Pedda darga
-
దర్గాలో జననేతతో ఆత్మీయ కరచాలనం
-
పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో సీఎం వైఎస్ జగన్
-
కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడపలో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మజార్లకు చాదర్ సమర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా ఆయన నంద్యాల జిల్లాలో పర్యటించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక సూఫీ పుణ్యక్షేత్రం కడప అమీన్‌పీర్ (పెద్ద) దర్గా ఉరుసు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగోరోజు బుధవారం దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలో శిష్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాత్రి ముషాయిరా హాలులో ప్రముఖ గాయకులతో ఖవ్వాలీ కచేరీ నిర్వహించారు. గాయకులు ఒకరినొకరు పోటీలు పడి మహా ప్రవక్త గుణగణాల గురించి గానం చేస్తుండగా భక్తులు తన్మయులై ఆలకించారు. దర్గా ప్రాంగణం రంగురంగుల విద్యుద్దీపాలతో మెరిసిపోతోంది. స్థానికులే కాకుండా బయటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చదవండి: అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్ -
వైభవంగా పీరుల్లామాలిక్ గంధోత్సవం
కడప కల్చరల్: కడప పెద్దదర్గాలో విశిష్ఠ ఖ్యాతి గాంచిన హజరత్ సయ్యద్‌షా పీరుల్లామాలిక్ సాహెబ్ గంథోత్సవం వైభవంగా నిర్వహించారు. గురువులు సజీవ సమాధి అయిన సందర్భంగా దర్గా ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ముఖ్యంగా ప్రధాన మజార్ గల భవనాన్ని మొత్తం పలు రకాల, రంగుల పూలతో కనుల పండువగా అలంకరించారు. బుధవారం ఉదయం దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ప్రత్యేక ప్రార్థనలు చేసి పవిత్ర జలాన్ని భక్తులకు అందజేశారు. రాత్రి ప్రధాన గురువుల మజార్ వద్ద ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దర్గా ప్రతినిధులు వారికి ప్రసాదాలను అందజేశారు. -
కడప పెద్ద దర్గాలో మొహరం సందడి
-
పెద్ద దర్గాలో ఏఆర్ రెహ్మాన్
హైదరాబాద్: ప్రముఖ దర్గాలో ఒకటైన కడప పెద్ద దర్గా( అమీన్ పీర్ దర్గా) ఉరుసు ఉత్సవాల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ , ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. దర్గాలో రెహ్మాన్ ప్రార్థనలు చేశారు. రెహ్మాన్ చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఉరుసు ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణంతో పాటు సమీప ప్రాంతాలు కిటకిటలాడాయి. ముందుగా దర్గా ఆవరణలో మలంగ్‌షాను మేళతాళాలతో పీఠం వద్దకు తీసుకొచ్చి దీక్ష వహింపజేశారు. అర్ధరాత్రి దర్గా గురువులు ఊరేగింపుగా గంధం కలశాన్ని తీసుకొచ్చి ప్రధాన గురువుల మజార్ వద్ద సమర్పించారు. -
పెద్దదర్గాలో హీరో వెంకటేశ్
ప్రముఖ సినీ హీరో వెంకటేశ్ శుక్రవారం వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని సుప్రసిద్ధ పెద్దదర్గాను దర్శించుకున్నారు. స్థానిక నాయకుడు అమీర్‌బాబుతో కలిసి శుక్రవారం ఆయన దర్గాలోని గురువుల మజార్ల వద్ద పూలచాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నాళ్ల నుంచో దర్గాను దర్శించుకోవాలనుకున్నానని, ఆ కోరిక నేటికి తీరడం సంతోషదాయకమన్నారు. వెంకటేశ్‌ను చూసేందుకు మహిళలు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. -కడప కల్చరల్