సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడపలో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మజార్లకు చాదర్ సమర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా ఆయన నంద్యాల జిల్లాలో పర్యటించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు.
ప్రముఖ ఆధ్యాత్మిక సూఫీ పుణ్యక్షేత్రం కడప అమీన్‌పీర్ (పెద్ద) దర్గా ఉరుసు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగోరోజు బుధవారం దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలో శిష్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రాత్రి ముషాయిరా హాలులో ప్రముఖ గాయకులతో ఖవ్వాలీ కచేరీ నిర్వహించారు. గాయకులు ఒకరినొకరు పోటీలు పడి మహా ప్రవక్త గుణగణాల గురించి గానం చేస్తుండగా భక్తులు తన్మయులై ఆలకించారు. దర్గా ప్రాంగణం రంగురంగుల విద్యుద్దీపాలతో మెరిసిపోతోంది. స్థానికులే కాకుండా బయటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
చదవండి: అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment