూ స్యామ్సంగ్ ఫ్లాట్ స్కీన్ టీవీ బహుమతిగా ఇవ్వగా, సూపర్ స్పోర్ట్ డిష్ కనెక్షన్ కూడా ఇచ్చింది. అన్నట్లు... ప్రారంభోత్సవానికి వచ్చిన అధికారి అథ్లెట్‌కు లక్ష షిల్లింగ్లు బహుమతిగా అందిస్తే, ఓవెన్ కొనుక్కునేందుకు స్థానిక ఎంపీ 10 వేల షిల్లింగ్లు అందజేశారు. జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడైతే కిపైగాన్కు గ్యాస్ కుకర్ కొనిస్తానని హామీ ఇచ్చారు! -
ఇకపై ప్రీపెయిడ్ కరెంట్!
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : విద్యుత్ బిల్లులు జారీ, వినియోగదారుల నుంచి వాటిని కట్టించుకోవడానికి ప్రత్యేక విభాగాల నిర్వహణ వంటి తల నొప్పులకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చెక్ పెట్టనుంది. విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేయనుంది. వినియోగదారులు ముందుగా రీచార్జ్ చేసుకుంటేనే కరెంటు సరఫరా చేయాలని చూస్తోంది. దీనివల్ల బకాయిల బాధ కూడా తప్పుతోంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, బడా పారిశ్రామికవేత్తల నుంచి రూ.కోట్లలో బిల్లులు వసూలు కావాల్సి ఉంది. కొందరైతే కోర్టులకు వెళ్లి మరింత తాత్సారం చేస్తున్నారు. వీటన్నింటికీ ప్రీపెయిడ్ విధానమే సరైనదని, ఆ దిశగా నూతన విధానం అమలుకు విద్యుత్ సంస్థ కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రీ పెయిడ్ మీటర్లు అమర్చుతారు ప్రస్తుతం ఉన్న సర్వీసులకు అమర్చిన మెకానికల్, ఎలక్ట్రానిక్ విద్యుత్ మీటర్లు తొలగించి వాటి స్థానంలో ప్రీపెయిడ్ మీటర్లు అమర్చేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. మొదటగా విద్యుత్ బకాయిలు ఎక్కువగా ఉండే ప్రభుత్వ కార్యాలయాలకు బిగించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. దీని నిమిత్తం సంస్థ ఇప్పటికే సుమారు 10 వేల మీటర్లను కొనుగోలు చేసినట్టు తెలిసింది. దుబారాకు కళ్లెం నూతన విధానంలో విద్యుత్ దుబారాకు కూడా కళ్లెం పడనుందని అధికారుల అభిప్రాయం. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఈ విధానం ద్వారా డిస్కంలు నష్టాల నుంచి గట్టెక్కినట్టు సంస్థ ఉన్నతాధికారులు గుర్తించారు. అదే తరహాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లను అమర్చడం ద్వారా విద్యుత్ దుబారాకు కళ్లెం వేయవచ్చని భావిస్తున్నారు. ఎవరికి కావాల్సినంత రీచార్జ్ వారు చేసుకుని విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తారని, తద్వారా దుబారా తగ్గుతుందని అంటున్నారు. సెల్ఫోన్లో రీచార్జ్ అయిపోయిన వెంటనే మాట్లాడుతుండగానే లైన్ ఎలా కట్ అయిపోతుందో ఈ కొత్త విధానంలో విద్యుత్ సరఫరా కూడా రీచార్జ్ అయిపోయిన వెంటనే సరఫరా నిలిచిపోతుంది. అందువల్ల వినియోగదారుడు ఎప్పటికప్పుడు అప్రమత్తమై కొంత మొత్తం ఉండగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పనిచేస్తుంది.. పాత మీటర్లు తొలగించి వాటి స్థానంలో ప్రత్యేక మీటరును అమర్చుతారు. ఈ మీటరుకు ఒక సిమ్ కార్డును అనుసంధానం చేస్తారు. దీంతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎటువంటి అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీటరుకు అయ్యే ఖర్చును పూర్తిగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థే భరిస్తుంది. ఈ విధానం వల్ల బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానం వినియోగదారునికి లేకుండా, బిల్లు వసూలు అవుతుందా లేదా? అనే సందేహం సంస్థకు లేకుండా అటు వినియోగదారులకు, ఇటు సంస్థకు ఉభయతారకంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
* ఎగిరిపడ్డ ఇంటికప్పు రేకులు.. నిలిచిన కరెంట్ సరఫరా * గాలికి ఎగిరిపడ్డ ఊయలలోని చిన్నారి మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు వీచడంతో ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. మహావృక్షాలు నేలకూలాయి. ఇదే సమయంలో పిడుగుపాటుకు పదుల సంఖ్యలో పశువులు మృతి చెందాయి. ఈదురుగాలులకు నిడ్జింత, మన్నాపూర్, దుప్పట్‌గట్, గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మక్తల్‌లో ప్రాణభయంతో గొర్రెల కాపరి పూజరి నర్సింలు(30) చెట్టు ఎక్కాడు. ఈదురుగాలులకు చెట్టు నేలకూలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మాగనూర్ మండలం హిందూపురంలో ఓ చిన్నారి రేకుల ఇంట్లో ఊయలలో ఆడుకుంటోంది. బలమైన గాలి వీచడంతో రేకులతోపాటు ఊయల లేచిపోయి అల్లంతదూరాన ముళ్లపొదల్లో పడింది. అక్కడే ఉన్న స్థానికులు కొందరు గుర్తించి ఆ పసికందును తల్లి శాంతమ్మకు అప్పగించారు. మక్తల్‌లో ఈదురుగాలులకు కరెంట్ స్తంభం విరిగిపోయి ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ సమయంలో కరెంట్ సరఫరాను నిలిపివేయడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో మహబూబ్‌నగర్- రాయిచూర్ ప్రధానరోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అరగంటలో అతలాకుతలం బషీరాబాద్: రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలంలో హోరు గాలికి 200 చెట్ల వరకు నేలకూలాయి. కొర్విచెడ్‌లో చెట్టు మీద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండల కేంద్రంలోని రైస్‌మిల్లులో హోరు గాలికి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మిల్లులోని 200 క్వింటాళ్ల బియ్యం, 80 క్వింటాళ్ల వరిధాన్యం తడిసిపోయాయి. -
ఊపిరాడక.. ఉక్కిరిబిక్కిరి!
నిలోఫర్‌లో కరెంట్ ‘కట్’కటా ఉదయం నుంచి చీకట్లోనే మగ్గిన నవజాత శిశువులు వైద్య పరీక్షలకు, చికిత్సలకు తీవ్ర అంతరాయం సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సహా సర్జికల్, సాధారణ వార్డుల్లో కరెంట్ లేకపోవడంతో వైద్యాధికారులు, నవజాత శిశువులు తీవ్ర ఇబ్బం దిపడాల్సి వచ్చింది. వార్డుల్లో గాలి, వెలుతురు లేక ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వార్మర్లు, ఫొటోథెరపీ యూనిట్స్ పని చేయక రోగు లు మరింత అస్వస్థతకు గురయ్యారు. ఎక్స్‌రే, సిటీస్కాన్, అల్ట్రాసౌండ్, రక్త, మూత్ర పరీక్షలకు అంతరాయం ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో శిశువులు, వార్డుల్లోని బాలింతలు, గర్భిణులు పగలంతా చీకట్లోనే మగ్గాల్సి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం వల్లే... ఆస్పత్రిలో ఇటీవల విద్యుత్ ఉపకరణాల వాడకం రెట్టింపైంది. ట్రాన్స్ఫార్మర్ను అప్‌గ్రేడ్ చేయక పోవడంతో పాటు ఆయిల్ లీకేజీలను అరికట్టక పోవడం వల్ల కాలిపోయింది. ఆస్పత్రిలో రెండు జనరేటర్లు ఉన్నా రోగుల అవసరాలు తీర్చలేకపోయాయి. విద్యుత్‌లేక కొత్త అడ్మిషన్లు సహా ఆరోగ్యశ్రీ సర్వీసులకు తీవ్ర విఘాతం కలిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం.. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం వల్ల ఆస్పత్రిలో కరెంట్ సరఫరా ఆగిన మాట వాస్తవమే. అయితే అత్యవసర విభాగం సహా ఆపరేషన్ థియేటర్స్, లేబర్ వార్డు, ఎన్ఐసీయూ విభాగాల్లోని రోగులకు ఇబ్బందులు త లెత్తకుండా జనరేటర్ సాయంతో విద్యుత్ సరఫరా చేశాం. జనరల్ వార్డులో మాత్రమే సరఫరా నిలిచింది. దీన్నీ సాయంత్రం పునరుద్ధరించాం. - డాక్టర్ జయకృష్ణ, ఆర్ ఎంఓ, నిలోఫర్ -
కన్నీటి సాగు..
- 8 నెలల్లో 9 సార్లు కాలిన ట్రాన్స్ఫార్మర్ - తరచూ కరెంట్ సరఫరాకు అంతరాయం - నీటితడులందక అవస్థలు - వంద ఎకరాల్లో వరి ఎండుముఖం - తాజాగా అమర్చిన మూడు గంటల్లోనే కాలిన వైనం - మరమ్మతుకు వచ్చిన ప్రతిసారీ రూ.5 వేల ఖర్చు - గుండెలు బాదుకుంటున్న రాజిపేట రైతులు రాజిపేట రైతులు కరెంట్ లేక కన్నీటి సాగు చేస్తున్నారు. తరచూ కరెంటు సమస్యతో సతమతమవుతున్నారు. నెలకోసారి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుండడంతో నెత్తినోరు బాదుకుంటున్నారు. మరమ్మతుకు వచ్చిన ప్రతిసారీ రూ.5 వేల చొప్పున ఖర్చు చేస్తున్నారు. మరమ్మతు చేసి బిగించడానికి రోజుల సమయం పడుతుంది. అప్పటిదాక కరెంటు లేక పంటలు ఎండుతున్నాయి. రబీలో దాదాపు వంద ఎకరాల్లో వరి ఎండడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. మెదక్ రూరల్: మెదక్ మండలం రాజిపేట గ్రామ శివారులోగల వెంకటేశ్వరాలయం సమీపంలోని మామిళ్ల వద్ద 100 హెచ్‌పీ ట్రాన్స్ఫార్మర్ ఉంది. దానిపై 19 వ్యవసాయ బోరుబావులున్నాయి. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దాదాపు నెలకోసారి కాలిపోతుంది. కాలిపోయిన ప్రతిసారీ మరమ్మతులు చేయిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ట్రిప్పుకు రూ.5 వేల చొప్పున ఖర్చు చేస్తున్నారు. దీన్ని మరమ్మతులు చేయించి తిరిగి బిగించేందుకు రోజుల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా నీటి తడులందక పంటలు ఎండిపోతున్నాయి. వంద ఎకరాలకు దెబ్బ... రబీ సీజన్లో సుమారు 100 ఎకరాల్లో వరి సాగు చేశారు. మరో ఇరవై రోజుల్లో పంట చేతికందుతుందనగా ఈనెలలోనే నాలుగు సార్లు కాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్ లోడ్ వల్లే కాలిపోతుందని భావించి కొన్ని కనెక్షన్లు తొలగించినా ట్రాన్స్ఫార్మర్ పరిస్థితిలో మార్పు లేదని వారంటున్నారు. తరచూ కాలిపోతుండడంతో టీఆర్ సెంటర్ అధికారులు పాత ట్రాన్స్ఫార్మర్ తీసుకుని కొత్తది అమర్చినా అదే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎనిమిది నెలల్లో తొమ్మిది సార్లు కాలిపోవడంతో సుమారు రూ.45 వేల ఖర్చు వచ్చిందన్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న 100 ఎకరాల వరి పొలాలు కళ్లముందే ఎండిపోవటంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. బిగించిన మూడు గంటల్లోపే.. తాజాగా రెండు రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోగా దాన్ని బాగుచేయించి బిగించిన మూడు గంటల్లోపే మళ్లీ కాలిపోయిందని రైతులు కంటతడి పెట్టారు. ఎకరానికి సుమారు రూ.15 వేల చొప్పున పెట్టుబడులు పెట్టి సాగుచేస్తే ట్రాన్స్ఫార్మర్ కారణంగా పంటలు దెబ్బతిన్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. మెయిన్ లైన్ కింద ఎల్టీ లైన్ వల్లేనా? బోరుబావులకు సరఫరా అయ్యే ఎల్టీ విద్యుత్ వైర్ల పైనుంచే మెయిన్ లైన్ వెళ్తోంది. మామిడి శివారు ప్రాంతంలో స్తంభాలకు పైభాగంలో మెయిన్ వైర్లు ఉంటే ఆ స్తంభాలకే కొంత దూరంలో కింది భాగంలో ఎల్టీ వైర్లను అమర్చారు. దీంతో కరెంట్ సరఫరాలో లోపం ఏర్పడి ట్రాన్స్ఫార్మర్ తరచూ కాలిపోతుందా...? అని రైతులు అనుమానిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి ఎక్కడ సమస్య ఉందో గుర్తించి పరిష్కరించాలని రైతులు రామకిష్టయ్య, రామారావు, గోపాల్, యాదాగౌడ్, సత్తయ్య, చిన్న రామకిష్టయ్య, బాల్‌రాజ్, సాయగౌడ్ తదితరులు కోరుతున్నారు. లేనిచో తమకు ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదంటున్నారు. -
ట్రాన్స్‌కో x మున్సిపాలిటీ
* సంగారెడ్డిలో ముదిరిన వివాదం * బకాయి చెల్లించలేదని మున్సిపాలిటీకి కరెంటు కట్ * ట్రాన్స్‌కో పన్నుల బకాయిపై లెక్కతీస్తున్న మున్సిపాలిటీ సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డిలో ట్రాన్స్ కో, మున్సిపాల్టీల మధ్య వార్ నడుస్తోంది. మున్సిపాలిటీ బకాయిలు పెరిగిపోయాయని ట్రాన్స్‌కో అధికారులు కార్యాలయానికి కరెంటు సరఫరాను నిలిపివేశారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు అసలు ట్రాన్స్‌కో ఆస్తి బకాయి ఎంత ఉందో లెక్కలు తీసే పనిలో ఉన్నారు. ఎవరి లెక్కలు వారివి మున్సిపాల్టీ ట్రాన్స్‌కోకు రూ.5.65 లక్షల బకాయిగా ఉండడంతో వారం రోజుల క్రితం ట్రాన్స్‌కో అధికారులు సరఫరాను నిలిపివేశారు. దీంతో వారం రోజులుగా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. జనన, మరణ ధువపత్రాలతో పాటు ప్రభుత్వం కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు ఏకంగా మున్సిపల్ పాలక వర్గ సమావేశం నిర్వహించి ట్రాన్స్‌కో ఆస్తి పన్ను బకాయిపై లెక్క తీయాలని తీర్మాణం చేశారు. ఆమేరకు మున్సిపాలిటీ అధికారులు ట్రాన్స్‌కో కార్యాలయం భవనంతో పాటు అతిథిగృహం, పట్టణంలో ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు, ఎన్ని విద్యుత్ స్తంభాలు మున్సిపల్ స్థలంలో ఉన్నాయన్న దానిపై మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ గయాసోద్దీన్ సిబ్బందితో కలిసి లెక్కలు వేస్తున్నారు. ట్రాన్స్ కో ఎస్ఈ కార్యాలయంతో పాటు డీఈ , ట్రాన్స్‌కో సమావేశ మందిరానికి సంబంధించి ఇంతవరకు ఆస్తి పన్ను చెల్లించలేదని తేలినట్లు తెలిసింది. కొత్తగా నిర్మించిన మూడు భవనాలకు సైతం మున్సిపాల్టీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. మొత్తంగా ట్రాన్స్‌కో మున్సిపాలిటీకి దాదాపు 9.కోట్ల మేర బకాయిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ట్రాన్స్‌కోకు నోటీసులు పంపేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. రూ.3 లక్షలు చెల్లిస్తామన్నా వినలేదు ట్రాన్స్‌కోకు మున్సిపాలిటీ బకాయి ఉన్న మాట వాస్తవమే. అందువల్లే బిల్లులతో సంబంధం లేకుండా ప్రతినెలా ట్రాన్స్‌కోకు రూ. 3 లక్షలు చెల్లిస్తామన్నా ట్రాన్స్‌కో అధికారులు ఒప్పుకోలేదు. వాస్తవానికి ట్రాన్స్‌కో రూ.5.65 లక్షల బకాయిగా చూపిస్తున్నప్పటికీ, మున్సిపాలిటీ మాత్రం రూ.3 కోట్లు మాత్రమే బకాయిగా ఉంది. ఈ బకాయి అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసి తగు చర్యలు తీసుకుంటాం. -గయాసోద్దీన్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్, సంగారెడ్డి -
షాక్
* ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోతున్న కరెంటు బిల్లులు * జిల్లాలో రూ.97.77 కోట్లు బకాయి * పంచాయతీలది టాప్.. కనెక్షన్లు తొలగింపు ఆదిలాబాద్ అర్బన్ /అగ్రికల్చర్ : రూ.97.77 కోట్లు.. ఇవి మన జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ బిల్లులు వసూలు చేసేందుకు ట్రాన్స్‌కో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగానే ముందుగా పంచాయతీలకు కరెంటు షాక్నిస్తున్నారు. ఇప్పటికే పలు పంచాయతీలకు కరెంటు సరఫరా నిలిపివేయడంతో అంధకారంలో మగ్గుతున్నాయి. మిగతా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా నెలనెలా డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నా వారి నుంచి లాభం లేకుండాపోయింది. దీంతో రూ.కోట్లలో బకాయి పేరుకుపోవడంతో ట్రాన్స్‌కో ఆ దిశగా చర్యలు చేపట్టింది. పెండింగ్‌లో ప్రభుత్వ బకాయిలపై దృష్టి సారించి వసూలు చేయాలని ట్రాన్స్‌కో ఎండీ వెంకటనారాయణ ఇటీవల జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల 46,876 కనెక్షన్లు.. జిల్లాలో నాలుగు విద్యుత్ సర్కిల్లు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రభుత్వ శాఖలకు 46,876 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఆదిలాబాద్ విద్యుత్ సర్కిల్ పరిధిలో 13,252 కనెక్షన్లు ఉండగా, నిర్మల్ సర్కిల్ పరిధిలో 13,100, మంచిర్యాల పరిధిలో 12,934, కాగజ్‌నగర్ పరిధిలో 7,590 కనెక్షన్లు ఉన్నాయి. దీంతోపాటు గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాకు నాలుగు సర్కిళ్ల పరిధిలో మొత్తం 5,312 కనెక్షన్లు ఉండగా, పాఠశాలలు, ఆలయాలకు కలిపి 1,555 కనెక్షన్లు ఉన్నాయి. పేరుకుపోయిన ప్రభుత్వ శాఖల బకాయిల్లో మైనర్ గ్రామ పంచాయతీలు రూ.49 కోట్లతో టాప్‌లిస్టులో ఉన్నాయి. ప్రభుత్వ శాఖల బకాయిల వసూలుతో పాటు అక్రమ విద్యుత్ కనెక్షన్లు తొలగించడం, ఇతర సర్వీసు కనెక్షన్ల నుంచి వసూళ్లు రాబట్టడం లాంటివి చేయనున్నారు. ఈ తరుణంలో మొండి బకాయిలపై కఠినంగా వ్యవహరించనున్నారు. పంచాయతీ కార్యాలయాలకు కనెక్షన్లు కట్.. ప్రథమంగా ఎక్కువగా ఉన్న పంచాయతీ శాఖపై విద్యుత్ అదికారులు దృష్టి సారించారు. జిల్లాలో మేజర్ 27, మైనర్ 839 గ్రామ పంచాయతీలుండగా.. రూ.72 కోట్లు బకాయిలు ఉన్నాయి. పేరుకుపోయిన బకాయిలు వారంలోపు చెల్లించాలని ఆదేశాలు అందించింది. చెల్లించకపోవడంతో జిల్లాలో 60 నుంచి 80 పంచాయతీ కార్యాలయాల కనెక్షన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగించారు. దీంతో పంచాయతీలు రాత్రిల్లో అంధకారంలో మగ్గుతున్నాయి. పలుచోట్ల నీటి పథకాలకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే భరించాలి కౌడాల ప్రభావతి నారాయణ, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కరెంటు కనెక్షన్ తీసేస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత సర్పంచులు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉంది. ఈ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి. ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బిల్లులు ఉన్నాయి. -
రైతుల బతుకులతో ఆడుకుంటున్న ప్రభుత్వం
షాబాద్, న్యూస్‌లైన్: అస్తవ్యస్తమైన కరెంటు సరఫరాతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బతుకులతో ఆడుకుంటోందని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్, చేవెళ్ల నియోజకవర్గ సమన్వయకర్త రాచమళ్ల సిద్దేశ్వర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మద్దూర్ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామాలైన రాంసింగ్ తండా, బిక్యా తండాల్లో శుక్రవారం ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడు గంటల కరెంటు సరఫరా ఉంటుందన్న నమ్మకంతో రబీ సీజన్లోనూ అధిక విస్తీర్ణంలో వరి, కూరగాయలు, పూల తోటలను రైతులు సాగు చేశారన్నారు. కాని ప్రభుత్వం ఇప్పుడు ఆరు గంటలే కరెంటు సరఫరా అని అధికారికంగా ప్రకటించిం దని, అందులోనూ నాలుగు గంటలకు మించి కరెంటు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలకు పతనం తప్పలేదని, దీనికి చంద్రబాబునాయుడే ఉదాహరణ అని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలతోపాటు రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మహానేత వైఎస్‌కే దక్కుతుందున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. తండాల్లో తాగునీటి సమస్య, బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ భూముల్లో పట్టాలు ఇచ్చినా ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఎం.డి. ఖాజాపాషా, కందికొండ వెంకటేశ్‌గౌడ్, మద్దూర్ మాజీ సర్పంచ్ రెడ్యానాయక్, ఎం.డి. అబ్దుల్, షఫీ, మహేందర్, మోహన్, రెడ్యా, నర్సింహా, రవీందర్, గోపాల్, కిషన్, చందర్, హరిచంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత విద్యుత్ పధకంఅమలు కొనసాగేనా?
-
అవసరం తీరింది మరి..!
వరంగల్, న్యూస్‌లైన్ : గ్రామాల్లో కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పంచాయతీ ఎన్నికల ముందు గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించిన సర్కారు... ఎన్నికలు ముగిసిన మరునాటి నుంచే కోతలను అమలు చేస్తున్నది. గత నాలుగు రోజుల నుంచి కరెంట్ సరఫరాలో కోతలు ఎక్కువయ్యాయి. పగటిపూట త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసినప్పుడు మాత్రమే గ్రామాలకు ఇస్తున్నారు. సింగిల్ ఫేజ్ లైన్లకు పగలంతా మొత్తం నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాలకు ఇచ్చే కరెంట్ కేవలం 4గంటలు మాత్రమే. పంచాయతీ ఎన్నికల ముందు ప్రభుత్వం గ్రామాల్లో ఓట్లను రాబట్టుకునేందుకు విద్యుత్‌ను ఎరగా వేసింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో కరెంట్ పూర్తిస్థాయిలో ఇవ్వడంతో అక్కడ అధికార పార్టీకి మొగ్గు ఉంటుందని భావించిన సర్కారు.. పగలు, రాత్రి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిస్కంలకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో ఎన్పీడీసీఎల్ పరిధిలోని గ్రామాలకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేశారు. పట్టణాల్లో కొంత సమయం కోతలు విధించినప్పటికీ... గ్రామాలకు మాత్రం పూర్తిస్థాయిలో సరఫరా చేశారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కూడా తేడా రాకుండా చర్యలు తీసుకున్నారు. కొన్ని ఫీడర్లకు ఒకే విడతలో ఏడు గంటలు సైతం సరఫరా చేశారు. రాత్రిపూట ఇచ్చే కరెంట్‌ను అదనంగానే పరిగణించారు. అయితే విద్యుత్ వాడకం తక్కువగా ఉండటంతో... గ్రామాలకు పూర్తిస్థాయిలో కరెంట్ ఇస్తున్నట్లు సర్కారు, డిస్కంలు ప్రకటించాయి. ఇప్పుడేమైందంటే... పంచాయతీ ఎన్నికలు ముగిసిన మరునాడు నుంచి గ్రామాల్లో విద్యుత్ కోతలు పునరావృతమయ్యాయి. ఈ విషయం గ్రామాల్లోని ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. ఉదయం 6 గంటలకు సింగిల్‌ఫేజ్ సరఫరా నిలిపివేస్తుండగా... 9 గంటలకు త్రీఫేజ్ సరఫరా ఇస్తున్నారు. మధ్యాహ్నం 1గంటకు మళ్లీ సరఫరాకు బ్రేక్ వేసి... సాయంత్రం 6 గంటలకు తిరిగి సింగిల్‌ఫేజ్ కరెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ఊపందుకోవడంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతోందని, కోతలు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కోత పంచాయతీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచే అమల్లో పెడుతున్నట్లు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన 26 రోజుల పాటు గ్రామాల్లో సరఫరాలో ఎలాంటి బ్రేక్డౌన్లు లేవు. కానీ... ఎన్నికలు ముగిసిన మరునాటి నుంచే సరఫరా ఆపేస్తున్నారు. సంగెం మండలం గాడెపల్లిలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వ్యవధిలో కేవలం నాలుగు గంటలు సరఫరా ఇచ్చారు. ఈ నాలుగు గంటల వ్యవధిలో దాదాపు పది సార్లు పది నిమిషాల పాటు ఈఎల్ఆర్(ఎమర్జన్సీ లోడ్ రిలీఫ్) తీసుకున్నారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కూడా అడపదడపా కోత పెట్టారు. అయితే ఇటీవల వరుసగా వానలు కురువడంతో ప్రస్తుతం రాత్రి విద్యుత్ వినియోగం అంతగా లేదని అధికారులే చెబుతున్నారు. కానీ, గ్రామాలకు కోతలు మాత్రం యథావిధిగానే అమలు చేస్తున్నారు. పగలు రెండు గంటలే గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో కరెంట్‌ను కోతలు లేకుండా ఇచ్చారు. ఎన్నికలు కాగానే కోతలు విధిస్తున్నారు. ఆ సమయంలో వర్షాలు కురిసినవి వ్యవసాయానికి అవసరం లేదు. ఇప్పుడు వరినారు పెరిగింది. నాటు వేసే సమయంలో కరెంట్ కోతలు విధిస్తున్నారు. పగటిపూట కేవలం రెండు గంటలే ఇస్తున్నారు. అది కూడా ప్రతి పది నిమిషాలకొకమారు ట్రిప్పు అవుతున్నది. దోణి తడవడం లేదు, దోయ్యపారడం లేదు. ఇంటికిచ్చే కరెంట్ అయితే పొద్దంతా బుగ్గ వెలగడం లేదు. అప్పుడప్పుడు వస్తంది... మళ్లా పోతాంది. - జాటోత్ వాగ్యానాయక్, జాజోత్ తండా, సంగెం