kadapa tour
-
కడపకు వైఎస్ జగన్
-
పవన్ కల్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: రవీంద్రనాథ్ రెడ్డి
-
అభిమాన నాయకుడిని చూసిన క్షణం.. ఉరకలేసిన ఉత్సాహం (ఫొటోలు)
-
కడప జిల్లాలో YS జగన్ పర్యటన
-
ఇడుపులపాయలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
#YSJagan : అధైర్య పడొద్దు.. భవిష్యత్ మనదే: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
జననేతకు జనం ఘన స్వాగతం.. వైఎస్సార్ జిల్లాలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడపలో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మజార్లకు చాదర్ సమర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా ఆయన నంద్యాల జిల్లాలో పర్యటించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక సూఫీ పుణ్యక్షేత్రం కడప అమీన్‌పీర్ (పెద్ద) దర్గా ఉరుసు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగోరోజు బుధవారం దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలో శిష్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాత్రి ముషాయిరా హాలులో ప్రముఖ గాయకులతో ఖవ్వాలీ కచేరీ నిర్వహించారు. గాయకులు ఒకరినొకరు పోటీలు పడి మహా ప్రవక్త గుణగణాల గురించి గానం చేస్తుండగా భక్తులు తన్మయులై ఆలకించారు. దర్గా ప్రాంగణం రంగురంగుల విద్యుద్దీపాలతో మెరిసిపోతోంది. స్థానికులే కాకుండా బయటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చదవండి: అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్ -
కొప్పర్తిలో ఈఎంసీ క్లస్టర్లో ఆల్ డిక్సన్ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
వైఎస్సార్ జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
Live Updates: ►వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన ముగిసింది. ఈరోజు(సోమవారం) కొప్పర్తిలో పారిశ్రామికవాడ పరిశీలన, అభివృద్ధి పనులను ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమయ్యారు. ► సీఎం జగన్ కడప జిల్లా కొప్పర్తి పర్యటనలో భాగంగా పారిశ్రామికవాడ పరిశీలన, అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. వైఎస్సార్ ఈఎంసీ క్లస్టర్లో ఆల్ డిక్సన్ యూనిట్‌తోపాటు పలు పారిశ్రామిక యూనిట్లను సీఎం జగన్ ప్రారంభించారు. ఆల్ డిక్సన్ టెక్నాలజీస్ యూనిట్లో సర్వైలెన్స్ కెమెరాలు, డిజిటల్ రికార్డర్, లాప్టాప్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. సీఎం వెంట సీఎస్ జవహర్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. ►ఆల్ డిక్సన్ సి.పి ప్లస్ యూనిట్ లో 2 నుంచి 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. చైనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మూడవ అతిపెద్ద యూనిట్ కొప్పర్తిలో ఏర్పాటు కానుంది. ► సీఎం వైఎస్ జగన్ కొప్పర్తి బయలుదేరి వెళ్లారు. మరికొద్దిసేపటిలో డిక్సన్ యూనిట్‌ను ఆయన ప్రారంభిస్తారు. ► కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగా రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్ మార్గ్ అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడపకు చేరుకున్నారు. సీఎంకు మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మేయర్ సురేష్ బాబు, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. కాసేపట్లో రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్క్‌లను వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. నేటి సీఎం పర్యటన వివరాలు వైఎస్సార్ కడప జిల్లాలో నేడు (సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ► ఉదయం 8.50 గంటలకు హెచ్‌సీఎం రెసిడెన్స్ నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ► 9.20 గంటలకు కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ► 9.25 నుంచి 10.00 గంటల వరకు ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ► 10.00 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.10 గంటలకు రాజీవ్ మార్గ్ చేరుకుంటారు. ► 10.20 గంటల వరకు రాజీవ్ మార్గ్ రోడ్డు ప్రారంభోత్సవంలో గడుపుతారు. ► 10.25కు రాజీవ్ పార్కు చేరుకుంటారు. ► 10.35 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. ► 10.50 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయ లుదేరి 11.00 గంటలకు కొప్పర్తి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ► 11.10 గంటలకు అల్ డిక్సన్ యూనిట్‌కు చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ► 11.35 నుంచి 11.45 గంటల వరకు పారిశ్రామిక యూనిట్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో గడుపుతారు. ► 11.55 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 12.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. ► 12.15 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు గన్నవరం విమానాశ్రయానికి వెళతారు ► 1.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళతారు. రూ.871.77కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం సాక్షి, కడప: కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అందులో రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61కోట్లతో పూర్తయిన రాజీవ్ మార్గ్ అభివృద్ధి పనులను ప్రారంభించి కడప ప్రజలకు అంకితం చేయబోతున్నారు. అలాగే రూ.15కోట్లతో రెజూవనేషన్ ఆఫ్ పుట్లంపల్లె లేక్(అమృత్ 2.0),పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో రూ.31.17కోట్లతో నిర్మించనున్న కడప నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.106.44కోట్లతో కడప కార్పొరేషన్ బలహీనవర్గాల హౌసింగ్ కాలనీలకు నీటిసరఫరా మరియు సీవర్ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు, రూ.20కోట్లతో బుగ్గవంకపై రెండు నూతన వంతెనల నిర్మాణానికి, రూ.50.22కోట్లతో కడపలో సీవరేజ్,సెపె్టడ్ మేనేజ్మెంట్కు, బ్రహ్మంసాగర్ నుంచి కడప కార్పొరేషన్‌కు నీటి సరఫరా చేసేందుకు అమృత్ 2.0 కింద రూ.572.76కోట్లతో రూపొందించిన ప్రాజెక్టుకు, రూ.69.20కోట్లతో మేజర్ స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ సిస్టమ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో కడప నగరం ఏపీహెచ్‌బీ కాలనీలో నూతనంగా నిర్మించిన రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కులు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రాజీవ్ మార్గ్‌లో ఫుట్‌పాత్‌లు, పార్కింగ్, డివైడర్లు, వీధి దీపాలతో అందంగా తయారైంది. అలాగే కిడ్స్ జోన్, ఓపెన్ జిమ్, యోగా జోన్, ఓఏటీ, రిక్రియేషన్ లాన్, రెస్ట్ రూమ్‌లతో కళాత్మకంగా తీర్చిదిద్దిన రాజీవ్ పార్కు సందర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. సీఎం పర్యటనకు భారీ బందోబస్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరిరోజున సోమవారం కడప నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కడప ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్ట్స్ కళాశాల మైదానం, రాజీవ్‌మార్గ్, రాజీవ్ పార్క్, కొప్పర్తి పారిశ్రామిక వాడ, కడప విమానాశ్రయాల వద్ద జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది భారీగా బందోబస్తు విధులను నిర్వహిస్తున్నారు. ఈ విధులలో ఎస్పీతో పాటు, కడప డీఎస్పీ ఎం.డి. షరీఫ్, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్ జిల్లా వాసులకు శుభవార్త
-
క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్
-
జీవన విలువల్ని ప్రతిఫలించే మహోన్నత సంబరం క్రిస్మస్
-
క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్
Live Updates: 11.20 AM ► ప్రత్యేక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్ ► చర్చి కాంపౌండ్‌లో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం ► క్రిస్మస్ సందర్భంగా చర్చ్‌లో కేక్ కట్ చేసిన సీఎం జగన్ 9.45 AM ► పులివెందుల భాకరాపురం సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ► క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. సాక్షి, వైఎస్సార్ కడప: ఉదయం 9.05 గంటలకు సీఎం వైఎస్ జగన్ ఇడుపుల పాయ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 9.25 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. 9.45 నుంచి 11.05 గంటల వరకు సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. 11.15 గంటల వరకు సీఎస్ఐ చర్చి కాంపౌండ్‌లో ఏర్పా టు చేసిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. 11.25 గంటలకు విజయా గార్డెన్స్‌కు చేరుకుని సారెడ్డి వరప్రసాద్‌రెడ్డి కుటుంబ సభ్యుల వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. 11.50 నుంచి 12.50 గంటల వరకు భాకరాపురంలోని నివాసంలో గడుపుతారు.1.35 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని విజయవాడకు వెళతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) –పులివెందుల -
అందరికీ సంక్షేమ ఫలాలు.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో సీఎం జగన్
సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రొద్దుటూరులో రూ. 515. 90 కోట్లతో మొత్తం 8 అభివృద్ధి పనులకు సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. .వైఎస్సార్ కడప జిల్లా తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుందన్నారు. ప్రొద్దుటూరులో 30 నెలల కాలంలో లబ్దిదారులకు రూ. 320 కోట్ల నగదు బదిలీ చేసినట్లు వెల్లడించారు. కోర్టు కేసులను పరిష్కరించుకుని ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశామని, ప్రొద్దుటూరులో ఇళ్ల స్థలాల కోసం రూ. 200 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 22, 212 మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రొద్దుటూరులో తాగునీటి పైప్‌లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. మంచి నీటి సౌకర్యం కోసం రూ.119 కోట్లతో 171 కిలోమీటర్ల పొడవైన అధునాతన కొత్త పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. అయిదు ప్రధాన మురికి కాల్వల పనులకు రూ. 163 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. చదవండి: వైఎస్సార్ జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంది: సీఎం జగన్ ప్రొద్దుటూరులో అభివృద్ధి పనులు ►ప్రొద్దుటూరులో రూ.515.90 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ►ప్రొద్దుటూరులోని 5 ప్రధాన మురికి కాల్వల పనులకు రూ.163 కోట్లు ►ప్రొద్దుటూరులో నూతన మంచినీటి పైప్‌లైన్‌కు రూ.119కోట్లు ►ప్రొద్దుటూరులో నూతన కూరగాయల మార్కెట్ కోసం రూ.50.90 కోట్లు ►పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.53కోట్లు ►ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి మౌలిక వసతులకు రూ.20.50కోట్లు ►ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణకు రూ.4.5కోట్లు ►యోగివేమన ఇంజనీరింగ్ కాలేజ్ మౌలిక వసతుల కోసం రూ.66కోట్లు ►ఎస్సీఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ నూతన గదుల నిర్మాణం కోసం రూ.24కోట్లతో పనులు -
రాయచోటి బహిరంగ సభలో సీఎం జగన్
-
జగన్ కడప జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు
-
జమ్మలమడుగులో జగన్‌కు ఘన స్వాగతం
-
జగన్‌కు జమ్మలమడుగులో బ్రహ్మరథం
సాక్షి ప్రతినిధి, కడప: కడప గడపలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు. బుధవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలుసుకొని జనం దారి పొడవునా ఎదురేగి స్వాగతం పలికారు. నాలుగురోడ్ల కూడలి చేరుకోగానే ఓపెన్ టాప్ వాహనంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డిలతో ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆర్యవైశ్యుల ఆహ్వానం మేరకు వైఎస్ జగన్ ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారిశాలకు సమీపంలోనే ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. తరలివచ్చిన జమ్మలమడుగు నేతలు.. వైఎస్ కుటుంబానికి ద్రోహం తలపెట్టి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అండగా తామున్నామంటూ నియోజకవర్గవ్యాప్తంగా నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు తరలివచ్చారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీగా వైఎస్సార్సీపీ అభిమానులు , నాయకులు వచ్చారు. మీకు అండగా మేమున్నామంటూనే, వైఎస్సార్ మా గుండెల్లో ఉన్నారు, అవకాశవాదులకు బుద్ధి చెబుతామంటూ పలువురు నినాదాలు చేశారు. ఏసీసీ బాధితులకు భరోసా.. ఏసీసీ బాధిత రైతుల న్యాయమైన కోర్కెలను సాధించుకోవడానికి వైఎస్సార్సీపీ ముందువరుసలో నిలిచి పోరాటం చేస్తుందని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. మైలవరం మండలం వద్దిరాల, గొల్లపల్లె, ఉప్పలపాడు తదితర గ్రామాలకు చెందిన రైతులు స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు రామాంజనేయులుయాదవ్ నేతృత్వంలో ముద్దనూరు వద్ద కలిశారు. 1996లో సిమెంటు ఫ్యాక్టరీ నిర్మిస్తామంటూ ఏసీసీ యాజమాన్యం తమ ప్రాంతంలో 2700 ఎకరాల పంటపొలాలను కొనుగోలు చేసిందని వివరించారు. ఇప్పటివరకూ కనీసం పునాదిరాయి కూడా వేయలేదని వారు చెప్పారు. అప్పట్లో తక్కువ ధరకు భూములు కోల్పోయిన రైతులకు అదనపు పరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తుంటే అధికారులు తమపై కేసులు పెట్టి గొంతునొక్కుతున్నారని వారు వాపోయారు. రైతుల సమస్యలను ఓపిగ్గా ఆలకించిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాలకుల బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదన్నారు. అప్పట్లో భారతి సిమెంటు ఎకరాకు రూ.2లక్షలు అదనపు పరిహారం చెల్లించిందని, ఇప్పటి ధరల ప్రకారం ఏసీసీ యాజమాన్యం ఎకరాకు రూ.4లక్షలు చెల్లించవచ్చని ఆయన సూచించారు. ఈనెల 20వ తేదీన గొల్లపల్లె వద్ద రైతులు చేపట్టనున్న ధర్నాకు వైఎస్సార్సీపీ తరుపున కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఇన్‌ఛార్జి సుధీర్‌రెడ్డిలు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ప్రొద్దుటూరు ఉత్సవాలకు హాజరు మైసూరు తర్వాత ఆ స్థాయిలో దసరా ఉత్సవాలు నిర్వహించే ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యుల ఆహ్వానం మేరకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రాత్రి దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి, సమీపంలో ఉన్న చెన్నకేశవస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు వైఎస్ జగన్ హాజరవుతున్న విషయం తెలుసుకొని పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు, ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలను ఉత్సవ కమిటీ సన్మానించింది. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్రావు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం పులివెందుల మండలం వెంకటాపురంలో ఇటీవల వృతి చెందిన తిమ్మనాయుడు కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. అలాగే వేముల మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సత్యప్రభావతమ్మ కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో పులివెందులలో ఆయన ఇంటికి వెళ్లి ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. -
తమ్ముళ్లకు క్లాస్ పీకిన బాబు!
ప్రతిపక్ష నేతను దీటుగా ఎదుర్కోలేకపోతున్నారు ఎమ్మెల్యేలకు సహకారం అందించడంలో విఫలం ఇన్చార్జి మంత్రి, జిల్లా అధ్యక్షుడు మధ్య సమన్వయం ఏదీ? ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ కడప: ‘ప్రభుత్వ వ్యూహాన్ని పార్టీ నేతలు అందుకోలేకపోతున్నారు. నాయకుల మధ్య సమన్వయం లోపించింది. నేను ఆశించినంత స్పీడుగా కడప నేతలు ఉండటం లేదు. ఎమ్మెల్యేలకు సహకారం అందించడంలో విఫలమవుతున్నారు. ఇన్చార్జి మంత్రి, జిల్లా అధ్యక్షుడి మధ్యే సమన్వయం లేదు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా తెలుగు తమ్ముళ్లకు తలంటు కార్యక్రమం చేపట్టారు. కడప పర్యటనలో భాగంగా ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో గురువారం తెలుగుదేశంపార్టీ నేతలు, జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు... జిల్లాలో ఉంటూ విపక్షనేతకు దీటుగా స్పందించడంలో విఫలమవుతున్నారని తమ్ముళ్లపై సీఎం ధ్వజమెత్తారు. ఎవ్వరికి వారే పెద్దలు అన్నట్లుగా వ్యవహరించడం మినహా పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడు జిల్లాలో కరువయ్యారని సీఎం పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్నుద్దేశించి గ్రూపులను ప్రోత్సహించడం మినహా సమన్వయంతో వ్యవహరించావా? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. పెద్దదిక్కులా ఉండే నాయకుడు ఒకరైనా ఉన్నారా?. జిల్లా అధ్యక్షుడు, ఇన్చార్జి మంత్రి మధ్య కూడా క్లారిటీ లేకపోతే ఎలా అంటూ గంటా శ్రీనివాసరావు, శ్రీనివాసులరెడ్డికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నా కొందరు అధికారులు తమ మాట పెడచెవిన పెడుతున్నారంటూ నేతలు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సమగ్రమైన ఆధారాలుంటే ఇవ్వండని సీఎం కోరినట్లు సమాచారం. చాలెంజ్‌గా తీసుకోలేకపోయారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాసంకల్పం కార్యక్రమం కడపలో నిర్వహించామని, ఆ మేరకు టీడీపీ నేతలుగా మీరంతా ఎందుకు చాలెంజ్‌గా తీసుకోలేకపోయారని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజల్ని చైతన్యపర్చడంలో విఫలమవుతున్నారని, ఎవ్వరి పనులు వారు చూసుకోవడం మినహా పార్టీ కోసం కష్టపడే వారు ఈ జిల్లాలో కరువయ్యారని ధ్వజమెత్తినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా కార్యక్రమం ఇక్కడే నిర్వహిస్తే, దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారని తమ్ముళ్లను మందలించినట్లు సమాచారం. ప్రతి మూడు నెలలకు ఓమారు వస్తా, పార్టీని మరింత ఉన్నతికి తీసుకెళ్లేందుకు కృషి చేయండి, విభేదాలు వీడి పార్టీ కోసం పని చేయండి, కష్టపడే వారికే పార్టీలో మనుగడ ఉంటుందని గట్టిగా పేర్కొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలకు సహకారం అందించడంలో జిల్లా టీడీపీ విఫలమవుతోందని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విపక్షనేత విమర్శలకు సరైనరీతిలో స్పందించకపోవడమే అందుకు నిదర్శనమని చెప్పుకొచ్చినట్లు సమాచారం. వర్షాలు అధికంగా వస్తే వరదనీరు తెచ్చుకునే అవకాశం కూడా లేదని, పోతిరెడ్డిపాడు సిల్ట్ తీయాల్సి ఉందని ఒకరిద్దరు చెప్పినా సీఎం పెద్దగా స్పందించనట్లు తెలుస్తోంది. మహాసంకల్పం సభ నుంచి ప్రజానీకం త్వరగా వెళ్లిపోయిన నేపథ్యంలోనే తమ్ముళ్లకు తలంటు కార్యక్రమం చేపట్టినట్లు సమాచారం.