CM YS Jagan YSR Kadapa District Tour Day 3 July 10th Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో ముగిసిన సీఎం జగన్‌ పర్యటన

Published Mon, Jul 10 2023 8:54 AM | Last Updated on Mon, Jul 10 2023 3:18 PM

CM YS Jagan YSR Kadapa District Tour Day 3 July 10th Live Updates - Sakshi

Live Updates:

►వైఎస్సార్‌ జిల్లాలో సీఎం జగన్‌ మూడు రోజుల పర్యటన ముగిసింది. ఈరోజు(సోమవారం) కొప్పర్తిలో పారిశ్రామికవాడ పరిశీలన, అభివృద్ధి పనులను ప్రారంభించారు సీఎం జగన్‌. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమయ్యారు.

► సీఎం జగన్‌ కడప జిల్లా కొప్పర్తి పర్యటనలో భాగంగా పారిశ్రామికవాడ పరిశీలన, అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. వైఎస్సార్‌ ఈఎంసీ క్లస్టర్‌లో ఆల్‌ డిక్సన్‌ యూనిట్‌తోపాటు పలు పారిశ్రామిక యూనిట్లను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఆల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ యూనిట్‌లో సర్వైలెన్స్‌ కెమెరాలు, డిజిటల్‌ రికార్డర్, లాప్‌టాప్‌ తయారీ కేంద్రాలను పరిశీలించారు. సీఎం వెంట సీఎస్‌ జవహర్‌ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంపీ అవినాష్‌ రెడ్డి ఉన్నారు. 

►ఆల్ డిక్సన్ సి.పి ప్లస్ యూనిట్ లో 2 నుంచి 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. చైనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మూడవ అతిపెద్ద యూనిట్ కొప్పర్తిలో ఏర్పాటు కానుంది.

► సీఎం వైఎస్‌ జగన్‌ కొప్పర్తి బయలుదేరి వెళ్లారు. మరికొద్దిసేపటిలో డిక్సన్ యూనిట్‌ను ఆయన ప్రారంభిస్తారు.

► కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగా రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధి పనులను  సీఎం జగన్‌ ప్రారంభించారు.

► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడపకు చేరుకున్నారు. సీఎంకు మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మేయర్ సురేష్ బాబు, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. కాసేపట్లో రాజీవ్‌ మార్గ్‌, రాజీవ్‌ పార్క్‌లను వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.

నేటి సీఎం పర్యటన వివరాలు
వైఎస్సార్‌ కడప జిల్లాలో నేడు (సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.

► ఉదయం 8.50 గంటలకు హెచ్‌సీఎం రెసిడెన్స్‌ నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
► 9.20 గంటలకు కడప ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.
► 9.25 నుంచి 10.00 గంటల వరకు ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు.
► 10.00 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.10 గంటలకు రాజీవ్‌ మార్గ్‌ చేరుకుంటారు.
► 10.20 గంటల వరకు రాజీవ్‌ మార్గ్‌ రోడ్డు ప్రారంభోత్సవంలో గడుపుతారు.
► 10.25కు రాజీవ్‌ పార్కు చేరుకుంటారు.
► 10.35 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు.
► 10.50 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి బయ లుదేరి 11.00 గంటలకు కొప్పర్తి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
► 11.10 గంటలకు అల్‌ డిక్సన్‌ యూనిట్‌కు చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
► 11.35 నుంచి 11.45 గంటల వరకు పారిశ్రామిక యూనిట్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో గడుపుతారు.
► 11.55 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి 12.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు.
► 12.15 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు గన్నవరం విమానాశ్రయానికి వెళతారు
► 1.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళతారు.

రూ.871.77కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
సాక్షి, కడప: కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అందులో రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61కోట్లతో పూర్తయిన రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధి పనులను ప్రారంభించి కడప ప్రజలకు అంకితం చేయబోతున్నారు. అలాగే రూ.15కోట్లతో రెజూవనేషన్‌ ఆఫ్‌ పుట్లంపల్లె లేక్‌(అమృత్‌ 2.0),పాత మున్సిపల్‌ కార్యాలయ ఆవరణంలో రూ.31.17కోట్లతో నిర్మించనున్న కడప నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.

రూ.106.44కోట్లతో కడప కార్పొరేషన్‌ బలహీనవర్గాల హౌసింగ్‌  కాలనీలకు నీటిసరఫరా మరియు సీవర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసేందుకు, రూ.20కోట్లతో బుగ్గవంకపై రెండు నూతన వంతెనల నిర్మాణానికి, రూ.50.22కోట్లతో కడపలో సీవరేజ్,సెపె్టడ్‌ మేనేజ్‌మెంట్‌కు, బ్రహ్మంసాగర్‌ నుంచి కడప కార్పొరేషన్‌కు నీటి సరఫరా చేసేందుకు అమృత్‌ 2.0 కింద రూ.572.76కోట్లతో రూపొందించిన ప్రాజెక్టుకు, రూ.69.20కోట్లతో మేజర్‌ స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ సిస్టమ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.  

సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాజీవ్‌ మార్గ్, రాజీవ్‌ పార్కు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో కడప నగరం ఏపీహెచ్‌బీ కాలనీలో నూతనంగా నిర్మించిన రాజీవ్‌ మార్గ్, రాజీవ్‌ పార్కులు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రాజీవ్‌ మార్గ్‌లో ఫుట్‌పాత్‌లు, పార్కింగ్, డివైడర్లు, వీధి దీపాలతో అందంగా తయారైంది. అలాగే కిడ్స్‌ జోన్, ఓపెన్‌ జిమ్, యోగా జోన్, ఓఏటీ, రిక్రియేషన్‌ లాన్, రెస్ట్‌ రూమ్‌లతో కళాత్మకంగా తీర్చిదిద్దిన రాజీవ్‌ పార్కు సందర్శకులకు ఆహ్వానం పలుకుతోంది.

సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరిరోజున సోమవారం కడప నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కడప ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానం, రాజీవ్‌మార్గ్, రాజీవ్‌ పార్క్, కొప్పర్తి పారిశ్రామిక వాడ, కడప విమానాశ్రయాల వద్ద జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది భారీగా బందోబస్తు విధులను నిర్వహిస్తున్నారు. ఈ విధులలో ఎస్పీతో పాటు, కడప డీఎస్పీ ఎం.డి. షరీఫ్, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement