సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రొద్దుటూరులో రూ. 515. 90 కోట్లతో మొత్తం 8 అభివృద్ధి పనులకు సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. .వైఎస్సార్ కడప జిల్లా తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుందన్నారు. ప్రొద్దుటూరులో 30 నెలల కాలంలో లబ్దిదారులకు రూ. 320 కోట్ల నగదు బదిలీ చేసినట్లు వెల్లడించారు.
కోర్టు కేసులను పరిష్కరించుకుని ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశామని, ప్రొద్దుటూరులో ఇళ్ల స్థలాల కోసం రూ. 200 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 22, 212 మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రొద్దుటూరులో తాగునీటి పైప్‌లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. మంచి నీటి సౌకర్యం కోసం రూ.119 కోట్లతో 171 కిలోమీటర్ల పొడవైన అధునాతన కొత్త పైపులైన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. అయిదు ప్రధాన మురికి కాల్వల పనులకు రూ. 163 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
చదవండి: వైఎస్సార్ జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంది: సీఎం జగన్
ప్రొద్దుటూరులో అభివృద్ధి పనులు
►ప్రొద్దుటూరులో రూ.515.90 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
►ప్రొద్దుటూరులోని 5 ప్రధాన మురికి కాల్వల పనులకు రూ.163 కోట్లు
►ప్రొద్దుటూరులో నూతన మంచినీటి పైప్‌లైన్‌కు రూ.119కోట్లు
►ప్రొద్దుటూరులో నూతన కూరగాయల మార్కెట్ కోసం రూ.50.90 కోట్లు
►పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.53కోట్లు
►ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి మౌలిక వసతులకు రూ.20.50కోట్లు
►ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణకు రూ.4.5కోట్లు
►యోగివేమన ఇంజనీరింగ్ కాలేజ్ మౌలిక వసతుల కోసం రూ.66కోట్లు
►ఎస్‌సీఎన్‌ఆర్ డిగ్రీ కాలేజ్ నూతన గదుల నిర్మాణం కోసం రూ.24కోట్లతో పనులు
Comments
Please login to add a commentAdd a comment